LIVE UPDATES
Andhra Pradesh News Live September 7, 2024: AP Rains : తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్, రానున్న రెండు రోజులు ఏపీలో భారీ వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 07 Sep 202404:00 PM IST
Andhra Pradesh News Live: AP Rains : తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్, రానున్న రెండు రోజులు ఏపీలో భారీ వర్షాలు
- AP Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి...ఉత్తర దిశగా కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 9న ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
Sat, 07 Sep 202402:41 PM IST
Andhra Pradesh News Live: Duvvada Issue : దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి దివ్వెల మాధురి, ఇల్లు తనదేనని వీడియో విడుదల
- Duvvada Issue : దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వివాదంలో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. శ్రీనివాస్ తన ఇంటిని స్నేహితురాలైన దివ్వెల మాధురికి రిజిస్ట్రేషన్ చేశారు. ఇవాళ ఆమె దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి వచ్చారు. దీంతో దువ్వాడ భార్య వాణి, పిల్లలు దివ్వెల మాధురిపై మండిపడుతున్నారు.
Sat, 07 Sep 202401:42 PM IST
Andhra Pradesh News Live: AP Floods Damage : ఏపీలో వరద నష్టం ప్రాథమిక అంచనా రూ.6882 కోట్లు-సోమవారం నుంచి మూడ్రోజుల పాటు నష్టం గణన
- AP Floods Damage : ఇటీవల భారీ వర్షాలు, వరదలకు ఏపీ భారీగా నష్టపోయింది. సుమారు రూ.6882 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. ఈ నివేదికను కేంద్రానికి పంపనుంది. అలాగే సోమవారం నుంచి మూడ్రోజుల పాటు వరద బాధిత ప్రాంతాల్లో నష్టం అంచనా వేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Sat, 07 Sep 202409:38 AM IST
Andhra Pradesh News Live: Rajahmundry Leopard Movement : రాజానగరం-రాజమండ్రి ఫారెస్ట్ ఏరియాలో చిరుత కలకలం, సీసీటీవీ దృశ్యాలు వైరల్
- Rajahmundry Leopard Movement : రాజానగరం-రాజమండ్రి ఫారెస్ట్ ఏరియాలో చిరుత కలకలం రేపింది. రాజమండ్రి లాలాచెరువు రేడియో స్టేషన్ వద్ద సీసీ కెమెరాల్లో చిరుత సంచారం దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సూచించారు.
Sat, 07 Sep 202409:00 AM IST
Andhra Pradesh News Live: Where Is YCP: వరద సహాయక చర్యల్లో కానరాని వైసీపీ, మళ్లీ బెంగుళూరు వెళ్ళిపోయిన జగన్
- Where Is YCP: విజయవాడ నగరాన్ని బుడమేరు ముంచెత్తి వారం రోజులవుతోంది. ఇప్పటికీ సగం నగరం వరద ముంపులోనే ఉంది. విజయవాడతో పాటు రూరల్ మండలాల ప్రజలు ఆహారం, తాగునీటి విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మునుపెన్నడు లేని విపత్తును జనం ఎదుర్కొంటున్న వేళ ప్రధాన ప్రతిపక్షం బయటకు రాకపోవడం చర్చగా మారింది.
Sat, 07 Sep 202408:27 AM IST
Andhra Pradesh News Live: Budameru Leakage : బుడమేరు మూడో గండి పూడ్చివేత, బండ్ ఎత్తు పెంచే పనులు ప్రారంభం
- Budameru Leakage : బుడమేరు గండ్లను విజయవంతంగా పూడ్చివేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆర్మీ సాయంలో పెద్దదైన మూడో గండిని శనివారం పూడ్చి వేశారు. ఇటీవల భారీ వర్షాలకు బుడమేరుకు మూడు చోట్ల గండి పడింది. ఈ గండ్ల వలన విజయవాడ ముంపునకు గురైంది.
Sat, 07 Sep 202408:21 AM IST
Andhra Pradesh News Live: Budameru Flood: ఇంతకీ బుడమేరుకు వచ్చిన వరద ఎంత, ఏ మండలంలో ఎంత వర్షం కురిసింది? స్పష్టతనివ్వని ప్రభుత్వం..
- Budameru Flood: విజయవాడ నగరాన్ని బుడమేరు వరద ముంచెత్తి వారం రోజులవుతోంది. ఆగస్టు 30,31 తేదీల్లో బంగాళాఖాతంలో మొదలైన వర్షంతో మొదలైన అలజడి ఉప్పెనగా మారి విజయవాడను ముంచెత్తింది.వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నా విజయవాడను ఆకస్మిక వరదలు ముంచెత్తాయని అధికారులు చెబుతున్నారు. ఇంతకు విజయవాడలో కురిసిన వర్షం ఎంత..?
Sat, 07 Sep 202408:05 AM IST
Andhra Pradesh News Live: AP ICET 2024 Updates : ఏపీ ఐసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ - రిజిస్ట్రేషన్ కు ఇవాళే చివరి తేదీ.! ఈ డేట్స్ ను మర్చిపోకండి
- AP ICET 2024 Counselling 2024: ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సెకండ్ ఫేజ్ లో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లకు ఇవాళ్టితో గడువు పూర్తి అవుతుంది. అర్హత సాధించిన అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.
Sat, 07 Sep 202406:55 AM IST
Andhra Pradesh News Live: Rajanagaram : బైక్‌ను ఢీకొట్టిన లారీ.. స్పాట్‌లోనే ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
- Rajanagaram : తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. విద్యార్థుల కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.
Sat, 07 Sep 202404:33 AM IST
Andhra Pradesh News Live: Tirumala : తిరుమలలో మరిన్ని మార్పులు..! ఇకపై 'ఆధార్' ప్రామాణికంగా సేవలు - టీటీడీ తాజా నిర్ణయాలివే
- తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఆధార్ ప్రామాణికంగా సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఇందుకు ప్రాథమికంగా కేంద్రం నుంచి అనుమతి లభించిందని టీటీడీ ఈవో తెలిపారు. తిరుమలలో దళారీ వ్యవస్థకు చెక్ పెట్టడమే లక్ష్యంగా సంస్కరణలు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.
Sat, 07 Sep 202403:40 AM IST
Andhra Pradesh News Live: Eluru : వరసకు చెల్లిలైన బాలికపై యువకుడు అత్యాచారం.. పోక్సో కోర్టు సంచలన తీర్పు
- Summary: ఏలూరు జిల్లాలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడి కేసులో.. పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. యువకుడికి జీవితకాల జైలు శిక్షతో పాటు రూ. 5 వేలు జరిమాన విధించింది. బాధితురాలికి నష్ట పరిహారం రూ.3 లక్షల చెల్లించాలని ఏలూరు పోక్సో కోర్టు తీర్పు ఇచ్చింది.
Sat, 07 Sep 202403:14 AM IST
Andhra Pradesh News Live: AP TG Floods : తెలుగు రాష్ట్రాలకు ఇంటర్ మినిస్టీరియల్ టీమ్..! వరద నష్టంపై అంచనా వేయనున్న కేంద్ర బృందాలు
- ఏపీ, తెలంగాణకు కేంద్ర బృందాలు రానున్నాయి.రెండు రాష్ట్రాలకు అన్ని విధాలా సాయం అందిస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలను త్వరలో ఇంటర్ మినిస్టీరియల్ కేంద్ర బృందం పరిశీలిస్తుందని పేర్కొన్నారు.
Sat, 07 Sep 202411:47 PM IST
Andhra Pradesh News Live: Prakasam Barrage : కుట్ర కోణం ఉందా..? బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన ఘటనపై ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు
- ఏపీలో భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నగరం ఉక్కిరిబిక్కిరి అయిన సంగతి తెలిసిందే. అయితే భారీ వరదల క్రమంలోనే సెప్టెంబర్ 1వ తేదీన ప్రకాశం బ్యారేజీని నాలుగు బోట్లు ఢీకొట్టాయి. దీంతో పలు గేట్లు స్వల్పంగా డ్యామేజీ అయ్యాయి. ఈ ఘటనపై తాజాగా ఇరిగేషన్ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.