Coconut Water Recipes। కొబ్బరినీళ్లతో ఈ రెసిపీలు ట్రై చేయండి, అబ్బా అనిపించే రుచి!-3 yummy and refreshing coconut water recipes to quench your thirst in summer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Coconut Water Recipes। కొబ్బరినీళ్లతో ఈ రెసిపీలు ట్రై చేయండి, అబ్బా అనిపించే రుచి!

Coconut Water Recipes। కొబ్బరినీళ్లతో ఈ రెసిపీలు ట్రై చేయండి, అబ్బా అనిపించే రుచి!

HT Telugu Desk HT Telugu
May 06, 2023 12:34 PM IST

Coconut Water Recipes: ఈ వేసవిలో కొబ్బరి నీరుని మించిన రిఫ్రెషింగ్ పానీయం మరొకటి లేదు. లేత కొబ్బరి నీటిని బేస్‌గా ఉపయోగించి చేసే అద్భుత రెసిపీలు ఇక్కడ చూడండి.

Coconut Water Recipes:
Coconut Water Recipes: (instagram)

Coconut Water Recipes: ఎండాకాలంలో కొబ్బరి నీరుని మించిన రిఫ్రెషింగ్ పానీయం (Refreshing Drink) మరొకటి లేదు. ఇది వేడిని అధిగమించడంలో మీకు సహాయపడటమే కాకుండా రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్‌లు కొబ్బరి నీళ్లలో పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నీళ్లలో కొవ్వు తక్కువగా ఉన్నందున అధిక బరువు తగ్గించడానికి కూడా ఇది సరైన పానీయం. డయాబెటిస్‌ను మేనేజ్ చేయడం, రక్తపోటును తగ్గించడం, జీర్ణ సమస్యలను దూరం చేయడం మొదలైన అదనపు ప్రయోజనాలను కూడా కొబ్బరి నీరు అందిస్తుంది.

ఈ వేసవిలో మిమ్మల్ని మీరు చల్లగా ఉంచుకోవడానికి కొబ్బరి నీటితో ఇతర పానీయాలను సిద్ధం చేయవచ్చు. లేత కొబ్బరి నీటిని బేస్‌గా ఉపయోగించి, దోసకాయ, సబ్జా గింజలు, పుదీనా ఆకులను వేసి చేసే అద్భుత రెసిపీలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని ఇక్కడ చూడండి.

Minty Coconut Cooler Recipe కోసం కావలసినవి

మింటీ కొకొనట్ కూలర్ తయారీ విధానం

  1. ఒక జార్ లేదా గ్లాసులో కొబ్బరి నీళ్ళు పోయాలి.
  2. ఒక దోసకాయను ముక్కలుగా కట్ చేసి కొబ్బరి నీళ్లలో వేయాలి.
  3. ఆపైన సబ్జా గింజలను కలపండి, బాగా మిక్స్ చేయండి

అంతే, మింటీ కొకొనట్ కూలర్ రెడీ.

Benefits: ఇందులోని కొబ్బరినీళ్లలో ఎలక్ట్రోలైట్‌లు ఎక్కువగా ఉంటాయి, ఇవి వేసవి తాపాన్ని అధిగమించడానికి, డీహైడ్రేషన్‌ను నివారించడానికి అనువైనవి. సబ్జా గింజలు శరీరంలోని నీటిని నిలుపుకోవడంలో సహాయపడతాయి , మీకు ఫైబర్‌ని అందిస్తాయి. పుదీనా ఆకులలోని మెంథాల్ చర్మంలో కూలింగ్ రిసెప్టర్లను ప్రేరేపిస్తుంది. ప్రతిదీ బాగా కలపండి. మీరు రిఫ్రెష్‌గా ఉండటానికి రోజంతా దీన్ని తీసుకోవచ్చు.

Tender Coconut Milkshake Recipe కోసం కావలసినవి

  • కొబ్బరి మలై
  • కొబ్బరి నీరు
  • పాలు
  • ఏలకుల పొడి
  • చక్కెర
  • జీడిపప్పు
  • బాదంపప్పు

కొబ్బరి మిల్క్ షేక్ తయారీ విధానం

- లేత కొబ్బరి మలైని బయటకు తీసి బ్లెండింగ్ జార్‌లో కలపండి.

- కొబ్బరి నీళ్ళు, పాలు, యాలకుల పొడి కూడా వేసి కలపండి

- పంచదార, జీడిపప్పు, బాదంపప్పు వేసి బ్లెండ్ చేయాలి.

కొబ్బరి మిల్క్ షేక్ రెడీ.

Mango Coconut Slush Recipe కోసం కావలసినవి

  • 1/2 మామిడిపండు ముక్కలు
  • 1/2 కొబ్బరి నీరు
  • 1/2 కొబ్బరి గువ్వం
  • నానబెట్టిన తులసి గింజలు

మ్యాంగో కొకొనట్ స్లష్ తయారీ విధానం

  1. అన్ని పదార్థాలను బ్లెండర్‌లో తీసుకుని బ్లెండ్ చేయాలి.
  2. ఇప్పుడు ఒక గ్లాసులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేయండి
  3. ఆపైన 2 tsp నానబెట్టిన తులసి గింజలు వేయండు
  4. చివరగా మలై కలిపిన మామిడి కొబ్బరి నీటి మిశ్రమాన్ని వేసి బాగా కలపండి.

అంతే, మ్యాంగో కొకొనట్ స్లష్ రెడీ. తాగుతూ రుచిని ఆనందించండి

Benefits: మామిడిపండు రుచికరమైనది మాత్రమే కాదు, విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. కొబ్బరి మలైలోని శక్తితో నిండిన కొవ్వు మీ ఆకలిని తీర్చి ఎక్కువసేపు మీ కడుపును సంతృప్తిగా ఉంచుతుంది. కొబ్బరి నీరు, సబ్జా గింజలు రెండూ శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటాయి.

Whats_app_banner