Begumpet Railway Station : మారనున్న 'బేగంపేట్' రైల్వే స్టేషన్ రూపురేఖలు - ఈ ఫొటోలు చూడండి-begumpet railway station modernisation under the amrit bharat station scheme photos see here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Begumpet Railway Station : మారనున్న 'బేగంపేట్' రైల్వే స్టేషన్ రూపురేఖలు - ఈ ఫొటోలు చూడండి

Begumpet Railway Station : మారనున్న 'బేగంపేట్' రైల్వే స్టేషన్ రూపురేఖలు - ఈ ఫొటోలు చూడండి

Nov 21, 2024, 12:16 PM IST Maheshwaram Mahendra Chary
Nov 21, 2024, 12:16 PM , IST

  • Begumpet Railway Station :అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ అధునాతనంగా అభివృద్ది చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని బేగంపేట్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోనున్నాయి. ఇప్పటికే 60 శాతానికి పైగా పనులు పూర్తి అయినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

అధునాతన సౌకర్యాలతో హైదరాబాద్ లోని బేగంపేట్  రైల్వే స్టేషన్ అందుబాటులో రానుంది. పనులు కొనసాగుతున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. 

(1 / 7)

65 శాతానికి పైగా పనులు పూర్తి అయినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి ‘X’లో కొన్ని ఫొటోలను షేర్ చేశారు.

(2 / 7)

బేగంపేట రైల్వే స్టేషన్‌ అభివృద్ధికి రూ.26.55 కోట్లు కేటాయించారు.  సుమారు రోజూ 16,648మంది వచ్చిపోయే ఈస్టేషన్‌కు ఎయిర్‌పోర్టు స్థాయి సౌకర్యాలు కల్పించాలని సౌత్ సెంట్రల్ రైల్వే నిర్ణయించన సంగతి తెలిసిందే.

(3 / 7)

ప్రయాణికుల కోసం స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు, 12 మీటర్ల వెడల్పు ర్యాంపుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి, 2 లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.

(4 / 7)

 రైల్వే ప్లాట్‌ఫామ్‌ మొత్తానికి షెడ్డు నిర్మాణం చేశారు. స్టేషన్‌ బయట గ్రీనరీ, నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ నిర్దేశాలకు అనుగుణంగా మురుగునీటి శుద్ధికి ప్లాంటు ఏర్పాట్లు చేస్తున్నారు. 

(5 / 7)

24 బోగీల ట్రైను ఆగే ప్లాట్‌ఫామ్‌ అంతా పైకప్పులు ఏర్పాటు చేస్తున్నారు. ఎంఎంటీఎస్‌ స్టేషన్లకు ఇరువైపుల నుంచి చేరుకునే విధంగా రోడ్లు, 6 మీటర్ల వెడల్పుతో కొత్త వంతెనలు, లిఫ్టులు సమకూరుస్తున్నారు.

(6 / 7)

మిగిలిన 25 శాతం పనులు కూడా త్వరిగతగతిన పూర్తి చేసే విధంగా రైల్వే శాఖ అడుగులు వేస్తోంది. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం పాత రైల్వే స్టేషన్లను ఆధునీక హంగులతో అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే నగరంలో ఉన్న చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి సిద్ధమైంది.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు