Nikon Scholarship 2024 : ఫొటోగ్రఫీ విద్యార్థులకు నికాన్ గుడ్ న్యూస్-రూ.1 లక్ష వరకు స్కాలర్, అర్హతలివే
Nikon Scholarship 2024 : ఫొటోగ్రఫీ విద్యార్థులకు నికాన్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. పేద విద్యార్థులకు రూ.1 లక్ష వరకు స్కాలర్ షిప్ అందిస్తున్నట్లు ప్రకటించింది. అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మూడు నెలలు అంతకంటే ఎక్కువ వ్యవధి కోర్సులు చేస్తున్న విద్యార్థులు అర్హులు.
Nikon Scholarship 2024 : ఫొటోగ్రఫీ కోర్సుల్లో జాయిన్ అయిన విద్యార్థులు నికాన్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. నికాన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024-25 ద్వారా ఫొటోగ్రఫీ సంబంధిత కోర్సులను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు నికాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చింది. 12వ తరగతి విద్యను పూర్తి చేసిన, ప్రస్తుతం మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ వ్యవధితో ఫొటోగ్రఫీ కోర్సులలో జాయిన్ అయిన విద్యార్థులకు స్కాలర్ షిప్ అందిస్తారు.
నికాన్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనుగుణంగా ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది. విద్యార్థులకు 1,00,000 రూపాయల వరకు స్కాలర్‌షిప్ అందిస్తారు. ఇప్పటికే అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయి. అర్హులైన వారు అక్టోబర్ 20, 2024లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ లో https://www.buddy4study.com/page/nikon-scholarship-program#singleScApply దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు
- మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ వ్యవధితో ఫొటోగ్రఫీకి సంబంధించిన కోర్సులు చేస్తున్న విద్యార్థులు
- 12వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి.
- కుటుంబం వార్షిక ఆదాయం రూ. 6 లక్షల కంటే తక్కువ ఉండాలి.
- నికాన్ సంస్థ ఉద్యోగులు, బడ్డీ ఫర్ స్టడీ ఉద్యోగుల పిల్లలు ఈ ప్రోగ్రామ్‌కు అర్హులు కారు.
- భారతీయ పౌరులు మాత్రమే స్కాలర్ షిప్ నకు అర్హులు
కావాల్సిన సర్టిఫికెట్లు
- ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులు (ఆధార్ /ఓటర్ ఐడీ /డ్రైవింగ్ లైసెన్స్/పాన్ కార్డు)
- దరఖాస్తుదారు పాస్‌పోర్ట్ సైజు ఫొటో
- ఆదాయ రుజువు (ఫారం 16A/ఆదాయ ధృవీకరణ పత్రం/బీపీఎల్ సర్టిఫికేట్/సాలరీ స్లిప్పులు)
- కాలేజీ అడ్మిషన్ ఫీజు రశీదు, కాలేజీ ఐడీ కార్డు/బోనఫైడ్ సర్టిఫికేట్, అడ్మిషన్ లెటర్
- స్కాలర్‌షిప్ దరఖాస్తుదారుడి బ్యాంక్ ఖాతా వివరాలు (క్యాన్సిల్డ్ చెక్కు/పాస్‌బుక్ కాపీ)
- మునుపటి తరగతికి చెందిన మార్క్‌షీట్‌లు లేదా గ్రేడ్ కార్డ్‌లు
- దివ్యాంగులైతే సంబంధిత పత్రాలు, కుల ధృవీకరణ పత్రం
- లేటెస్ట్ ఫొటో
ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు?
- ముందుగా https://www.buddy4study.com/page/nikon-scholarship-program#singleScApply ఈ లింక్ పై క్లిక్ చేసి హోంపేజీలోని 'అప్లై నౌ' బటన్‌పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ ఐడీతో Buddy4Studyకి లాగిన్ చేయండి. తర్వాత 'దరఖాస్తు ఫారమ్ పేజీ'కు వెళ్తుంది.
- మీరు Buddy4Studyలో నమోదు కానట్లయితే మీ ఈ-మెయిల్, మొబైల్ నంబర్ తో రిజిస్టర్ చేసుకోవచ్చు.
- అనంతరం 'నికాన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024-25' దరఖాస్తు ఫారమ్ పేజీకి వెళ్లి 'అప్లికేషన్ స్టార్ట్' బటన్‌పై క్లిక్ చేయండి.
- ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో అవసరమైన వివరాలను పూర్తి చేసి, సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయండి.
- చివరిగా 'ప్రివ్యూ'పై క్లిక్ చేయండి. దరఖాస్తుదారు వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అనంతరం సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయండి.
- మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. స్కాలర్ షిప్ నకు అర్హత సాధిస్తే నికాన్ మెయిల్, మొబైల్ నెంబర్ కు వివరాలు పంపిస్తుంది.
సంబంధిత కథనం