Duvvada Issue : దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి దివ్వెల మాధురి, ఇల్లు తనదేనని వీడియో విడుదల-duvvada srinivas family issues divvala madhuri released video house belongs to her ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Duvvada Issue : దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి దివ్వెల మాధురి, ఇల్లు తనదేనని వీడియో విడుదల

Duvvada Issue : దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి దివ్వెల మాధురి, ఇల్లు తనదేనని వీడియో విడుదల

Bandaru Satyaprasad HT Telugu
Sep 07, 2024 08:12 PM IST

Duvvada Issue : దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వివాదంలో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. శ్రీనివాస్ తన ఇంటిని స్నేహితురాలైన దివ్వెల మాధురికి రిజిస్ట్రేషన్ చేశారు. ఇవాళ ఆమె దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి వచ్చారు. దీంతో దువ్వాడ భార్య వాణి, పిల్లలు దివ్వెల మాధురిపై మండిపడుతున్నారు.

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి దివ్వెల మాధురి, ఇల్లు తనదేనని వీడియో విడుదల
దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి దివ్వెల మాధురి, ఇల్లు తనదేనని వీడియో విడుదల

Duvvada Issue : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద ఇంటిలోకి దివ్వెల మాధురి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇంట్లోకి వెళ్లేందుకు గత కొంత కాలంగా దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, కుమార్తెలు ప్రయత్నిస్తున్నారు. ఆ ఇంటి బయటే గత నెల రోజులుగా దువ్వాడ వాణి ఆందోళన చేస్తున్నారు. అయితే శనివారం సడెన్ గా ఆ ఇంట్లోకి దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు దివ్వెల మాధురి ఎంటరయ్యారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

దువ్వాడ శ్రీనివాస్‌ ఇంటిలోకి దివ్వెల మాధురి వెళ్లడంతో... అక్కడ ఆందోళన చేస్తున్న దువ్వాడ భార్య వాణి, కుమార్తెలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా... పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్ ఆ ఇంటిని క్యాంప్ కార్యాలయంగా ప్రకటించుకున్నారు. అయితే దువ్వాడ వాణికి ఆ ఇంట్లోకి ప్రవేశించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో దువ్వాడ శ్రీనివాస్ ఆ ఇంటిని తన స్నేహితురాలైన మాధురి పేరుపై రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కారణాలతో ఇంటి వివాదం మరింత ముదిరే విధంగా కనిపిస్తుంది. దివ్వెల మాధురి దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లడంతో దువ్వాడ వాణి, కుమార్తెలు, బంధువుల సహాయంతో ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ మారిన సంగతి తెలిసందే. దువ్వాడ శ్రీనివాస్ తన భార్య వాణి విడిచిపెట్టి... దివ్వెల మాధురి అనే స్నేహితురాలి వద్ద ఉంటున్నారు. దీంతో గత నెల రోజులుగా దువ్వాడ భార్య, పిల్లలు ఆ ఇంటి వద్ద నిరసన చేస్తున్నారు. ఈ విషయం కోర్టుల దాకా వెళ్లింది. ఈ వివాదంపై సీరియస్ అయిన వైసీపీ అధిష్ఠానం... దువ్వాడ శ్రీనివాస్ ను టెక్కలి ఇన్ ఛార్జ్ పోస్టు నుంచి తప్పించింది. అయితే తాజాగా సీన్ లోకి మరోసారి దివ్వెల మాధురి ఎంట్రీ ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది.

ఆ ఇల్లు నాదే - దివ్వెల మాధురి

దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇల్లు తనదే అంటూ దివ్వెల మాధురి ఓ వీడియో విడుదల చేశారు. ఈ ప్రొపర్టీ తన పేరుపై ఉందని, తన ఇంటిలోకి ఎవరూ రావడానికి వీలులేదని స్పష్టం చేశారు. దువ్వాడ శ్రీనివాస్‌తో ఏమైనా సమస్య బయట తేల్చుకోవాలంటూ సలహా ఇచ్చారు. తాను గతంలో దువ్వాడ శ్రీనివాస్ కు రూ.2 కోట్లు అప్పుగా ఇచ్చానని, ఆ అప్పు తీర్చమని అడిగితే ప్రస్తుతం డబ్బులు లేవని ఇంటిని రాసిచ్చారని దివ్వెల మాధురి వీడియోలో తెలిపారు. ఈ ఇల్లు తాను కోనుక్కున్నానని, పోలీసులు తనకు రక్షణ కల్పించాలని కోరారు.

"దువ్వాడ శ్రీనివాస్‌ నుంచి ఏం ఆశించి డబ్బులు ఇవ్వలేదు. గతంలో రూ.2 కోట్లు ఇచ్చా...ఇటీవల మరో రూ.50 లక్షలు తీసుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్‌ ముందు కట్టిన ఇల్లును వాణి సొంతం చేసుకుంది. ఇప్పుడు కొత్త ఇంటిని కూడా లాక్కోవాలని ప్రయత్నిస్తుంది. దీంతో నా డబ్బులు ఇవ్వమని అడిగాను. తాను ఇప్పుడు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేనని, నీకు అన్యాయం చేయను అన్నారు. డబ్బులు లేవని ఈ ఇంటిని నీ పేరున రిజిస్టర్ చేస్తానని చెప్పారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇల్లు నా పేరున రిజిస్ట్రేషన్‌ చేశారు. నేను దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో లేను. నా ఇంటికే నేను వచ్చాను. నా ఇంటికే దువ్వాడ వాణి, ఆమె పిల్లలు వచ్చి గొడవ చేస్తున్నారు. ఇది నేను కొనుగోలు చేసిన ఆస్తి.. దీనిపై ఎవరికీ హక్కు లేదు. ఇంటి కరెంట్ కట్ చేశారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. నాకు పోలీసులు రక్షణ కల్పించాలి"- దివ్వెల మాధురి

సంబంధిత కథనం