TG Jawahar Navodaya Vidyalaya : నవోదయ దరఖాస్తు గడువు పొడిగింపు.. ఈ లింక్ ద్వారా అప్లై చేసుకోండి
TG Jawahar Navodaya Vidyalaya : నవోదయ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. 9, 11వ తరగతుల్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు గడువును పొడించారు. https://navodaya.gov.in/nvs/nvs-school/WARANGAL/hi/admission/Admission-Notifications/ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
మామునూరులోని జవహార్ నవోదయ విద్యాలయం విద్యార్థులకు మరో అవకాశం ఇచ్చింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను, 9, 11వ తరగతుల్లో ప్రవేశం కోసం దరఖాస్తు గడువును మరోసారి పొడించారు. ఈ మేరకు ప్రిన్సిపల్ పూర్ణిమ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి, ఆర్హత ఉన్న విద్యార్థులు నవంబర్ 26వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ పూర్ణిమ కోరారు. వెబ్‌సైట్ లింగ్ https://navodaya.gov.in/nvs/nvs-school/WARANGAL/hi/admission/Admission-Notifications/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏదైనా సందేహాలు ఉంటే jnvmwarangal@gmail.com మెయిల్ ఐడీ ద్వారా నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. అలాగే +91-0870-2556373 ఫోన్ నంబర్‌లో కూడా సంప్రదించవచ్చని చెప్పారు.
దేశంలోని మొత్తం 650 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. తెలంగాణలో 9, ఆంధ్రప్రదేశ్‌లో 15 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. వాటిల్లో 9, 11వ తరగతుల్లో 2025-26 విద్యా సంత్సరానికి ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఆయా నవోదయ పాఠశాలల్లో అడ్మిషన్లు ఇస్తారు. ఎంపికైన వారికి ఉచిత విద్య అందిస్తారు. బాల బాలికలకు వేర్వేరు వసతి సౌకర్యాలు ఉంటాయి. 2025 ఫిబ్రవరిలో ప్రవేశ పరీక్ష ఉంటుంది.
ఉచిత కోచింగ్..
వరంగల్ నిట్‌లో డిసెంబర్ 2 నుంచి జనవరి 27 వరకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచితంగా గేట్ కోచింగ్ ఇవ్వనున్నారు. ఈ మేరకు నిట్ సంచాలకులు ఆచార్య బిద్యాధర్ సుభూది ప్రకటన విడుదల చేశారు. కోచింగ్‌తో పాటు అభ్యర్థులకు ఉచితంగా నోట్స్, అధ్యయన సామగ్రి అందిస్తామన్నారు. పూర్తి వివరాలకు www.nitw.ac.in వెబ్‌సైట్‌లో, లేదా 99631 69781, 83329 69287 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.