AP Government Jobs 2024 : ఏపీ మంత్రుల పేషీల్లో ఉద్యోగాలు.. జీతం, పోస్టుల సంఖ్య.. పూర్తి వివరాలు ఇవే!-andhra pradesh digital corporation job vacancy notification 2024 complete details ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Government Jobs 2024 : ఏపీ మంత్రుల పేషీల్లో ఉద్యోగాలు.. జీతం, పోస్టుల సంఖ్య.. పూర్తి వివరాలు ఇవే!

AP Government Jobs 2024 : ఏపీ మంత్రుల పేషీల్లో ఉద్యోగాలు.. జీతం, పోస్టుల సంఖ్య.. పూర్తి వివరాలు ఇవే!

Basani Shiva Kumar HT Telugu
Sep 10, 2024 06:08 PM IST

AP Government Jobs 2024 : ఏపీలోని మంత్రుల పేషీల్లో పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, సోషల్ మీడియా అసిస్టెంట్స్‌గా పనిచేయడానికి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీడీసీ అధికారులు స్పష్టం చేశారు.

ఏపీ డిజిటల్ కార్పోరేషన్‌లో ఉద్యోగాలు
ఏపీ డిజిటల్ కార్పోరేషన్‌లో ఉద్యోగాలు

ఏపీ ప్రభుత్వానికి చెందిన ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పోరేషన్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, తగిన అనుభవం ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మంత్రుల పేషీలో పని చేయడానికి ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగులను నియమించనున్నారు. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, సోషల్ మీడియా అసిస్టెంట్స్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్ట్ కోడ్: APDC/OS/SME/01

పోస్ట్ పేరు: సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్

ఖాళీల సంఖ్య: 24

అపాయింట్‌మెంట్ విధానం: అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన

అర్హత: సంబంధిత విభాగంలో అనుభవంతో పాటు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి B.E/B.tech చదివి ఉండాలి.

అనుభవం: డిజిటల్ కంటెంట్ సృష్టి, ప్రమోషన్‌లో అనుభవం ఉండాలి. సంబంధిత విభాగం, పోర్ట్‌ఫోలియో కార్యకలాపాలు, సోషల్ మీడియాలో లోతైన జ్ఞానం ఉండాలి. ప్రభుత్వ బ్రాండ్‌ను పెంచేలా కంటెంట్‌ని క్రియేట్ చేయాలి.

నెలకు వేతనం: రూ. 50,000 వరకు ఉంటుంది.

ధరఖాస్తు విధానం: లేటెస్ట్ రెజ్యూమేను (info.apdcl@gmail.com) ఐడీకి మెయిల్ చేయాలి. ఈనెల 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.

పోస్ట్ కోడ్: APDC/OS/SMA/02

పోస్ట్ పేరు: సోషల్ మీడియా అసిస్టెంట్స్

ఖాళీల సంఖ్య: 24

అపాయింట్‌మెంట్ విధానం: అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి.

అనుభవం: ఏదైనా సంస్థల సోషల్ మీడియా వింగ్స్‌లో పనిచేసిన అనుభవం ఉండాలి. ఫ్రీలాన్స్ డిజిటల్ బ్లాగర్ ప్లాన్, వివిధ సామాజిక మాధ్యమాలలో పనిచేసిన అనుభవం ఉండాలి. ఫేస్‌బుక్, గూగుల్ అనలిటిక్స్, హాట్ సూట్ వంటి సాధనాలను ఉపయోగించి పనిచేసిన అనుభవం ఉండాలి.

నెలకు వేతనం: రూ. 30,000 వరకు ఉంటుంది.

ధరఖాస్తు విధానం: లేటెస్ట్ రెజ్యూమేను (info.apdcl@gmail.com) ఐడీకి మెయిల్ చేయాలి. ఈనెల 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.

ఈ పోస్టులకు సంబంధించి షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు సమాచారం ఇస్తారు. వారిని మాత్రమే ఇంటర్వ్యూకు పిలుస్తారు. అభ్యర్థులందరూ ఒకే పీడీఎఫ్ ఫైల్‌లో డాక్యుమెంట్లను పంపాలి. సాఫ్ట్, స్కాన్ కాపీని జతచేయాలి. 5 ఎంబీ కంటే ఎక్కువ సైజులో (పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో పాటు సంతకం, పుట్టిన తేదీ రుజువు, కమ్యూనిటీ సర్టిఫికేట్లు) జతచేయాలి. మరిన్ని వివరాల కోసం, https://www.apdc.ap.gov.in/ , I&PR వెబ్‌సైట్ http://ipr.ap.gov.in/ ని చూడవచ్చు.