AP Medical Colleges Jobs : ఏపీ మెడికల్ కాలేజీల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ, దరఖాస్తు గడువు పొడిగింపు-ap dme medical colleges assistant professors posts application last date extended upto sept 16th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Medical Colleges Jobs : ఏపీ మెడికల్ కాలేజీల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ, దరఖాస్తు గడువు పొడిగింపు

AP Medical Colleges Jobs : ఏపీ మెడికల్ కాలేజీల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ, దరఖాస్తు గడువు పొడిగింపు

Bandaru Satyaprasad HT Telugu
Sep 10, 2024 08:03 PM IST

AP Medical Colleges Jobs : ఏపీ డీఎంఈ పరిధిలోని మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా దరఖాస్తు గడువును ఈ నెల 16 వరకు పొడిగించారు.

ఏపీ మెడికల్ కాలేజీల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ, దరఖాస్తు గడువు పొడిగింపు
ఏపీ మెడికల్ కాలేజీల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ, దరఖాస్తు గడువు పొడిగింపు

AP Medical Colleges Jobs : ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గత నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో 488 పోస్టుల భర్తీ చేయనున్నారు. దరఖాస్తు గడువు సెప్టెంబర్ 9తో ముగియగా...తాజాగా ఆ గడువును సెప్టెంబర్ 16 వరకు పొడిగించారు. ఈ మేరకు ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటన చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్/ లేటరల్ ఎంట్రీ విధానంలో 488 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఆగస్టులో నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://dme.ap.nic.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటీవల చాలా జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అభ్యర్థులకు మరో అవకాశంగా దరఖాస్తు గడువు పెంచినట్లు అధికారులు తెలిపారు.

ముఖ్య వివరాలు

  • ఉద్యోగ ఖాళీల సంఖ్య - 488
  • భర్తీ చేసే ఉద్యోగాలు - అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
  • అర్హతలు - మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (MD/MS/DNB/DM) ఉత్తీర్ణులై ఉండాలి.
  • దరఖాస్తు విధానం - ఆన్‌లైన్‌
  • దరఖాస్తు రుసుం - ఓసీ అభ్యర్థులు రూ.1000, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500 చెల్లించాలి.
  • దరఖాస్తుకులకు తుది గడువు - 16.09.2024
  • అధికారిక వెబ్ సైట్ - https://dme.ap.nic.in/
  • ఆన్ లైన్ అప్లికేషన్ లింక్ - https://dmeaponline.com/
  • ఓసీలకు 42 ఏళ్లు, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 47 ఏళ్ల వయస్సు మించకూడదు.
  • విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఏపీ మంత్రుల పేషిలో ఉద్యోగాలు

ఏపీ ప్రభుత్వానికి చెందిన ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పోరేషన్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, తగిన అనుభవం ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మంత్రుల పేషీలో పని చేయడానికి ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగులను నియమించనున్నారు. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, సోషల్ మీడియా అసిస్టెంట్స్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్ట్ కోడ్: APDC/OS/SME/01

  • పోస్ట్ పేరు: సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్
  • ఖాళీల సంఖ్య: 24
  • అపాయింట్‌మెంట్ విధానం: అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన
  • అర్హత: సంబంధిత విభాగంలో అనుభవంతో పాటు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి B.E/B.tech చదివి ఉండాలి.
  • అనుభవం: డిజిటల్ కంటెంట్ సృష్టి, ప్రమోషన్‌లో అనుభవం ఉండాలి. సంబంధిత విభాగం, పోర్ట్‌ఫోలియో కార్యకలాపాలు, సోషల్ మీడియాలో లోతైన జ్ఞానం ఉండాలి. ప్రభుత్వ బ్రాండ్‌ను పెంచేలా కంటెంట్‌ని క్రియేట్ చేయాలి.
  • నెలకు వేతనం: రూ. 50,000 వరకు ఉంటుంది.
  • ధరఖాస్తు విధానం: లేటెస్ట్ రెజ్యూమేను (info.apdcl@gmail.com) ఐడీకి మెయిల్ చేయాలి. ఈనెల 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.

పోస్ట్ కోడ్: APDC/OS/SMA/02

  • పోస్ట్ పేరు: సోషల్ మీడియా అసిస్టెంట్స్
  • ఖాళీల సంఖ్య: 24
  • అపాయింట్‌మెంట్ విధానం: అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన
  • అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి.
  • అనుభవం: ఏదైనా సంస్థల సోషల్ మీడియా వింగ్స్‌లో పనిచేసిన అనుభవం ఉండాలి. ఫ్రీలాన్స్ డిజిటల్ బ్లాగర్ ప్లాన్, వివిధ సామాజిక మాధ్యమాలలో పనిచేసిన అనుభవం ఉండాలి. ఫేస్‌బుక్, గూగుల్ అనలిటిక్స్, హాట్ సూట్ వంటి సాధనాలను ఉపయోగించి పనిచేసిన అనుభవం ఉండాలి.
  • నెలకు వేతనం: రూ. 30,000 వరకు ఉంటుంది.
  • ధరఖాస్తు విధానం: లేటెస్ట్ రెజ్యూమేను (info.apdcl@gmail.com) ఐడీకి మెయిల్ చేయాలి. ఈనెల 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.

సంబంధిత కథనం