Fixed deposits : 1 ఇయర్​ ఎఫ్​డీల్లో అత్యధిక వడ్డీ ఇస్తున్న బ్యాంక్​లు ఇవే- 0 రిస్క్​తో మంచి రిటర్నులు!-these 7 banks offer highest interest rates on 1 year fixed deposits check full list ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Fixed Deposits : 1 ఇయర్​ ఎఫ్​డీల్లో అత్యధిక వడ్డీ ఇస్తున్న బ్యాంక్​లు ఇవే- 0 రిస్క్​తో మంచి రిటర్నులు!

Fixed deposits : 1 ఇయర్​ ఎఫ్​డీల్లో అత్యధిక వడ్డీ ఇస్తున్న బ్యాంక్​లు ఇవే- 0 రిస్క్​తో మంచి రిటర్నులు!

Sharath Chitturi HT Telugu

Fixed deposits : 1 ఏడాది ఫిక్స్​డ్​ డిపాజిట్లపై (ఎఫ్​డీ) అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తున్న టాప్ 7 బ్యాంకులను వివరాలను ఇక్కడ తెలుసుకోండి. వడ్డీ రేట్లు కట్​ చేసే ముందు పెట్టుబడి పెట్టడం ఉత్తమం!

బ్యాంక్​ ఆఫ్​ బరోడాలో 1 ఇయర్​ ఎఫ్​డీ వడ్డీ రేట్లు ఎంతో తెలుసా? (Mint)

ఫిక్స్​డ్ డిపాజిట్ (ఎఫ్​డీ)లో ఇన్వెస్ట్ చేసే ముందు ఇన్వెస్టర్లు తమ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లను అందించే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల వైపు చూడటం సర్వసాధారణమైన విషయం. అదే చేయాలి కూడా! అయితే బ్యాంకులు దీర్ఘకాలిక డిపాజిట్లకు అధిక రేట్లను అందించడం సాధారణమే అయినప్పటికీ, ఒక్కోసారి మనకి స్వల్ప కాలంలోనే రిస్క్​- ఫ్రీగా మంచి రిటర్నులు కావాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏడాది ఫిక్స్​డ్​ డిపాజిట్లపై (ఎఫ్​డీ) అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తున్న టాప్ 7 బ్యాంకుల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఫిక్స్​డ్​ డిపాజిట్​ వడ్డీ రేట్లు..

అయితే 1 ఇయర్​ ఎఫ్​డీలపై వడ్డీ రేట్లు అనేవి 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు వంటి దీర్ఘకాలిక డిపాజిట్లపై బ్యాంకులు అందించే రేట్ల కంటే తక్కువగా ఉంటాయని అర్థం చేసుకోవాలి.

చాలా బ్యాంకులు తమ ఏడాది డిపాజిట్లపై 6.60 నుంచి 7.10 శాతం వరకు ఆఫర్ చేస్తుండగా, కోటక్ మహీంద్రా బ్యాంక్ అత్యధికంగా (7.1%) వడ్డీ ఇస్తోంది. అదే సమయంలో, సీనియర్ సిటిజెన్లు అదనంగా 50 బేసిస్ పాయింట్లు పొందడానికి అర్హులు! తద్వారా వడ్డీ రేటు పరిధిని 7.1 నుంచి 7.60 శాతానికి పెరుగుతుంది.

రెగ్యులర్ & సీనియర్ సిటిజెన్స్..

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ తన రెగ్యులర్ డిపాజిటర్లకు ఒక సంవత్సరం ఎఫ్​డీ కోసం 6.6 శాతం, సీనియర్ సిటిజెన్లకు సంవత్సరానికి 7.10 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ రేట్లు జులై 24, 2024 నుంచి అమల్లోకి వచ్చాయి.

ఐసీఐసీఐ బ్యాంక్ ఏడాది డిపాజిట్లపై 6.7 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.2 శాతం వడ్డీని అందిస్తోంది.

బ్యాంకులుసాధారణం (%)సీనియర్​ సిటిజెన్​లు (%)
HDFC Bank                                     6.60 7.10
ICICI Bank                                    6.77.2
Kotak Mahindra                         7.1 7.6
State Bank of India                      6.8   7.3
Bank of Baroda                         6.85  7.35
Punjab National Bank                            6.8   7.3
Federal Bank                                6.8      7.3

(సోర్స్​: బ్యాంక్ వెబ్సైట్​లు)

కోటక్ మహీంద్రా డిపాజిటర్లకు 7.1 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ రేట్లు 2024 జూన్ 14 నుంచి అమల్లోకి వచ్చాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సాధారణ పౌరులకు 6.8 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.3 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ రేట్లు జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి.

బ్యాంక్ ఆఫ్ బరోడా సాధారణ పౌరులకు 6.85 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.35 శాతం వడ్డీని ఇస్తోంది. ఇది 2024 అక్టోబర్ 3 నుంచి అమల్లోకి వచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా అక్టోబర్ 1న వడ్డీ రేట్లను సవరించింది. ఇప్పుడు సాధారణ పౌరులకు 6.8 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.3 శాతం వడ్డీని పీఎన్​బీ అందిస్తోంది. సెప్టెంబర్ 16 నుంచి అమల్లోకి వచ్చిన ఏడాది డిపాజిట్లపై కూడా ఫెడరల్ బ్యాంక్ ఇవే రేట్లను ఇస్తోంది.

ఆర్బీఐ త్వరలో రేపో రేట్​ని తగ్గించనుంది. ఆ తర్వాత ఎఫ్​డీలపై వడ్డీలు దిగొస్తాయి. అందుకే, ఆర్బీఐ ప్రకటన వెలువడే ముందే ఎఫ్​డీల్లో ఇన్​వెస్ట్​ చేయడం ఉత్తమం.

సంబంధిత కథనం