NTPC Recruitment 2024: ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ రిక్రూట్మెంట్; అర్హతలు ఇవే..
ఎన్టీపీసీ లిమిటెడ్ డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఎన్టీపీసీ ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఎన్టీపీసీ అధికారిక వెబ్సైట్ ntpc.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎన్టీపీసీ లిమిటెడ్ డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఎన్టీపీసీ అధికారిక వెబ్సైట్ ntpc.co.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 250 డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 2024 సెప్టెంబర్ 28.
ఖాళీల వివరాలు
ఎలక్ట్రికల్: 45 పోస్టులు
మెకానికల్: 95 పోస్టులు
సీ అండ్ ఐ పోస్టులు: 35 పోస్టులు
సివిల్ కన్స్ట్రక్షన్: 75 పోస్టులు
విద్యార్హతలు
ఎలక్ట్రికల్: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ B.Tech డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
మెకానికల్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో మెకానికల్/ ప్రొడక్షన్ లో బీఈ/ బీ టెక్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
సీ అండ్ ఐ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్/ కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్/ ఇన్స్ట్రుమెంటేషన్ లో బీఈ/ B.Tech డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
సివిల్ కన్స్ట్రక్షన్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో సివిల్/ కన్స్ట్రక్షన్లో బీఈ/ B.Tech డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు పైన పేర్కొన్న పోస్టులకు అప్లై చేయడానికి అవసరమైన వయోపరిమితిని అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు
అర్హతల ఆధారంగా షార్ట్లిస్టింగ్/ స్క్రీనింగ్, పోస్టు క్వాలిఫికేషన్ అనుభవం, రాత/ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, పర్సనల్ ఇంటర్వ్యూలు మొదలైన ద్వారా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.300 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు లేదా ఆఫ్లైన్ విధానంలో ఫీజు చెల్లించవచ్చు.
ఎలా అప్లై చేయాలి
ఈ కింది స్టెప్స్ ఫాలో అవుతూ ఈ పోస్ట్ లకు అప్లై చేయవచ్చు.
- ఎన్టీపీసీ అధికారిక వెబ్ సైట్ careers.ntpc.co.in లోని ఎన్టీపీసీ కెరీర్స్ లింక్ పై క్లిక్ చేయాలి.
- హోం పేజీలో అందుబాటులో ఉన్న ఎన్ టిపిసి లిమిటెడ్ డిప్యూటీ మేనేజర్ రిక్రూట్ మెంట్ 2024 లింక్ పై క్లిక్ చేయండి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు వ్యక్తిగత వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అనంతరం, సబ్మిట్ పై క్లిక్ చేసి కన్ఫర్మేషన్ పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని భద్రపర్చుకోవాలి.