గుండెకు మంచి, జీర్ణక్రియకు మేలు - 'కొంబుచా టీ'తో బోలెడు ప్రయోజనాలు

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Mar 27, 2024

Hindustan Times
Telugu

కొంబుచా అంటే పులియబెట్టిన టీ అని చెప్పవచ్చు. దీనిలో ప్రోబయోటిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి. 

image credit to unsplash

కొబుచా టీని తయారు చేయడానికి ఈస్ట్‌, చక్కెర, బ్లాక్‌ టీని వినియోగిస్తారు. 

image credit to unsplash

కొంబుచా  టీలో ఉండే ప్రొ బయోటిక్స్ మన జీర్ణాశయం, పేగుల్లో ఉండే మంచి బాక్టీరియా సంఖ్యను పెంచుతాయి. దీంతో జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. 

image credit to unsplash

కొంబుచా టీని రోజూ తాగితే.గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. దీన్ని తీసుకుంటే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది, మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. 

image credit to unsplash

గ్రీన్ టీ లాగే కొంబుచా టీలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను ఫ్రీరాడికల్స్‌ నుంచి రక్షిస్తాయి. 

image credit to unsplash

ఈ కొంబుచాలో ఉండే బ్యాక్టీరియా రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. టైప్‌2 డయాబెటీస్‌ పేషంట్లకు చక్కటి ఔషధంలా పనిచేస్తుంది.

image credit to unsplash

మన పొట్టకు అవసరమైన బ్యాక్టీరియా, ఈస్ట్ వీటిలో ఉంటాయి. భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు కొంబుచా తీసుకుంటే ఆహారం సులువుగా విచ్ఛిన్నమవుతుంది. దీని వల్ల పొట్ట ఉబ్బరం వంటివి రావు. 

image credit to unsplash

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels