Ganesh Laddu Auction : రికార్డు ధరలు పలుకుతున్న గణేష్ లడ్డు ప్రసాదం-విజయవాడలో రూ.26 లక్షలు, హైదరాబాద్ లో రూ.29 లక్షలు-vijayawada ganesh laddu auction nunna panchayat 26 lakh hyderabad my home bhooja 29 lakh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ganesh Laddu Auction : రికార్డు ధరలు పలుకుతున్న గణేష్ లడ్డు ప్రసాదం-విజయవాడలో రూ.26 లక్షలు, హైదరాబాద్ లో రూ.29 లక్షలు

Ganesh Laddu Auction : రికార్డు ధరలు పలుకుతున్న గణేష్ లడ్డు ప్రసాదం-విజయవాడలో రూ.26 లక్షలు, హైదరాబాద్ లో రూ.29 లక్షలు

Bandaru Satyaprasad HT Telugu
Sep 15, 2024 10:22 PM IST

Ganesh Laddu Auction : తెలుగు రాష్ట్రాల్లో వినాయక లడ్డు వేలం పాటలు సాగుతున్నాయి. ఇప్పటి వరకూ ఏపీలో రూ.26 లక్షలు, తెలంగాణలో రూ.29 లక్షలకు గణపయ్య లడ్డులను భక్తులు సొంతం చేసుకున్నారు. రానున్న రెండ్రోజుల్లో ఈ వేలం పాట ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భక్తులు అంటున్నారు.

లక్షలు పలుకున్న గణేష్ లడ్డు ప్రసాదం-విజయవాడలో రూ.26 లక్షలు, హైదరాబాద్ లో రూ.29 లక్షలు
లక్షలు పలుకున్న గణేష్ లడ్డు ప్రసాదం-విజయవాడలో రూ.26 లక్షలు, హైదరాబాద్ లో రూ.29 లక్షలు

Ganesh Laddu Auction : గణేశ్ నవరాత్రులు ముగుస్తున్నాయి. గణపయ్య గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. పల్లెలు నుంచి నగరాల వరకు వెలసిన వినాయకుడు నిమజ్జనాలకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే పలుచోట్ల నిమజ్జనాలు జరుగుతున్నాయి. నిమజ్జనానికి ముందు గణేశ్ లడ్డు వేలం ఆనవాయితీగా భావిస్తారు భక్తులు. అయితే ఈ లడ్డులు ఇప్పుడు లక్షలు పలుకుతున్నాయి. విజయవాడలో రూ.26 లక్షలు, హైదరాబాద్ లో రూ.29 లక్షలకు లడ్డులను వేలంలో సొంతం చేసుకున్నారు భక్తులు.

విజయవాడ రూరల్ నున్న పంచాయతీ పరిధిలోని శ్రీసాయి బాలాజీ ఎన్ క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో వినాయకుడిని ఏర్పాటు చేశారు. వినాయక విగ్రహం నిమజ్జనానికి ముందు నిర్వహించిన వేలంలో ఓ ప్రైవేట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు సింగం రెడ్డి ప్రదీప్ రెడ్డి, నక్కా రామ్, బాలాజీ లడ్డు ప్రసాదాన్ని రూ.26 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఇంత భారీ మొత్తానికి లడ్డును సొంతం చేసుకోవడం హైలెట్ అవుతుంది.

శ్రీ సాయి బాలాజీ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో వినాయక చవితి నిర్వహణ కమిటీ సభ్యులకు ఈ మొత్తాన్ని అందజేశారు. లడ్డు వేలం విజేతను కమిటీ సభ్యులు సత్కరించారు. లడ్డును భారీ మొత్తంలో పాడుకున్న సింగం రెడ్డి ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది అపార్ట్‌మెంట్‌లో వినాయక చవితి వేడుకలు మరింత వైభోవోపేతంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతోనే రూ.26 లక్షల పెద్ద మొత్తానికి లడ్డు పాట పాడామని చెప్పారు. ఈ ఏడాదికి మరింత ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.

మై హోమ్ భుజాలో రూ.29 లక్షలు పలికిన లడ్డు

వినాయక లడ్డు వేలంపాటలకు హైదరాబాద్‌ పెట్టింది పేరు. ఇప్పుడిప్పుడే లడ్డు వేలం పాటలపై వార్తలు వస్తున్నాయి. తాజాగా మాదాపూర్ మై హోమ్ భుజాలో గణేశ్ లడ్డు రికార్డు ధర పలికింది. ఏటా వేలం పాటలో టాప్ లో ఉంటే బాలాపూర్ లడ్డును కూడా వెనక్కి నెట్టిన మాదాపూర్ మై హోమ్ భుజా లడ్డు... ఈ ఏడాది ఏకంగా రూ. 29 లక్షలు పలికింది.

ఖమ్మం జిల్లాకు చెందిన కొండపల్లి గణేష్ రూ.29 లక్షలకు లడ్డు సొంతం చేసుకున్నారు. వేలం పాటలో లడ్డును సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని గణేష్ అన్నారు. ఆ గణనాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మా కుటుంబంపై ఉండాలని కోరుకుంటున్నానని కొండపల్లి గణేష్ అన్నారు. ఏటా లడ్డు వేలం పాటలో పాల్గొంటామని, ఈసారి లడ్డు కైవసం చేసుకునే అవకాశం లభించిందన్నారు. గతేడాది ఇక్కడి లడ్డు రూ.25.50 లక్షల ధర పలికింది. ఇప్పటి వరకూ తెలంగాణలో ఇదే అత్యధిక లడ్డు వేలం ధర కావడం విశేషం.

లడ్డు సొంతం చేసుకున్న ముస్లిం యువకుడు

తెలుగు రాష్ట్రాలు మతసామరస్యానికి మారుపేరు. కుల, మత భేదాలు లేకుండా ప్రజలు కలిసిపోతుంటారు. అందుకు మరో ఉదాహరణ ఈ ఘటన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చవిటిగూడెంలో షేక్ అష్రఫ్ అనే ముస్లిం యువకుడు వేలంలో గణేశ్ లడ్డును సొంతం చేసుకున్నాడు. అలాగే వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముతోజీ పేటలో గణపతి ఉత్సవాలకు మహ్మద్ రియాజ్ అనే ముస్లిం యువకుడు 216 కిలోల భారీ లడ్డును అందించాడు.

సంబంధిత కథనం