The Anti-ageing Juice | ఈ జ్యూస్ తాగితే ముసలితనం పోయి పడుచుతనం వస్తుంది!
- వృద్ధాప్యం అనేది సహజమైన ప్రక్రియ, దీనిని ఎవరూ ఆపలేరు. అయితే వృద్దాప్య ఛాయలను నివారించి, యవ్వనంగా కనిపించేందుకు మార్గాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి, పోషకాహారంతో దీనిని తగ్గించవచ్చు. కొన్ని పండ్లరసాలు తాగితే వృద్ధాప్య ఛాయలు దూరమవుతాయి. అవేంటో ఒక చూపు చూడండి.
- వృద్ధాప్యం అనేది సహజమైన ప్రక్రియ, దీనిని ఎవరూ ఆపలేరు. అయితే వృద్దాప్య ఛాయలను నివారించి, యవ్వనంగా కనిపించేందుకు మార్గాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి, పోషకాహారంతో దీనిని తగ్గించవచ్చు. కొన్ని పండ్లరసాలు తాగితే వృద్ధాప్య ఛాయలు దూరమవుతాయి. అవేంటో ఒక చూపు చూడండి.
(1 / 8)
వృద్ధాప్యం మొదలయ్యే కొద్దీ చర్మం ముడతలు పడుతుంది, జుట్టు తెల్లబడుతుంది. ఇలాంటి సంకేతాలను తగ్గించటానికి పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ కొన్ని జ్యూస్ లను సూచించారు. వాటిని ఇక్కడ తెలుసుకోండి.(Unsplash)
(2 / 8)
వృద్ధాప్య ప్రక్రియను మందగించడంలో పండ్లు, కూరగాయలు ముఖ్యంగా ముదురు రంగులో ఉన్నవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి చర్మ కణాలను ఆరోగ్యవంతం చేస్తాయి. వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేస్తాయి.(Unsplash)
(3 / 8)
ఉసిరి, దానిమ్మ, నల్ల ద్రాక్షతో కలిపి పవర్-ప్యాక్డ్ యాంటీ ఏజింగ్ జ్యూస్‌ని తయారుచేసుకోవచ్చు. రుచి కోసం చక్కెరకు బదులుగా బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా కలుపుకోవచ్చు.(Unsplash)
(4 / 8)
విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరిపండ్లు తీసుకుంటే వాటిలోని పోషకలు శరీరాన్ని పునరుజ్జీవింపజేయడంలో, వృద్ధాప్యాన్ని మందగించడంలో సహాయపడుతాయి.(Unsplash)
(5 / 8)
దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ ఇ, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ వృద్ధాప్యాన్ని తగ్గించడంలో తోడ్పడతాయి. కాబట్టి రోజూ ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ తాగాలి.(Unsplash)
(6 / 8)
ఆర్థరైటిస్, అల్జీమర్స్, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడానికి కూడా దానిమ్మ మంచిది.(Unsplash)
(7 / 8)
నల్ల ద్రాక్ష యాంటీ ఏజింగ్ గుణాలను కలిగి ఉండటంతో పాటు రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో, క్యాన్సర్‌తో పోరాడడంలో సహాయపడుతుంది.(Unsplash)
ఇతర గ్యాలరీలు