Besan Laddu: అయోధ్యలోని హనుమాన్ ప్రసాదం బేసన్ లడ్డు, ఈ లడ్డుకు ప్రత్యేక గుర్తింపు
Besan Laddu: అయోధ్యలోని హనుమాన్ టెంపుల్‌లో ఒక ప్రత్యేకమైన ప్రసాదాన్ని వడ్డిస్తారు. దానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది.
Besan Laddu: భారత దేశంలో ఎన్నో సంప్రదాయాలు, రుచికరమైన వంటకాలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో వంటకం ప్రసిద్ధి చెందింది. ఇలాంటి ప్రత్యేకమైన వంటకాలకు, ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇవ్వడం అనేది ఒక ఆచారంగా వస్తోంది. అయోధ్యలో చారిత్రాత్మక రామాలయ ప్రతిష్టకు సిద్ధమవుతున్న సమయంలో అక్కడున్న ప్రతిష్టాత్మక హనుమాన్ గర్హి దేవాలయంలో ఇస్తున్న ప్రసాదానికి జిఐ ట్యాగ్ దక్కింది.
ఈ ప్రసాదం ఒక బేసిన్ లడ్డు. ఇది అక్కడ మాత్రమే టేస్టీగా సిద్ధం అవుతుంది. హనుమాన్ గర్హి ఆలయంలో దీన్ని హనుమంతుడికి ప్రసాదంగా సమర్పిస్తారు. ఆ తర్వాత భక్తులకు పంచి పెడతారు. శెనగపిండిని, నెయ్యిని, చక్కెరను ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. హనుమంతుడిని దర్శించకపోతే శ్రీరాముడు దర్శనం అసంపూర్తిగా ఉంటుందని అంటారు. అయోధ్యలో హనుమంతుడిని కొత్వాల్ గా పూజిస్తారు. అంటే ఆ నగర రక్షకుడిగా పూజిస్తారు. తరతరాలుగా ఈ లడ్డును హనుమంతుడికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు.
అయోధ్య వెళ్లిన వారు ఎవరైనా ఈ ప్రత్యేక లడ్డూను ప్రసాదంగా స్వీకరించి రుచి చూసాకే తిరిగి వస్తారు. శనగపిండిని కళాయిలో వేసి కాసేపు వేయించాక అందులో నెయ్యి, చక్కెర కలిపి ఈ లడ్డూను తయారు చేస్తారు. ఈ లడ్డూను ఎన్నో ప్రాంతాల్లో తయారుచేస్తారు, కానీ ఈ హనుమాన్ ఆలయంలో ఇచ్చే లడ్డు మాత్రం చాలా ప్రత్యేకంగా రుచిగా ఉంటుంది.
ఈ లడ్డూకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ దక్కడం పట్ల లడ్డు తయారీదారులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇది జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుంది ఈ లడ్డూ. అంతే కాదు ధర కూడా పెరిగే అవకాశం ఉంది.