AP Govt Jobs 2024 : ఏపీ ఫిషరీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు - నెలకు రూ. 45 వేల జీతం..!-ap fisheries department recruitment notification for program manager vacancies 2024 key details check here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt Jobs 2024 : ఏపీ ఫిషరీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు - నెలకు రూ. 45 వేల జీతం..!

AP Govt Jobs 2024 : ఏపీ ఫిషరీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు - నెలకు రూ. 45 వేల జీతం..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 16, 2024 11:03 AM IST

AP Fisheries Department Jobs 2024 : ఏపీ మత్స్యశాఖ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా.. మూడు ప్రోగ్రామ్ మేనేజర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://fisheries.ap.gov.in/ వెబ్ సైట్ లోకి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఏపీ మత్స్యశాఖలో ఉద్యోగాలు
ఏపీ మత్స్యశాఖలో ఉద్యోగాలు

ఏపీ ఫిషరీస్ డిపార్ట్ మెంట్ నుంచి రిక్రూట్ మెంట్ ప్రకటన విడుదలైంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన( Pradhan Mantri Matsya Sampada Yojana ) కింద మూడు పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ ప్రతిపాదికన ప్రోగ్రామ్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఫీషరిస్ సైన్స్ లో మాస్టర్స్ పూర్తి చేయటం లేదా... జువాలజీ, మెరైన్ సైన్స్, మెరైన బయలాజీ, ఫిషరీస్ ఎకనామిక్స్ లేదా ఐటీలో పీజీ చేసి ఉండాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు నోడల్ ఆఫీసర్ 8332959836 ను సంప్రదించవచ్చు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.45వేల జీతం చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 35 ఏళ్ల లోపు ఉండాలి. అప్లికేషన్ ఫారమ్ ను https://fisheries.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్ ను comfishap@gmail.com మెయిల్ అడ్రస్ కు పంపాల్సి ఉంటుంది. ఎంపికైన వారు కృష్ణా, బాపట్ల, కర్నూలు జిల్లా పరిధిలో విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది.

ముఖ్య వివరాలు :

  • ఉద్యోగ ప్రకటన -  ఫిషరీస్ డిపార్ట్ మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
  • ఉద్యోగాలు - ప్రోగ్రామ్ మేనేజర్
  • ఖాళీలు - 03
  • దరఖాస్తులకు చివరి తేదీ - 24 అక్టోబర్ 2024
  • https://fisheries.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవాలి.
  • పూర్తి చేసిన దరఖాస్తులను comfishap@gmail.com  మెయిల్ అడ్రస్ కు పంపాలి.
  • అధికారిక వెబ్ సైట్ - https://fisheries.ap.gov.in/ 
  • ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ - 8332959836

 

Whats_app_banner