LIVE UPDATES
Andhra Pradesh News Live September 15, 2024: Ganesh Laddu Auction : రికార్డు ధరలు పలుకున్న గణేష్ లడ్డు ప్రసాదం-విజయవాడలో రూ.26 లక్షలు, హైదరాబాద్ లో రూ.29 లక్షలు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 15 Sep 202405:00 PM IST
Andhra Pradesh News Live: Ganesh Laddu Auction : రికార్డు ధరలు పలుకుతున్న గణేష్ లడ్డు ప్రసాదం-విజయవాడలో రూ.26 లక్షలు, హైదరాబాద్ లో రూ.29 లక్షలు
- Ganesh Laddu Auction : తెలుగు రాష్ట్రాల్లో వినాయక లడ్డు వేలం పాటలు సాగుతున్నాయి. ఇప్పటి వరకూ ఏపీలో రూ.26 లక్షలు, తెలంగాణలో రూ.29 లక్షలకు గణపయ్య లడ్డులను భక్తులు సొంతం చేసుకున్నారు. రానున్న రెండ్రోజుల్లో ఈ వేలం పాట ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భక్తులు అంటున్నారు.
Sun, 15 Sep 202404:59 PM IST
Andhra Pradesh News Live: Visakha Boat Accident : వేటకు వెళ్లిన బోటులో చెలరేగిన మంటలు, సముద్రంలో దూకేసిన మత్స్యకారులు
- Visakha Boat Accident : విశాఖ ఫిషింగ్ హార్బర్ కు చెందిన మత్స్యకార బోటులో అగ్ని ప్రమాదం జరిగింది. సముద్రంలో వేటకు వెళ్లిన బోటులో ఒక్కసారి మంటలు చెలరేగి పూర్తిగా వ్యాపించాయి. మత్స్యకారులు సముద్రంలోకి దూకగా, సమీపంలోని మరో బోటు సిబ్బంది గమనించి వారిని రక్షించారు.
Sun, 15 Sep 202404:59 PM IST
Andhra Pradesh News Live: IPS Suspended : ముంబయి నటి కేసు-ముగ్గురు ఐపీఎస్ లపై ఏపీ సర్కార్ సస్పెన్షన్ వేటు
- IPS Suspended : మంబయి నటి వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు ఐపీఎస్ లపై ఏపీ సర్కార్ వేటు వేసింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Sun, 15 Sep 202404:59 PM IST
Andhra Pradesh News Live: APSRTC : ఓవైపు సెల్‌ఫోన్.. మరోవైపు బస్ డ్రైవింగ్.. ప్రయాణికుల ప్రాణాలంటే లెక్కలేదా?
- APSRTC : తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా.. కొందరు బస్ డ్రైవర్లు మారడం లేదు. మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ బస్ డ్రైవర్ సెల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేశారు. అత్యంత ప్రమాదకరంగా బస్సును నడిపారని ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Sun, 15 Sep 202404:59 PM IST
Andhra Pradesh News Live: YS Jagan : ఇకనైనా కళ్లు తెరవండి చంద్రబాబు.. వెంటనే ఆ లేఖను వెనక్కి తీసుకోండి: జగన్
- YS Jagan : సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలు మెడికల్ కాలేజీలు, ఎంబీబీఎస్ సీట్ల కోసం ప్రయత్నాలు చేస్తుంటే.. రాష్ట్రానికి ఎంబీబీఎస్ అవసరం లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం దారుణమన్నారు. ఇకనైనా కళ్లు తెరిచి లేఖను వెనక్కి తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.
Sun, 15 Sep 202409:45 AM IST
Andhra Pradesh News Live: Railway Information : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ మధ్య రెండు ఏసీ స్పెషల్ రైళ్లు
- Railway Information : దసరా, దీపావళి, ఛత్ పండుగల సీజన్‌లో ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి.. ఇండియన్ రైల్వే సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ - సికింద్రాబాద్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. వాల్తేర్ డివిజన్‌లో భద్రతా పనుల కారణంగా ఆరు రైళ్లను రీషెడ్యూల్, షార్ట్ టెర్మినేషన్ చేశారు.
Sun, 15 Sep 202409:15 AM IST
Andhra Pradesh News Live: AP Sub Registrar Offices : సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రాచరిక విధానానికి స్వస్తి, సామాన్యుడి గౌరవం పెంచేలా కీలక నిర్ణయం
- AP Sub Registrar Offices : ఏపీ ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కొత్త మార్పులు చేసింది. ఏళ్ల నాటి రాచరికపు విధానానికి స్వస్తి పలికింది. సబ్ రిజిస్ట్రార్ ఎత్తైన కుర్చీలో కూర్చోవడం, చుట్టూ రెడ్ క్లాత్ తో ఉన్న పోడియం ఉండేవి. తక్షణమే వీటిని తొలగించాలని ఆదేశించింది.
Sun, 15 Sep 202408:03 AM IST
Andhra Pradesh News Live: Budameru Flood: ప్రళయానికి పక్షం రోజులు... ఇంకా వరద ముంపులోనే విజయవాడ రూరల్ గ్రామాలు, రాకపోకలు నిలిచి దయనీయ పరిస్థితులు
- Budameru Flood: విజయవాడ నగరాన్ని బుడమేరు ముంచెత్తి సరిగ్గా పక్షం రోజులైంది. వరద ముంపు నుంచి విజయవాడ నగరం కోలుకున్నా ఇంకా రూరల్ గ్రామాలు తేరుకోలేదు. రోడ్లు కూడా వరద ముంపులోనే ఉన్నాయి. వేలాదిమంది ప్రజలకు విజయవాడ నగరంలో రాకపోకలు తెగిపోయాయి.వరద ముంచెత్తాక ప్రభుత్వ సాయం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Sun, 15 Sep 202407:39 AM IST
Andhra Pradesh News Live: Attack on TDP Office case : తెలియదు.. గుర్తులేదు.. పోలీసుల విచారణలో వైసీపీ నేతల సమాధానం ఇదే!
- Attack on TDP Office case : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే.. పోలీసుల విచారణకు వైసీపీ నేతలు సహకరించడం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఏది అడిగినా.. తెలియదు.. గుర్తు లేదని చెబుతున్నట్టు వివరించారు.
Sun, 15 Sep 202402:14 AM IST
Andhra Pradesh News Live: AP News : షాపింగ్ కు వెళ్తుండగా ఘోర ప్రమాదం - ఇద్దరు స్పాట్ డెడ్
- AP Crime News: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైరు పేలి డివైడర్ ను ఢీకొట్టడంతో ఇద్దరు స్పాట్ డెడ్ అయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు విశాఖలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఫ్యాన్ ప్లగ్ పెట్టడానికి ప్రయత్నించిన నాలుగో తరగతి బాలుడు మృతి చెందాడు.
Sun, 15 Sep 202401:55 AM IST
Andhra Pradesh News Live: AP Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో 488 ఉద్యోగాలు - దరఖాస్తులకు రేపే చివరి తేదీ, ఇదిగో లింక్
- DME AP Recruitment 2024 : ఏపీలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 488 ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నారు. రేపటి(సెప్టెంబర్ 16)తో ఆన్ లైన్ అప్లికేషన్లు ముగియనున్నాయి. https://dme.ap.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లయ్ చేసుకోవచ్చు.
Sun, 15 Sep 202412:15 AM IST
Andhra Pradesh News Live: IPAC : వైసీపీ కోసం మళ్లీ.. ఏపీలో త్వరలో 'ఐప్యాక్' కార్యకలాపాలు ప్రారంభం.. జగన్ నమ్మకం అదే!
- IPAC : 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘోరంగా ఓడిపోయింది. ఆ ఓటమికి కారణాలు ఎన్ని ఉన్నా.. ఎక్కువ వేళ్లు మాత్రం పొలిటికల్ కన్సల్టెన్సీ ఐప్యాక్ వైపే చూపించాయి. కొందరు నేతలు మీడియా ముందు ఐప్యాక్‌పై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో.. ఐప్యాక్ జగన్ కోసం మళ్లీ పనిచేయబోతోందనే వార్త హాట్ టాపిక్‌గా మారింది.