తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live November 21, 2024: Lagacharla Incident : తెలంగాణ సీఎస్, డీజీపీకి నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశం
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 21 Nov 202404:55 PM IST
తెలంగాణ News Live: Lagacharla Incident : తెలంగాణ సీఎస్, డీజీపీకి నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశం
- Lagacharla Incident : లగచర్లలో అధికారులపై దాడి కేసు మరో మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో తెలంగాణ సీఎస్, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు ఇచ్చింది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అటు ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి, నివేదిక ఇవ్వనుంది.
Thu, 21 Nov 202403:38 PM IST
తెలంగాణ News Live: TGPSC Group 2 Exams : తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల.. ముఖ్య తేదీలు ఇవే
- TGPSC Group 2 Exams : గ్రూప్-2 అభ్యర్థులకు టీజీపీఎస్సీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పరీక్షల తేదీలు, హాల్ టికెట్ల గురించి టీజీపీఎస్సీ వివరాలు వెల్లడించింది. వచ్చేనెలలో పరీక్షలు ఉంటాయని కమిషన్ స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Thu, 21 Nov 202402:57 PM IST
తెలంగాణ News Live: Telangana ACB : తెలంగాణలో ఏసీబీ దూకుడు.. 21 రోజుల్లో 12 కేసులు.. అవినీతి అధికారులకు చెమటలు!
- Telangana ACB : తెలంగాణలో ఏసీబీ దూకుడు మీద ఉంది. అవినీతి అధికారులకు చెమటలు పట్టిస్తోంది. వరుసగా కేసులు నమోదు చేస్తూ.. అవినీతి అధికారుల ఆటకట్టిస్తోంది. అయినా.. అధికారులు మాత్రం మారడం లేదు. లంచాలకు మరిగి పేదల రక్తం పీలుస్తున్నారు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు.
Thu, 21 Nov 202401:11 PM IST
తెలంగాణ News Live: AP TG Health Insurance : హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. అయితే ఈ 9 విషయాలు మీ కోసమే!
- AP TG Health Insurance : ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఊహించని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆస్పత్రులకు వెళ్లే.. లక్షల్లో బిల్లు అవుతోంది. దీంతో చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. అయితే.. ఇదే అదనుగా కొందరు మోసాలు చేస్తున్నారు. ప్రజలను నమ్మించి నట్టేట ముంచుతున్నారు.
Thu, 21 Nov 202412:27 PM IST
తెలంగాణ News Live: TG Electric Bike : కొని 40 రోజులు కాలేదు.. అప్పుడే పేలిన ఎలక్ట్రిక్ బైక్.. డిక్కీలో 2 లక్షలు!
- TG Electric Bike : ఓవైపు కాలుష్యం తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని ప్రభుత్వం సూచిస్తోంది. మరోవైపు ఎలక్ట్రిక్ బైక్‌లు కొన్న కొద్ది రోజుల్లోనే పేలిపోతున్నాయి. దీంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. జగిత్యాల జిల్లాలో ఓ ఇంట్లో ఛార్జింగ్ పెట్టిన బైక్ పేలిపోయింది.
Thu, 21 Nov 202410:40 AM IST
తెలంగాణ News Live: KTR : ఖబర్దార్ రేవంత్.. ఇది తెలంగాణ.. ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు వస్తుంది : కేటీఆర్
- KTR : తెలంగాణ రాజకీయాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా కేటీఆర్ కాంగ్రెస్ సర్కారు తీరుపై ఫైర్ అవుతున్నారు. బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లాలో తలపెట్టిన సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు.
Thu, 21 Nov 202409:46 AM IST
తెలంగాణ News Live: TG Farmers : రైతులు వరి కొయ్యలను కాలబెట్టొద్దు.. నష్టాలు ఉన్నాయంటున్న శాస్త్రవేత్తలు
- TG Farmers : వరి కోతల తర్వాత రైతులు వరి కొయ్యలను తగలబెడుతున్నారు. అయితే.. దీని ద్వారా రైతులకు నష్టం జరుగుతోందని.. పర్యావరణంలో కాలుష్యం పెరుగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అటు ప్రభుత్వం కూడా వరి కొయ్యలు తగలబెట్టొద్దని అన్నదాతలకు సూచిస్తోంది.
Thu, 21 Nov 202404:34 AM IST
తెలంగాణ News Live: Kodangal : పట్నం నరేందర్ రెడ్డి కస్టడీ పిటిషన్‌పై నేడు తీర్పు.. కొడంగల్‌లో టెన్షన్ వాతావరణం
- Kodangal : వికారాబాద్ జిల్లాలో అధికారులపై దాడి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పట్నం నరేందర్ రెడ్డి కస్టడీ పిటిషన్‌పై ఇవాళ తీర్పు వెలువడనుంది. నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. దీనిపై వాదనలు ముగిశాయి. ఇవాళ కొడంగల్ కోర్టు తీర్పు వెల్లడించనుంది.
Thu, 21 Nov 202404:10 AM IST
తెలంగాణ News Live: TG Jawahar Navodaya Vidyalaya : నవోదయ దరఖాస్తు గడువు పొడిగింపు.. ఈ లింక్ ద్వారా అప్లై చేసుకోండి
- TG Jawahar Navodaya Vidyalaya : నవోదయ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. 9, 11వ తరగతుల్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు గడువును పొడించారు. https://navodaya.gov.in/nvs/nvs-school/WARANGAL/hi/admission/Admission-Notifications/ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
Thu, 21 Nov 202402:41 AM IST
తెలంగాణ News Live: TG Graduate MLC Elections : ఓటర్ తుది జాబితాకు కసరత్తు - 28 వేల మంది పట్టభద్రుల దరఖాస్తులు తిరస్కరణ
- ఉత్తర తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తును అధికారులు ముమ్మరం చేశారు. ఓటర్ నమోదు కోసం ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ నాలుగు జిల్లాల్లో పరిధిలో 3లక్షల 50 వేల మంది దరఖాస్తు చేసుకోగా 28 వేల మంది దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. మరికొన్ని పరిశీలనలో ఉన్నాయి.
Thu, 21 Nov 202401:48 AM IST
తెలంగాణ News Live: TG TET 2024 II Updates : ముగిసిన 'టెట్' అప్లికేషన్లు - రేపటి వరకు ఎడిట్ ఆప్షన్, డిసెంబర్ 26న హాల్ టికెట్ల జారీ
- TG TET 2024 Exam: తెలంగాణ టెట్ దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. మొత్తం 2 లక్షల 48 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నవంబర్ 22వ తేదీ వరకు ఎడిట్ చేసుకోవచ్చు. జనవరి 1, 2025 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి.