SBI SCO Recruitment : ఎస్బీఐలో ఉద్యోగ అవకాశాలు- రూ. 26లక్షలు వరకు జీతం! అప్లికేషన్‌కి ఈరోజే లాస్ట్ ఛాన్స్
SBI Recruitment 2024 : ఎస్బీఐ ఎస్సీఓ రిక్రూట్మెంట్ ద్వారా 1497 పోస్టులను సంస్థ భర్తీ చేయనుంది. వీటిల్లో గరిష్ఠంగా ఏడాదికి రూ. 26లక్షల జీతం ఇచ్చే పోస్టులు కూడా ఉన్నాయి. అప్లికేషన్‌కి ఈరోజే చివరి తేది. పూర్తి వివరాలు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (ఎస్సీఓ) రిక్రూట్మెంట్ 2024 కోసం దరఖాస్తు విండో నేటితో (అక్టోబర్ 14) ముగియనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు బ్యాంక్ కెరీర్స్ పోర్టల్ (sbi.co.in/web/careers/)లో డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్), అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్) ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఎస్సీఓ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ఎస్బీఐ 1,497 ఖాళీలను భర్తీ చేయనుంది. గతంలో అక్టోబర్ 4 వరకు దరఖాస్తు గడువు ఉండగా, దాన్ని మరో 10 రోజులకు అంటే అక్టోబర్ 14కు పొడిగించారు.
ఎస్బీఐ ఎస్సీఓ రిక్రూట్మెంట్ డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎస్బీఐ రిక్రూట్మెంట్- ఖాళీల వివరాలు..
డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) - ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ డెలివరీ ఎంఎంజీఎస్-2: 187 ఖాళీలు
డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) - ఇన్ఫ్రా సపోర్ట్ అండ్ క్లౌడ్ ఆపరేషన్స్: 412
డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) -నెట్వర్కింగ్ ఆపరేషన్స్: 80
డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) 27
డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) - ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ: 7
అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్): 784
అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్) బ్యాక్లాగ్ ఖాళీలు: 14
ఎస్బీఐ పీఓ 2024 నోటిఫికేషన్ లైవ్ అప్డేట్స్
డిప్యూటీ మేనేజర్ ఖాళీల వార్షిక సీటీసీ సంవత్సరానికి సుమారు రూ.25.75 లక్షలు. అసిస్టెంట్ మేనేజర్‌కి వార్షిక సీటీసీ రూ.18.67 లక్షలు.
అభ్యర్థులు ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ ఒక అభ్యర్థి బహుళ దరఖాస్తులను సమర్పిస్తే, చివరి చెల్లుబాటు అయ్యే, పూర్తి చేసిన దరఖాస్తును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని బ్యాంక్ తెలిపింది.
ఎస్బీఐ ఎస్సీఓ రిక్రూట్మెంట్ 2024: ఇలా అప్లై చేసుకోండి.
స్టెప్ 1- బ్యాంక్ కెరీర్స్ పోర్టల్ sbi.co.in/web/careers కి వెళ్లండి
స్టెప్ 2- 'జాయిన్ ఎస్బీఐ'పై క్లిక్ చేసి, ఆపై కరెంట్ ఓపెనింగ్స్ ఆప్షన్స్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3- అడ్వర్టైజ్‌మెంట్స్‌పై క్లిక్ చేసి అప్లై ఆన్లైన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 4- కోరిన సమాచారాన్ని అందించడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
స్టెప్ 4- ఇప్పుడు, మీ ఖాతాలోకి లాగిన్ అవ్వండి. అప్లికేషన్ ఫారమ్ నింపండి.
స్టెప్ 5- డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
స్టెప్ 6- మీ ఫారమ్ సబ్మిట్ చేయండి. తదుపరి అవసరాల కోసం ధృవీకరణ పేజీని డౌన్లోడ్ చేయండి.
ఎస్బీఐ ఎస్సీఓ దరఖాస్తు ఫీజు- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం..
డిప్యూటీ మేనేజర్:- పోస్టులకు షార్ట్‌లిస్టింగ్ - టైర్డ్ / లేయర్డ్ ఇంటరాక్షన్ 100 మార్కులకు ఉంటుంది. ఇంటరాక్షన్ కోసం అర్హత మార్కులను బ్యాంకు నిర్ణయిస్తుంది. ఇంటరాక్షన్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికకు మెరిట్ జాబితాను సిద్ధం చేస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు కటాఫ్ మార్కులు (కటాఫ్ పాయింట్ వద్ద కామన్ మార్కులు) సాధిస్తే మెరిట్ జాబితాలో వారి వయసును బట్టి ర్యాంకులు ఇస్తారు.
అసిస్టెంట్ మేనేజర్: ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటరాక్షన్ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షను 2024 నవంబర్ నెలలో నిర్వహిస్తారు. పరీక్షలో 60 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మార్కులు 100. పరీక్ష వ్యవధి 75 నిమిషాలు. కేటగిరీల వారీగా, ఆన్లైన్ రాత పరీక్షలో వారి పనితీరు ఆధారంగా బ్యాంక్ నిర్ణయించిన విధంగా తగిన సంఖ్యలో అభ్యర్థులను ఇంటరాక్షన్‌కి పిలుస్తారు. ఇంటరాక్షన్‌కు 25 మార్కులు ఉంటాయి.
సంబంధిత కథనం