TG TET 2024 II Updates : ముగిసిన 'టెట్' అప్లికేషన్లు - రేపటి వరకు ఎడిట్ ఆప్షన్, డిసెంబర్ 26న హాల్ టికెట్ల జారీ
TG TET 2024 Exam: తెలంగాణ టెట్ దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. మొత్తం 2 లక్షల 48 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నవంబర్ 22వ తేదీ వరకు ఎడిట్ చేసుకోవచ్చు. జనవరి 1, 2025 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి.
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2024 (II) దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. నవంబర్ 20వ తేదీ రాత్రి వరకు 2 లక్షల 48 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. ఇందులో ఒక్క పేపర్-2కే లక్ష 55 వేల అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక అప్లికేషన్లు చేసుకున్న అభ్యర్థులు ఏమైనా పొరపాట్లు ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇందుకు నవంబర్ 22వ తేదీ వరకు గడువునిచ్చారు.
ఇలా ఎడిట్ చేసుకోండి…
- తెలంగాణ టెట్ (2)కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఇక్కడ తెలంగాణ టెట్ - 2 లింక్ పై క్లిక్ పై చేయాలి.
- కొత్తగా ఓపెన్ అయ్యే విండో హోం పేజీలో Edit Application అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి.
- ఇక్కడ Journal Number, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి.
- మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీ వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు.
- చివరగా సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ఎడిట్ పూర్తి అవుతుంది.
- ప్రింట్ అప్లికేషన్ పై క్లిక్ చేసి మీ దరఖాస్తు ఫారమ్ ను పొందవచ్చు.
ఈ ఎడిట్ ఆప్షన్ తో మీ దరఖాస్తును ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ అవకాశం ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ఒక్కసారి ఎడిట్ చేసి సబ్మిట్ చేస్తే… మళ్లీ ఎడిట్ చేసుకునే అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణ టెట్ హాల్ టికెట్లు 26 డిసెంబర్ 2024న విడుదలవుతాయి. జనవరి 1, 2025వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. జనవరి 20, 2025తో ముగుస్తాయి. ఫిబ్రవరి 5వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు. ఈ టెట్ పూర్తి అయ్యే సమయానికి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
టెట్ పరీక్షల్లో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఓసీ అభ్యర్థులకు-90 మార్కులు, బీసీలకు 75, మిగిలిన వారికి 60 మార్కులు వస్తే టెట్ ఉత్తీర్ణులుగా గుర్తిస్తారు. రిజర్వేషన్ల ఆధారంగా నిర్దేశిత మార్కులు సాధించిన వారికి మాత్రమే డీఎస్సీ రాసేందుకు అవకాశం లభిస్తుంది. టెట్ పరీక్షల్లో వచ్చిన మార్కులకు డిఎస్సీ నియామకాల్లో 20 శాతం వెయిటేజ్ ఉంటుంది. డీఎస్సీ నియాకంలో టెట్ స్కోర్ అత్యంక కీలకం.
తెలంగాణ టెట్ 2024 II నోటిఫికేషన్ - ముఖ్య తేదీలు:
- టెట్ దరఖాస్తుల వెబ్ సైట్ - https://tgtet2024.aptonline.in/tgtet/
- హాల్ టికెట్ల జారీ - 26 డిసెంబర్ 2024
- టెట్ పరీక్షలు - జనవరి 1, 2025వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. జనవరి 20, 2025తో ముగుస్తాయి.
- పరీక్ష సమయం - మొదటి సెషన్: 9.00 AM to 11.30 AM, రెండో సెషన్ : 2.00 PM to 4.30 PM
- టెట్ ఫలితాలు - 05 ఫిబ్రవరి 2025.