duvvada srinivas episode: దువ్వాడ వర్సెస్ దివ్వెల.. దువ్వాడ వాణి వ్యాఖ్యలకు దివ్వల మాధురి కౌంటర్‌-divvala madhuri counter to duvvada srinivas wife vani comments ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Duvvada Srinivas Episode: దువ్వాడ వర్సెస్ దివ్వెల.. దువ్వాడ వాణి వ్యాఖ్యలకు దివ్వల మాధురి కౌంటర్‌

duvvada srinivas episode: దువ్వాడ వర్సెస్ దివ్వెల.. దువ్వాడ వాణి వ్యాఖ్యలకు దివ్వల మాధురి కౌంటర్‌

Basani Shiva Kumar HT Telugu
Aug 19, 2024 04:26 PM IST

duvvada srinivas episode: దువ్వాడ వర్సెస్ దివ్వెల ఫైట్ కంటిన్యూ అవుతోంది. ఇటీవల దువ్వాడ వాణి చేసిన కామెంట్స్‌పై దివ్వెల మాధురి ఫైర్ అయ్యారు. వాణి వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మాధురి చేసిన కామెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఏపీగా మారాయి.

దివ్వెల మాధురి
దివ్వెల మాధురి

దువ్వాడ వాణి వ్యాఖ్యలకు దివ్వల మాధురి కౌంటర్‌ ఇచ్చారు. తన వల్ల దువ్వాడకు ప్రాణహాని ఉందని వాణి ఆరోపించారన్న మాధురి.. రెండేళ్లు ఆలనా పాలనా తానే చూసుకున్నానని స్పష్టం చేశారు. రెండేళ్లుగా లేని థ్రెట్‌ ఇప్పుడే వచ్చిందా అని ప్రశ్నించారు. దువ్వాడ శ్రీనివాస్‌ను చంపడానికి వాణి ప్రయత్నించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 మందిని తీసుకొచ్చి తలుపులు పగులగొట్టారని ఆరోపించింది. ఎవరి వల్ల ప్రాణహాని ఉందో అందరికీ తెలుసన్న మాధురి.. ఇంటి నిర్మాణానికి రూ.2 కోట్లు ఇచ్చానని స్పష్టం చేసింది. వాణి డబ్బు చెల్లించి ఇంటిని తీసుకోవచ్చని మాధురి తేల్చి చెప్పింది.

వాణి ఏమన్నారు..

ఇన్నాళ్లు తనకు విడాకులు కావాలి.. ఇతర డిమాండ్లు నెరవేర్చాలని చెప్పిన దువ్వాడ వాణి.. తాజాగా టోన్ మార్చారు. తనకు తన భర్త కావాలని.. పిల్లలతో కలిసి ఉండాలన్నారు. దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాణ హాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దువ్వాడ కట్టించుకున్న కొత్త ఇంట్లోకి.. ఆదివారం దివ్వెల మాధురి వచ్చిందని.. పోలీసులు ఇల్లంతా తనిఖీ చేయాలని వాణి డిమాండ్ చేశారు. తన పిల్లల భవిష్యత్తు కోసం.. దివ్వెల మాధురి నుంచి దువ్వాడ శ్రీనివాస్‌ను కాపాడాలని వేడుకున్నారు.

10 రోజులుగా..

దువ్వాడ శ్రీనివాస్ పూర్తిగా మాధురి ట్రాప్‌లోకి వెళ్లారని వాణి ఆరోపించారు. గత పది రోజులుగా తాను, తన పిల్లలు కారు షెడ్‌లోనే ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇంట్లోకి వెళ్లడానికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు స్పందించి.. దువ్వాడ శ్రీనివాస్ నివాసంలో ఉన్న వేరే వ్యక్తులను బయటకు పంపించాలని కోరారు. ఆ ఇంట్లోకి వెళ్లే హక్కు తనకు, తన పిల్లలకే ఉందని దువ్వాడ వాణి స్పష్టం చేశారు.

జగన్ జోక్యం చేసుకోవాలి..

తమ సమస్య పరిష్కారానికి వైఎస్ జగన్ జోక్యం చేసుకోవాలని దువ్వాడ వాణి కోరారు. దువ్వాడ శ్రీనివాస్‌ను పిలిపించుకొని జగన్ సూచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. తాను, తన పిల్లలు ఏం చెప్పినా దువ్వాడ శ్రీనివాస్ వినడం లేదని.. అందుకే జగన్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నట్టు వాణి వివరించారు. కేవలం దివ్వెల మాధురి కారణంగానే తన కుటుంబం రోడ్డున పడిందని.. దువ్వాడ శ్రీనివాస్ మాధురి చెప్పినట్టే వింటున్నారని వాపోయింది.