Before Workout : వర్కౌట్ చేయడానికి ముందు ఇలా చేస్తే బరువు తగ్గుతారు
Before Workout Things : వర్కౌట్ చేసేముందు కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అలా చేస్తేనే త్వరగా బరువు తగ్గుతారు.
వర్కౌట్ చేయడం అనేది చాలా మంది పాలో అవుతారు. బరువు తగ్గేందుకు, బాడీ ఫిట్‌గా ఉండేందుకు జిమ్ వెళ్లి చెమటలు కక్కిస్తారు. కానీ చేసే కొన్ని చిన్నతప్పులతో బరువు తగ్గలేరు. జిమ్‌కి వెళ్లడానికి సమయం లేని వారు, ఇతర శారీరక శ్రమలలో నిమగ్నమవ్వడం వల్ల ఎఫెక్టివ్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. సరైన ఆహారం, సరైన జీవనశైలి అలవాట్లు ఉంటే ఈజీగా బరువు తగ్గొచ్చు.
జిమ్ చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. చక్కటి ఆకృతి గల శరీరాన్ని అందించడమే కాకుండా, ఆరోగ్యకరమైన ఆహారాలు మిమ్మల్ని వ్యాధుల నుండి దూరంగా ఉంచుతాయి. వ్యాయామం చేయడానికి ముందు అనుసరించాల్సిన ఆహారం, శారీరక శ్రమ గురించి కొందరికి అనుమానాలు ఉంటాయి. వ్యాయామం చేయడానికి ముందు ఏమి చేయాలో తెలుసుకోండి.
సాయంత్రమైనా వ్యాయామం చేయండి
మీ వ్యాయామం ఫలితాలను పెంచడానికి ఉత్తమ మార్గం ఏంటంటే మీకు నచ్చిన ఏ రకమైన వ్యాయామంతోనైనా మీ రోజును ప్రారంభించడం. మీ బిజీ షెడ్యూల్ వల్ల ఉదయం పూట ఎలాంటి శారీరక శ్రమ చేయలేకపోయినా సాయంత్రం 15 నిమిషాల పాటు వ్యాయామం చేయవచ్చు. మీ శారీరక శ్రమకు అనుగుణంగా ఉండాలి. స్థిరంగా చేస్తే మీ శరీరంపై వ్యాయామం ప్రభావాన్ని మెరుగుపరుస్తుంది.
వార్మప్ తప్పనిసరి
వర్కవుట్‌లకు ముందు వార్మప్ చేయడం చాలా తప్పనిసరి. శరీరాన్ని సాగదీయడం అనేది చాలా మంది వ్యక్తులు దాటవేస్తూ ఉంటారు. ఇది సాధారణ కార్యకలాపంలా కనిపిస్తుంది. కానీ కచ్చితంగా చేయాలి. శరీరం వేడెక్కేలా చేయడం అవసరం. వ్యాయామం కోసం మీ కండరాలను సిద్ధం చేస్తే.. వ్యాయామం మీకు ఈజీగా అవుతుంది. కండరాలు పట్టుకోవు.
ఫోమ్ రోలర్ ఉపయోగించవచ్చు
ఈ రోజుల్లో ఫోమ్ రోలర్లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఎందుకంటే అవి మీ రక్త ప్రవాహాన్ని పెంచడానికి, మీ కండరాలకు సహాయపడతాయి. ఫోమ్ రోలర్‌లు గొప్ప ఒత్తిడి నివారిణిగా పరిగణిస్తారు. చాలా మంది ప్రముఖ శిక్షకులు దీనిని ప్రీ-వర్కౌట్ సాధనంగా ఉపయోగిస్తారు. వ్యాయామానికి ముందు ఫోమ్ రోలర్ ఉపయోగించి.. రక్తప్రసరణను మెరుగుపరుచుకోవాలి.
ఏం తినాలి?
వ్యాయామానికి ముందు ఏమి తినాలి అనేది చాలా పెద్ద ప్రశ్న. హైడ్రేషన్‌గా ఉండటానికి ఎల్లప్పుడూ ఒక బాటిల్‌ను దగ్గరగా ఉంచుకోండి. వ్యాయామానికి ముందు చేపలు, చికెన్, పెరుగు, చిలగడదుంపలు, అన్నం, బీన్స్‌తో కూడిన తక్కువ కొవ్వు ఆహారం తీసుకోవడం చాలా సిఫార్సు చేస్తారు. ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారం మీ వ్యాయామాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక కప్పు కాఫీ తాగడం కూడా చేయాలని అంటారు.. ఎందుకంటే.. కెఫిన్ తీసుకోవడం మీ నాడీ వ్యవస్థ కార్యాచరణను పెంచుతుంది. అయితే ఏదీ అతిగా మాత్రం తినకూడదు.
వైద్యుల సలహా తీసుకోండి
వైద్యుని సలహా ప్రకారం మీ శరీరానికి సరిపోయే సప్లిమెంట్‌ను ప్రయత్నించండి. మీరు మీ వ్యాయామ సమయంలో త్వరగా అలసిపోయినట్లు అనిపిస్తే, సప్లిమెంట్లు గొప్ప ప్రత్యామ్నాయం. సప్లిమెంట్లలో ప్రధానంగా కెఫీన్ ఉంటుంది. ఇది మీ వ్యాయామ పనితీరును మెరుగుపరుస్తుంది. వ్యాయామాల సమయంలో మీ ఏకాగ్రతను పెంచడంలో సప్లిమెంట్‌లు ఉపయోగపడతాయి. అయితే సొంత నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు..
డోపమైన్, సెరోటోనిన్ వంటి మీ హ్యాపీ హార్మోన్లను పెంచడానికి నిద్ర, విశ్రాంతి అవసరం. నిద్ర మీ శరీరానికి తగినంత శక్తిని ఇస్తుంది. ఇది మంచి వ్యాయామం కోసం అవసరం. ఇది మీ బలాన్ని, పట్టును మెరుగుపరుస్తుంది. వర్కవుట్‌కు ముందు 7 నుండి 9 గంటల వరకు మంచి రాత్రి నిద్రపోవాలి.. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు.
టాపిక్