Andhra Pradesh News Live October 16, 2024: Visakha Crime : విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ఘోరం, గొర్రెను అమ్మిన డ‌బ్బుల ఇవ్వలేద‌ని తండ్రిని హ‌త్య చేసిన కొడుకు-today andhra pradesh news latest updates october 16 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live October 16, 2024: Visakha Crime : విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ఘోరం, గొర్రెను అమ్మిన డ‌బ్బుల ఇవ్వలేద‌ని తండ్రిని హ‌త్య చేసిన కొడుకు

Visakha Crime : విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ఘోరం, గొర్రెను అమ్మిన డ‌బ్బుల ఇవ్వలేద‌ని తండ్రిని హ‌త్య చేసిన కొడుకు(HT_PRINT)

Andhra Pradesh News Live October 16, 2024: Visakha Crime : విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ఘోరం, గొర్రెను అమ్మిన డ‌బ్బుల ఇవ్వలేద‌ని తండ్రిని హ‌త్య చేసిన కొడుకు

05:04 PM ISTOct 16, 2024 10:34 PM HT Telugu Desk
  • Share on Facebook
05:04 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 16 Oct 202405:04 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Visakha Crime : విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ఘోరం, గొర్రెను అమ్మిన డ‌బ్బుల ఇవ్వలేద‌ని తండ్రిని హ‌త్య చేసిన కొడుకు

  • Visakha Crime : విశాఖ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గొర్రెను అమ్మిన డబ్బులు ఇవ్వలేదని తండ్రితో గొడవ పడి చివరకు హత్య చేశాడు ఓ కొడుకు. మద్యానికి బానిసైన కొడుకు ఈ దారుణానికి ఒడిగట్టాడనని స్థానికులు అంటున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202404:41 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Schools Holiday : పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటనున్న వాయుగుండం, రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

  • AP Schools Holiday : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపు తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తు్న్నాయి. దీంతో పలు జిల్లాల్లో రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202401:29 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Cabinet Decisions : ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన, ఆరు కొత్త ఇండస్ట్రియల్ పాలసీలకు ఆమోదం- ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

  • AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరు కొత్త ఇండస్ట్రియల్ పాలసీలపై చర్చించి కేబినెట్ ఆమోదించింది. 'వన్ ఫ్యామిలీ - వన్ ఎంట్రప్రెన్యూర్‌' అనే నినాదంతో కూటమి ప్రభుత్వం కొత్త ఇండస్ట్రియల్ పాలసీలు అమలు చేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202412:36 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala Rains : తిరుమలలో భారీ వర్షాలు, రేపటి వరకు శ్రీవారి మెట్టు నడకమార్గం మూసివేత

  • Tirumala Rains : భారీ వర్షాల నేపథ్యంలో తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని రేపటి వరకు మూసివేయాలని టీటీడీ నిర్ణయించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. కొండ చరియలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఈవో అధికారులను ఆదేశించారు

పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202412:18 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Rains in Tirumala : భక్తులకు TTD అలర్ట్... శ్రీవారి మెట్టు నడక మార్గం మూసివేత, ఎప్పటివరకంటే..!

  • భారీ వర్షాల కారణంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని అక్టోబర్ 17 వరకు మూసివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈవో శ్యామలరావు ప్రకటన విడుదల చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ప్రకటించారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202411:56 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Rains Update : ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం, నెల్లూరుకి 370 కి.మీ దూరంలో- ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్

  • AP Rains Update : ఏపీ వైపీ వాయుగుండం దూసుకొస్తుంది. నెల్లూరుకి 370 దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయ్యి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202411:10 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, అక్టోబరు 19న ఆర్జితసేవా ఆన్లైన్ టికెట్ల జనవరి కోటా విడుదల

  • Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి ఆర్జిత, వర్చువల్, అంగప్రదక్షిణం సహా ఇతర దర్శనం, గదుల బుకింగ్ టికెట్లకు సంబంధించి జనవరి నెల కోటాను అక్టోబర్ 19 నుంచి 24వ తేదీ వరకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అక్టోబర్ 19న ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేయనుంది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202409:52 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Srikakulam : శ్రీకాకుళం జిల్లాలో పెను విషాదం, భ‌ర్తపై కోపంతో కుమారుల‌కు కూల్‌డ్రిక్‌లో విషమిచ్చి భార్య ఆత్మహత్యాయత్నం

  • Srikakulam Crime : శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భర్తపై కోపంతో ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202409:24 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tdp Office Attack Case : వైసీపీ నేత సజ్జలకు షాక్, రేపు విచారణకు రావాలని పోలీసుల నోటీసులు

  • Tdp Office Attack Case : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. గురువారం ఉదయం మంగళగిరి పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202407:35 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Liquor Prices: జగన్ బాటలోనే చంద్రబాబు, పాత ధరలతోనే మద్యం అమ్మకాలు.. కొనసాగనున్న ధరల బాదుడు, మద్యం ధరల జాబితా ఇదే..

  • AP Liquor Prices: ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో మద్యం ధరలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన కూటమి పార్టీలు, ప్రైవేట్ దుకాణాల్లో అవే ధరలను కొనసాగించడంపై  నిరసనలు వ్యక్తమవుతున్నాయి.మద్యం ధరలు తగ్గిస్తామని చెప్పినా, పాత ధరలతోనే  లిక్కర్ సరఫరా చేస్తోంది. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202407:04 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP DSC Coaching: ఏపీ డిఎస్సీ 2024 ఉచిత శిక్షణకు నోటిఫికేషన్‌, జ్ఞానభూమిలో ఆన్లైన్ దరఖాస్తులు

  • AP DSC Coaching: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో వెలువడనున్న డిఎస్సీ 2024 ఉపాధ్యాయ నియామకాలకు  సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది.  అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు  డిఎస్సీ 2024 పరీక్షలకు శిక్షణనిస్తారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202406:03 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Special Trains: దీపావ‌ళికి అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాలు మీదుగా ప్రత్యేక రైళ్లు

  • Special Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు  రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పండ‌గా నేప‌థ్యంలో అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాలు మీదుగా రెండు ప్ర‌త్యేక రైళ్లను న‌డ‌ప‌నున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బెంగళూరు,కలబురగి స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202405:33 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Govt Jobs 2024 : ఏపీ ఫిషరీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు - నెలకు రూ. 45 వేల జీతం..!

  • AP Fisheries Department Jobs 2024 : ఏపీ మత్స్యశాఖ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా.. మూడు ప్రోగ్రామ్ మేనేజర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://fisheries.ap.gov.in/ వెబ్ సైట్ లోకి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202404:51 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: APSRTC Special Services : శబరిమలకు ప్ర‌త్యేక బ‌స్సులు - ఏపీఎస్ఆర్టీసీ ప్యాకేజీలు

  • అయ్య‌ప్ప స్వామి భ‌క్తుల‌కు ఏపీఎస్ఆర్టీసీ శుభ‌వార్త చెప్పింది. శ‌బ‌రిమ‌ల‌కు ప్ర‌త్యేక బ‌స్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడు ర‌కాల ప్యాకేజీల‌ను నిర్ణ‌యించింది. ఇందులో ఇంద్ర‌, సూప‌ర్ ల‌గ్జ‌రీ, అల్ట్రా డీల‌క్స్ బ‌స్సుల‌ు ఉన్నాయి. వాటి వివరాలను ఇక్కడ చూడండి…
పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202404:43 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Inter Colleges : ఏపీ ఇంటర్ కాలేజీల్లో ప్రత్యేక తరగతులు - మారిన టైమింగ్స్, వివరాలివే

  • ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కీలక ఉత్తర్వులను ఇచ్చింది. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ కాలేజీల్లో ప్రత్యేక తరగతులు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న సమయం మాత్రమే కాకుండా… ఒక గంట ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. దీంతో సాయంత్రం 5 గంటల వరకు కాలేజీలు పని చేయనున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202404:08 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: RBI Internship 2024 : ఆర్బీఐ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్, నెలకు రూ.20 వేల స్టైఫండ్- ఇలా అప్లై చేసుకోండి

  • RBI Internship 2024 : ఆర్బీఐ సమ్మర్ ఇంటర్న్ షిప్-2024 ప్రోగ్రామ్ కు దరఖాస్తులు ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా 125 మంది విద్యార్థులకు మూడు నెలల పాటు ఆర్బీఐ శిక్షణ ఇస్తుంది. అక్టోబర్ 15 దరఖాస్తులు ప్రారంభం కాగా...డిసెంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202403:47 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Texas Road Accident: అమెరికాలోని టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం, ఐదుగురు చిత్తూరు జిల్లా వాసులు దుర్మరణం

  • Texas Road Accident: అమెరికాలోని రాండాల్ఫ్‌ ప్రాంతంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిదుగురు ప్రవాస భారతీయులు మృతి చెందారు. వారిలో ఒక మహిళతో పాటు   ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారు ఉన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202402:17 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Skill Scam: ఆంధ్రా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసు.. రూ.23 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన ఈడీ

  • Skill Scam:  ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - సీమెన్స్ ప్రాజెక్టు కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద రూ.23 కోట్లకు పైగా విలువైన కొత్త ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్  మంగళవారం ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇదే కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202401:48 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Gang Rape Accused: గ్యాంగ్‌రేప్‌ కేసు నిందితుల అరెస్ట్, నిందితుల్లో ముగ్గురు మైనర్లు

  • Gang Rape Accused: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం కేసు నిందితుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులో ఒకరు పరారీలో ఉండగా, పట్టుబడిన వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. చోరీలు, మహిళలపై అఘాయిత్యాలు, నేరాలకు అలవాటు పడిన కరడు గట్టిన ముఠాగా గుర్తించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202401:02 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Heavy Rains: దక్షిణ కోస్తా, రాయలసీమ దిశగా కదులుతున్న వాయుగుండం, నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు

  • AP Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం  దక్షిణ కోస్తా జిల్లా వైపు సాగుతోంది. వాయుగుండం ప్రభావంతో  దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం నుంచి తిరుపతి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.  
పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202412:43 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP High Court: ఏపీ హైకోర్టుకు మ‌రో ముగ్గురు న్యాయ‌మూర్తులు…సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు

  • AP High Court: ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు న్యాయ‌మూర్తులుగా మ‌రో ముగ్గురి పేర్లను సుప్రీం కోర్టు కొలిజియం సిఫార్సు చేసింది. ముగ్గురు న్యాయ‌వాదులకు హైకోర్టు న్యాయ‌మూర్తులుగా నియామ‌కానికి పేర్ల‌ను సిఫార‌సు చేసింది. ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో సహా 26 మంది న్యాయమూర్తులు ఉన్నారు.
పూర్తి స్టోరీ చదవండి