Refreshing Summer Drinks । వేసవిలో మిమ్మల్ని రిఫ్రెష్ చేసే రుచికరమైన డ్రింక్స్!
Refreshing Summer Drinks: ఈ వేసవిలో మీ శరీరాన్ని సహజంగా హైడ్రేట్ చేసే, మీలోని రోగనిరోధక శక్తిని పెంచే డ్రింక్స్ తాగండి. మామిడి, జామూన్ వంటి సీజనల్ పండ్లతో చేసే రిఫ్రెషింగ్ డ్రింక్స్ రెసిపీలను ఇక్కడ అందిస్తున్నాం, చూడండి.
Summer Refreshing Drinks: ఎండలు మండిపోతున్నాయి, రాబోయే రోజుల్లో ఈ ఎండలు మరింత కఠినంగా ఉండనున్నాయి. కాబట్టి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఎండవేడిని తట్టుకునేందుకు మీకు తగినంత హైడ్రేషన్ అవసరం. అంతేకాకుండా, ఈ వేసవి కాలంలో శరీరం ఘన ఆహారాల కంటే ఎక్కువ ద్రవాల కోసం ఆరాటపడుతుంది. కాబట్టి అవీఇవీ తాగకుండా ఆరోగ్యకరమైన పానీయాలను తాగటం చాలా ముఖ్యం. కార్బోనేటేడ్ డ్రింక్స్, షుగర్ డ్రింక్స్ కు బదులుగా సీజనల్ పండ్లతో చేసే రిఫ్రెషింగ్ డ్రింక్స్ ఎంతో మేలు చేస్తాయి.
సీజనల్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరాన్ని సహజంగా హైడ్రేట్ చేస్తాయి, మీలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మామిడి, జామూన్ వంటి సీజనల్ పండ్లతో చేసే రిఫ్రెషింగ్ డ్రింక్స్ రెసిపీలను ఇక్కడ అందిస్తున్నాం. వీటిని మీ ఇంట్లో తరచుగా చేసుకుంటూ తాగండి.
Mango Jal-jeera Recipe- మామిడి జల్జీరా రెసిపీ
- ఒక పెద్ద సైజు పుల్లని మామిడికాయ తీసుకోండి, దీనిని కడిగి ప్రెషర్ కుక్కర్‌లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి
- ఉడికిన పచ్చి మామిడికాయ నుండి గుజ్జును తీసి మిక్సర్ జార్ లో వేయండి
- ఆపైన 2 టీస్పూన్ల జల్జీరా, నల్ల ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి , 1/2 తాజా కారం వేయండి.
- అలాగే కొన్ని పుదీనా ఆకులు, 2-3 టేబుల్ స్పూన్ల బెల్లం పొడిని కూడా కలిపి, అన్నింటినీ మిక్సీ గ్రైండర్‌లో వేసి మెత్తని గుజ్జుగా చేసుకోవాలి
- ఇప్పుడు ఈ గుజ్జులో కొంచెం ఒక సర్వింగ్ గ్లాస్ లో తీసుకొని, సరిపడా ఐస్ వాటర్ వేసి కరిగించండి.
- చివరగా నిమ్మసం చల్లి, ఆపైన ఒక ఎర్రటి మిరపకాయతో గార్నిష్ చేస్తే మ్యాంగో జల్-జీరా డ్రింక్ రెడీ.
Jamun Juice Recipe - అల్లనేరేడు షర్బత్ రెసిపీ
- అల్లనేరేడు పళ్లను శుభ్రంగా కడిగి, ఆపైన వీటిని ఒక పాన్‌లో వేయాలి నీళ్లు పోసి మరిగించాలి. ఇప్పుడు ఉడుకుతున్న నీటిలో మీ రుచికి తగినట్లుగా ఉప్పు, నల్ల ఉప్పు, వేయించిన జీలకర్ర, మిరియాల పొడి, చక్కెర వేసి కలపండి.
- గుజ్జు నుంచి గింజలు వేరుపడే వరకు ఒక 15 నిమిషాల పాటు మరిగించి, ఆపైన స్టవ్ నుంచి తీసేసి చల్లబరచండి.
- చల్లబడిన జామూన్ మిశ్రమంలోంచి గింజలను ఏరివేసి, గుజ్జును మెత్తగా రుబ్బండి. ఆపైన దాని రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి.
- ఇప్పుడు ఈ రసంను ఒక సర్వింగ్ గ్లాసులోకి తీసుకోండి, రుచిని చెక్ చేసి ఉప్పు, చక్కెర సర్దుబాటు చేసుకోండి.
- గ్లాసుల్లో కొన్ని ఐస్ క్యూబ్స్, కొన్ని పుదీనా రెమ్మలు వేసి పైన జామూన్ షర్బత్ రెడీ.
వేసవిలో ఇలాంటి జ్యూస్‌లు తాగితే మీలోని ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి, మీరు మరింత యాక్టివ్‌గా ఉండగలుగుతారు.
సంబంధిత కథనం