LIVE UPDATES
Andhra Pradesh News Live September 10, 2024: AP Medical Colleges Jobs : ఏపీ మెడికల్ కాలేజీల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ, దరఖాస్తు గడువు పొడిగింపు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 10 Sep 202401:56 PM IST
Andhra Pradesh News Live: AP Medical Colleges Jobs : ఏపీ మెడికల్ కాలేజీల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ, దరఖాస్తు గడువు పొడిగింపు
- AP Medical Colleges Jobs : ఏపీ డీఎంఈ పరిధిలోని మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా దరఖాస్తు గడువును ఈ నెల 16 వరకు పొడిగించారు.
Tue, 10 Sep 202412:38 PM IST
Andhra Pradesh News Live: AP Government Jobs 2024 : ఏపీ మంత్రుల పేషీల్లో ఉద్యోగాలు.. జీతం, పోస్టుల సంఖ్య.. పూర్తి వివరాలు ఇవే!
- AP Government Jobs 2024 : ఏపీలోని మంత్రుల పేషీల్లో పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, సోషల్ మీడియా అసిస్టెంట్స్‌గా పనిచేయడానికి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీడీసీ అధికారులు స్పష్టం చేశారు.
Tue, 10 Sep 202411:23 AM IST
Andhra Pradesh News Live: AP Sachivalayam Employees : సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు, ఇకపై రోజుకు మూడుసార్లు హాజరు నమోదు
- AP Sachivalayam Employees : ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగులు రోజుకు మూడుసార్లు బయోమెట్రిక్ హాజరు వేయాలని ఆదేశించింది. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు హాజరు ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.
Tue, 10 Sep 202410:15 AM IST
Andhra Pradesh News Live: AP DSC Free Coaching : డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్, 3 నెలల పాటు ఉచిత కోచింగ్
- AP DSC Free Coaching : గిరిజన అభ్యర్థులకు ఉచితంగా డీఎస్సీ కోచింగ్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కసరత్తు చేస్తుంది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా...2150 మంది అప్లై చేసుకున్నారు. 6 ఐటీడీఏల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
Tue, 10 Sep 202410:12 AM IST
Andhra Pradesh News Live: Vizag Steel Plant : విశాఖలో ఉద్రిక్తత.. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగుల ఆందోళన
- Vizag Steel Plant : విశాఖపట్నంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అటు స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగాయి.
Tue, 10 Sep 202409:17 AM IST
Andhra Pradesh News Live: Tension in Palnadu : పల్నాడులో మళ్లీ ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాహనంపై టీడీపీ కార్యకర్తల దాడి
- Tension in Palnadu : పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావు వాహనంపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. టీడీపీ కార్యకర్తల దాడిలో వాహనంపై ధ్వంసం అయ్యింది. పోలీసులు వచ్చి టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు.
Tue, 10 Sep 202408:38 AM IST
Andhra Pradesh News Live: Nikon Scholarship 2024 : ఫొటోగ్రఫీ విద్యార్థులకు నికాన్ గుడ్ న్యూస్-రూ.1 లక్ష వరకు స్కాలర్, అర్హతలివే
- Nikon Scholarship 2024 : ఫొటోగ్రఫీ విద్యార్థులకు నికాన్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. పేద విద్యార్థులకు రూ.1 లక్ష వరకు స్కాలర్ షిప్ అందిస్తున్నట్లు ప్రకటించింది. అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మూడు నెలలు అంతకంటే ఎక్కువ వ్యవధి కోర్సులు చేస్తున్న విద్యార్థులు అర్హులు.
Tue, 10 Sep 202408:22 AM IST
Andhra Pradesh News Live: Budameru Flood Relief: బుడమేరు వరదలతో కట్టుబట్టలతో మిగిలినా, కన్నీళ్లు తుడిచేలా.. లక్షలాది కుటుంబాలకు ఏపీ ప్రభుత్వ సాయం
- Budameru Flood Relief: వరద ముంచెత్తడంతో ఊరు ఏరయ్యింది. బెజవాడలో రెండు, మూడు తరాలు కనీవిని ఎరుగని విలయాన్ని విజయవాడ నగరం చవి చూసింది. విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తి పదిరోజులు గడిచిపోయాయి. ఈ నేపథ్యంలో వరద బాధితుల్ని ఆదుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు అందరి మన్ననలు పొందుతున్నాయి.
Tue, 10 Sep 202407:57 AM IST
Andhra Pradesh News Live: Janasena vs TDP: మచిలీపట్నంలో ఘోరం.. జనసేన నాయకుడిపై టీడీపీ నేతల దాడి, బలవంతంగా కాళ్లు పట్టించుకున్న వైనం
- Janasena vs TDP: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన, టీడీపీ నాయకుల మధ్య తలెత్తిన వివాదంలో టీడీపీ నాయకుడు అనుచితంగా ప్రవర్తించాడు. ప్రత్యర్థి ఇంటిపై దాడి చేసి వారితో బలవంతంగా కాళ్లు పట్టుకోపోతే హతమారుస్తామని బీతావహుల్ని చేశారు. వాటిని వీడియోలు తీసి వైరల్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Tue, 10 Sep 202405:47 AM IST
Andhra Pradesh News Live: Sanitation Workers: ఏమిచ్చి తీర్చుకోగలదు విజయవాడ వారి రుణం..! పారిశుధ్య కార్మికుల సేవలు నిరుపమానం..
- Sanitation Workers: ఒకరు కాదు ఇద్దరు కాదు అక్షరాలు 8వేల మంది పారిశుధ్య కార్మికులు రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడ నగరానికి తరలి వచ్చారు. పది రోజులుగా నగరంలో అలుపెరగకుండా శ్రమిస్తున్నారు.విజయవాడ నగరం ఏమిచ్చిన తీర్చుకోలేనంత సేవ చేస్తున్నారు.
Tue, 10 Sep 202404:09 AM IST
Andhra Pradesh News Live: Guntur : గుంటూరులో మందుబాబుల కక్కుర్తి.. పోలీసుల ముందే మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లిన లిక్కర్ ప్రియులు!
- Guntur : గుంటూరులో విచిత్రమైన సంఘటన జరిగింది. పోలీసులు వివిధ కేసుల్లో మద్యం బాటిళ్లను ధ్వంసం చేస్తుండగా.. ఊహించని ఘటన జరిగింది. ఒక్కసారిగా కొంతమంది మందు బాబులు అక్కడికి వచ్చి.. మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. దీంతో పోలీసులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
Tue, 10 Sep 202403:59 AM IST
Andhra Pradesh News Live: AP Agency Floods: ఏజెన్సీలో బీభత్సం, ఉగ్రరూపం దాల్చిన వాగులు...వందలాది గ్రామాలకు రాకపోకలు బంద్...
- AP Agency Floods: రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురింది. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. పలు చోట్ల కాజ్‌వేలు కొట్టుకుపోయాయి. వందలాది గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Tue, 10 Sep 202403:40 AM IST
Andhra Pradesh News Live: Kadapa tragedy: కడప జిల్లాలో విషాదం, వినాయ నిమజ్జనంలో అపశృతి…నదిలోజారి పడి ఇద్దరి మృతి
- Kadapa tragedy: కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వినాయ విగ్రహం నిమజ్జనంలో అపశృతి జరిగింది. మొగమూరు నదిలో యువకుడు జారిపడగా, ఆ యువకుడిని కాపాడేందుకు మరో వ్యక్తి నదిలోకి దూకాడు. ఇద్దరూ గల్లంతు అయ్యారు. గజ ఈతగాళ్ల గాలింపు చర్యలతో ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి.
Tue, 10 Sep 202411:30 PM IST
Andhra Pradesh News Live: Budameru Floods: వరద ముంపు బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం..వారి నిర్లక్ష్యమే నిలువునా ముంచింది..
- Budameru Floods: విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసిన బుడమేరు వరదలకు అసలు కారణం అధికారుల నిర్లక్ష్యమేనని ప్రభుత్వం గుర్తించింది. విపత్తు ముంచుకొచ్చిన సమయంలో యంత్రాంగం మీనమేషాలు లెక్కించడం, కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఏపీ ప్రభుత్వ పెద్దలు గుర్తించారు.