Immunity Boosters। ఎలాంటి రోగాలు రాకుండా, ఆరోగ్యంగా ఉండేదుకు ప్రతిరోజూ ఈ 6 అవసరం!-boost immunity naturally here are 6 supplements to take every day for optimal health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Immunity Boosters। ఎలాంటి రోగాలు రాకుండా, ఆరోగ్యంగా ఉండేదుకు ప్రతిరోజూ ఈ 6 అవసరం!

Immunity Boosters। ఎలాంటి రోగాలు రాకుండా, ఆరోగ్యంగా ఉండేదుకు ప్రతిరోజూ ఈ 6 అవసరం!

HT Telugu Desk HT Telugu
Apr 09, 2023 04:25 PM IST

Immunity Boosters: రోగనిరోధక శక్తిని పెంచడం కోసం, దీర్ఘకాలిక వ్యాధులను నివారణకు మీరు ఆహారంతో పాటు అదనంగా తీసుకోవాల్సిన హెల్త్ సప్లిమెంట్స్ గురించి తెలుసుకోండి.

Immunity boosters
Immunity boosters (Unsplash)

Immune System: మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకూడదు, ఎలాంటి జబ్బులు రాకూడదు అనుకుంటే ముందు మీ శరీరంలో రోగనిరోధక శక్తి పటిష్టంగా ఉండాలి. మీ రోగనిరోధక వ్యవస్థ ఉత్తమంగా పనిచేసినపుడు ఎలాంటి వ్యాధితో అయినా మీ శరీరం సమర్థవంతగా పోరాడుతుంది, మీరు వేగంగా కోలుకుంటారు కూడా. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో రోగనిరోధక శక్తిని పెంచే అంశాలు ఉంటాయి. ఆహారం ద్వారా లభించే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ల్ఫమేటరీ ఏజెంట్లు శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

అయితే ప్రస్తుత కాలంలో ఆహార నాణ్యత, నిశ్చలమైన జీవనశైలి మనలోని రోగనిరోధక శక్తిని క్షీణింపజేస్తున్నాయి. సరైన ఆహారం తీసుకుంట్టునప్పటికీ చాలా మంది పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శరీరానికి కావలసిన పోషకాలను నేరుగా సప్లిమెంట్ల రూపంలో అందించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

పోషకాహార లోపాన్ని భర్తీ చేసే సహజమైన సప్లిమెంట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటిని రోజూ తీసుకోవడం వలన శరీరంలోని రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇంతేకాక, హార్మోన్ల అసమతుల్యత, కాలేయ ఆరోగ్యం, కొలెస్ట్రాల్, జీర్ణ ఆరోగ్యం, గుండె ఆరోగ్యం వంటి అనారోగ్య సమస్యలు మొదలుకొని చర్మం , జుట్టు ఆరోగ్యం వరకు అన్ని సమస్యలను ఈ సప్లిమెంట్లు పరిష్కరిస్తాయి.

Natural Immunity Boosters - సహజ రోగనిరోధక శక్తి బూస్టర్లు

పోషకాహార నిపుణులు ఖుష్బూ జైన్ ఆరోగ్యానికి మేలు చేసే సహజమైన హెల్త్ సప్లిమెంట్లను సూచించారు. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.

మిల్క్ తిస్టిల్

మిల్క్ తిస్టిల్ లేదా దీనినే సిలిబమ్ మరియానమ్‌ అని పిలుస్తారు. ఇందులో సిలిమరిన్ అనే క్రియాశీల సమ్మేళనం ఉంటుంది. ఈ సమ్మేళనం ఒక బలమైన యాంటీఆక్సిడెంట్ , యాంటీ ఇన్ల్ఫమేటరీ ఏజెంట్. ఇది కాలేయ వాపు, కాలేయ క్షీణత సమస్యలను తగ్గిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. మద్యపానం, ధూమపానం కాలుష్యం, శరీర ఉత్పత్తులు, ఆహార సంకలనాలు మొదలైన వాటి టాక్సిన్స్‌ కు గురికావడం వల్ల కలిగే ఫ్రీ రాడికల్ నష్టాన్ని తగ్గిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

పసుపు సప్లిమెంట్

మనం ప్రతికూరల్లో పసుపు వాడతాం. అయితే పసుపు సప్లిమెంట్ ప్రత్యేకంగా లభిస్తుంది. పైపెరిన్ అలాగే కొన్ని రకాల కొవ్వులు, కొబ్బరి నూనె వంటి సమ్మేళనాలు కలిగిన టర్మరిక్ ఎక్స్ ట్రాక్ట్ సప్లిమెంట్ తీసుకోవడం చాలా మంచిది. ఇది శరీరంలోని ప్రతి ఒక్క అవయవాన్ని దెబ్బతినకుండా రక్షిస్తుంది, వాపును తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, గుండె జబ్బులను తగ్గిస్తుంది, క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది, ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌లతో సహాయపడుతుంది.

ఆల్గే ఆయిల్

ఆల్గే ఆయిల్ అనేది శాఖాహార మూలికా తైలం. ఇందులో కూడా ఫిష్ ఆయిల్ లో లభించే ఒమేగా-3 పుష్కలంగా ఉంటుంది. ఒమేగా -3 శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని, రక్తపోటును నియంత్రిస్తుంది. హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తుంది. డిప్రెషన్ భావాలను నియంత్రిస్తుంది. ఇన్సులిన్ సున్నితత్వాన్ని నియంత్రిస్తుంది, కంటిచూపూ మెరుగుపరుస్తుంది.

స్పిరులినా

స్పిరులినా అనేది నీలి ఆకుపచ్చ శైవలం, దీనిని ఎండబెట్టి పొడి చేసి తినవచ్చు. ఇందులో ప్రోటీన్, కాపర్ మూలకాలు సమృద్ధిగా ఉంటాయి. స్పిరులినా 'ఫైకోసైనిన్' అనే క్రియాశీల సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది, ఇది ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది, HbA1c, కొలెస్ట్రాల్, రక్తపోటు, మెటబాలిక్ సిండ్రోమ్ లక్షణాలను తగ్గిస్తుంది. అలర్జిక్ రినైటిస్ ఉన్నవారికి కూడా ఇది చాలా మంచిది. అథ్లెట్లకు, బాడీ బిల్డింగ్ చేసేవారికి దీనిని సిఫారసు చేస్తారు.

త్రిఫల

త్రిఫల అనేది హరిటాకీ, అమలాకీ, భిభిటాకీ అనే 3 మూలికల కలయిక. ఈ సప్లిమెంట్ మలబద్ధకం, అసిడిటీ నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా ఒత్తిడిని నియంత్రిస్తుంది. కాలేయం దెబ్బతినకుండా నివారిస్తుంది. శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. త్రిఫలను ఎల్లప్పుడూ నీటిలో కలుపుకొని ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోవాలి.

రెస్వెరాట్రాల్

రెస్వెరాట్రాల్ అనే సమ్మేళనం ద్రాక్ష, బెర్రీలు, చిక్‌పీస్, రెడ్ వైన్‌లో కనిపిస్తుంది. ఇది చాలా రకాల అనారోగ్య సమస్యలను పరిష్కరించగలదు. ఇది రక్తంలోని కొవ్వును తగ్గిస్తుంది. చర్మం, మెదడులో వయస్సు సంబంధిత మార్పులను నెమ్మదిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. అలాగే PCOS, టైప్ 2 డయాబెటిస్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలను నిరోధిస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ సహ ఇతర స్వయం ప్రతిరక్షక రుగ్మతల లక్షణాలను కూడా తగ్గిస్తుంది.

ఈ సప్లిమెంట్లు చాలా వరకు సహజమైనవి, సురక్షితమైనవి, అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగినవి. అయినప్పటికీ, వీటిని తీసుకునేముందు వైద్యుడితో చర్చించడం చాలా ముఖ్యం.

WhatsApp channel

సంబంధిత కథనం