TS Medical Education Jobs 2024 : ములుగు ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, తెలంగాణ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఈ మేరకు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం వివరాలను పేర్కొంది.
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ(Telangana Judicial Services) నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా తొమ్మిది జిల్లా జడ్జీల (ఎంట్రీ లెవెల్) పోస్టులను భర్తీ చేయనుంది. మే14వ తేదీ నుంచి ఆఫ్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జూన్ 13వ తేదీని తుది గడువుగా ప్రకటించారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలు ఆగస్టు 24, 25 తేదీల్లో నిర్వహించనున్నారు. గుర్తింపు పొందిన వర్శిటీ నుంచి ఎల్ఎల్ బీ పూర్తి చేసి ఉండాలి. అంతేకాకుండా తెలంగాణ జ్యుడీషియల్ నియమ నిబంధనల ప్రకారం నిర్దేశించిన అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. అర్హులైన వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం https://tshc.gov.in/ వెబ్ సైట్లోకి వెళ్లాలి.