Texas Road Accident: అమెరికాలోని టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం, ఐదుగురు చిత్తూరు జిల్లా వాసులు దుర్మరణం
Texas Road Accident: అమెరికాలోని రాండాల్ఫ్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిదుగురు ప్రవాస భారతీయులు మృతి చెందారు. వారిలో ఒక మహిళతో పాటు ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారు ఉన్నారు.
Texas Road Accident: అమెరికాలోని బాన్‌హామ్ ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రవాసాంధ్రులు దుర్మరణం పాలయ్యారు. రాండాల్ఫ్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిదుగురు ప్రవాస భారతీయులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఒక మహిళ సహా ముగ్గురు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. మితిమీరిన వేగంతో కార్లను నడపడంతోనే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.
టెక్సాస్ రాష్ట్ర రహదారిపై దక్షిణ బాన్‌హామ్‌కు ఏడు మైళ్ల దూరంలో అమెరికా కాలమానం సోమవారం సాయంత్రం 6.45 గంటలకు రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు టెక్సాస్ పబ్లిక్ సేఫ్టీ వర్గాలు తెలిపాయి. ప్రమాదానికి మితిమీరిన వేగమే కారణమని ట్విట్టర్‌లో స్థానికులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్వాపరాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉందని ప్రవాస భారతీయు వెల్లడించారు.
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలుగు వారు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పయారు.
ఓక్లహోమా నుంచి టెక్సాస్‌లోని డల్లాస్‌కు ప్రయాణిస్తున్న బాధితులు ప్రయాణిస్తున్న కారు మరో కారును ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. సోమవారం సాయంత్రం 5:55 గంటలకు బోన్‌హామ్ మరియు ట్రెంటన్ మధ్య స్టేట్ హైవే 121పై ఈ క్రాష్ జరిగినట్టు స్థానికులు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.