TS EAPCET 2024 Results : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయ్ - ఈ డైరెక్ట్ లింక్ తో మీ ర్యాంక్ చెక్ చేసుకోండి-telangana eamcet results 2024 out at https eapcet tsche ac in direct link here to download rank card ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Eapcet 2024 Results : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయ్ - ఈ డైరెక్ట్ లింక్ తో మీ ర్యాంక్ చెక్ చేసుకోండి

TS EAPCET 2024 Results : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయ్ - ఈ డైరెక్ట్ లింక్ తో మీ ర్యాంక్ చెక్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
May 18, 2024 01:40 PM IST

TS EAPCET(EAMCET) 2024 Results : తెలంగాణ ఈఏపీసెట్ (ఎంసెట్) ఫలితాలు విడుదలయ్యాయి. https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి విద్యార్థులు ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు - 2024
తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు - 2024

TS EAPCET (EAMCET) 2024 Results : తెలంగాణ ఈఏపీసెట్(ఎంసెట్) 2024 ఫలితాలు వచ్చేశాయ్. శనివారం ఉదయం 11 గంటల తర్వాత విద్యాశాఖ అధికారులు జేఎన్టీయూ హైదరాబాద్ లో ఫలితాలను ప్రకటించారు. https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చని తెలిపారు. త్వరలోనే ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తామని వెల్లడించారు.

How to Check TS EAMCET Results 2024: ఎంసెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

  • తెలంగాణ ఎంసెట్( ఈఏపీసెట్0 పరీక్ష రాసిన అభ్యర్థులు https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్లోకి వెళ్లాలి.
  • TS EAPCET - Results 2024 లింక్ పై క్లిక్ చేయాలి.
  • మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ నెంబర్ ను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే.. మీ ర్యాంక్(స్కోర్) డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డ్లౌనోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.
  • అడ్మిషన్ల ప్రక్రియలో ర్యాంక్ చాలా కీలకం.

సత్తా చాటిన ఏపీ విద్యార్థులు….

తెలంగాణ ఈఏపీసెట్ 2024 ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్ లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన జ్యోతిరాదిత్యకు ఫస్ట ర్యాంక్ రాగా…కర్నూలుకు చెందిన హర్షకు రెండో ర్యాంక్ దక్కింది. కర్నూలుకు చెందిన యశ్వంత్ రెడ్డికి ఐదో ర్యాంక్ దక్కింది. ఇంజినీరింగ్‌లో మొదటి రెండు ర్యాంకులు ఏపీ విద్యార్థులు సాధించడం విశేషం.

ఇక అగ్రి అండ్ ఫార్మసీ స్ట్రీమ్ లో కూడా ఏపీ విద్యార్థులు మెరిశారు. మదనపల్లికి చెందిన ప్రణితకు ఫస్ట్ ర్యాంక్ దక్కింది. విజయనగరానికి చెందిన రాధాకృష్ణకు రెండో ర్యాంక్ దక్కింది. చిత్తూరు విద్యార్థి రాఘవ్ నాల్గో ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు.

ఇంజినీరింగ్ టాపర్స్….

  1.  జ్యోతి రాధిత్య పాలకొండ - శ్రీకాకుళం(ఏపీ)
  2. గోళ్ళలేఖ హర్శ - కర్నూల్(ఏపీ)
  3. రిషి శేఖర్ శుక్ల - తిరుమల గిరి, సికింద్రాబాద్
  4. సందేశ్ - హైద్రాబాద్.
  5.  సాయి యశ్వంత్ రెడ్డి - కర్నూల్(ఏపీ)
  6.  పుట్టి కుశల్‌ కుమార్‌(అనంతపురం-ఆర్కేనగర్‌)
  7. హుండికర్‌ విదీత్‌(హైదరాబాద్‌-పుప్పాలగూడ)
  8. రోహన్‌(హైదరాబాద్‌)
  9. కొంతేమ్‌ మణితేజ(వరంగల్‌)
  10. ధనుకొండ శ్రీనిధి(విజయనగరం)

అగ్రికల్చర్, పార్మసీ టాప్ 10 ర్యాంకర్స్,,,,,

1 ర్యాంకు-ప్రణీత(మదనపల్లె)

2వ ర్యాంకు-రాధాకృష్ణ(విజయనగరం)

3వ ర్యాంకు-శ్రీవర్షిణి(హనుమకొండ)

4వ ర్యాంకు-సాకేత్‌ రాఘవ్‌(చిత్తూరు)

5వ ర్యాంకు- సాయి వివేక్‌(హైదరాబాద్‌)

6వ ర్యాంకు-మహమ్మద్‌ అజాన్‌సాద్‌(హైదరాబాద్‌)

7వ ర్యాంకు-వడ్లపూడి ముకేశ్‌ చౌదరి(తిరుపతి)

8వ ర్యాంకు-భార్గవ్‌ సుమంత్‌(హైదరాబాద్‌)

9వ ర్యాంకు-జయశెట్టి ఆదిత్య(హైదరాబాద్‌)

10వ ర్యాంకు- దివ్యతేజ(శ్రీసత్యసాయి జిల్లా)

టీఎస్ ఎంసెట్ ఫలితాలు - ఉత్తీర్ణత శాతం వివరాలు

గతేడాదితో పోల్చితే ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణత శాతం తగ్గింది. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ లో ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. అగ్రికల్చర్, అండ్ ఫార్మసీ,ఇంజనీరింగ్ లో అమ్మాయిలదే హవా కొనసాగింది.

ఇంజినీరింగ్ లో ఉత్తీర్ణత శాతం:

  • అబ్బాయిలు - 74.38 శాతం ఉత్తీర్ణత
  • అమ్మాయిలు - 75.85 శాతం ఉత్తీర్ణత
  • మొత్తం ఉత్తీర్ణత శాతం - 74.98

అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ లో ఉత్తీర్ణత శాతం :

అబ్బాయిలు - 88.25 శాతం ఉత్తీర్ణత

అమ్మాయిలు - 90.18 శాతం ఉత్తీర్ణత

మొత్తం - 89.66 శాతం ఉత్తీర్ణత సాధించారు.

త్వరలోనే ఈఏపీసెట్ కౌన్సెలింగ్ తేదీలను ప్రకటిస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఇవాళే కమిటీ ఏర్పాటు అవుతుందని… త్వరలోనే షెడ్యూల్ ఖరారవు అవతుందని పేర్కొన్నారు.

Whats_app_banner