AP DSC Coaching: ఏపీ డిఎస్సీ 2024 ఉచిత శిక్షణకు నోటిఫికేషన్‌, జ్ఞానభూమిలో ఆన్లైన్ దరఖాస్తులు-ap dsc 2024 free training notification online applications in gnanabhoomi ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Dsc Coaching: ఏపీ డిఎస్సీ 2024 ఉచిత శిక్షణకు నోటిఫికేషన్‌, జ్ఞానభూమిలో ఆన్లైన్ దరఖాస్తులు

AP DSC Coaching: ఏపీ డిఎస్సీ 2024 ఉచిత శిక్షణకు నోటిఫికేషన్‌, జ్ఞానభూమిలో ఆన్లైన్ దరఖాస్తులు

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 16, 2024 12:34 PM IST

AP DSC Coaching: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో వెలువడనున్న డిఎస్సీ 2024 ఉపాధ్యాయ నియామకాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డిఎస్సీ 2024 పరీక్షలకు శిక్షణనిస్తారు.

ఏపీ డిఎస్సీ 2024 కు ఉచిత శిక్షణ
ఏపీ డిఎస్సీ 2024 కు ఉచిత శిక్షణ

AP DSC Coaching: అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డిఎస్సీ 2024 పరీక్షలకు జిల్లాల వారీగా శిక్షణనిచ్చేందుకు సాంఘిక సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. డీఎస్సీ ఉచిత శిక్ష‌ణ‌కు ఈ నెల 21లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి సాంఘిక సంక్షేమ అధికారి కె.శ్రీనివాస‌రావు సూచించారు.

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఉత్త‌ర్వుల మేర‌కు ఎస్‌సీ, ఎస్‌టీ అభ్య‌ర్థుల‌కు ఉచిత డీఎస్సీ శిక్ష‌ణ అందిస్తున్నారు. ఇందుకు https://jnanabhumi.ap.gov.in/ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. జ్ఞాన భూమి వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 21లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ఎన్టీఆర్‌ జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె.శ్రీనివాస‌రావు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సిక్స్ స్టెప్ వెరిఫికేష‌న్ వారు నివసించే స‌చివాల‌యాల్లో జ‌ర‌గాల్సి ఉంటుంది. ఈ నెల 27న నిర్వ‌హించే స్క్రీనింగ్ ప‌రీక్ష‌లో ఎంపికైన మెరిట్ అభ్య‌ర్థుల‌ను అర్హ‌త ప్ర‌కారం ఉచిత శిక్ష‌ణ‌కు ఎంపిక‌ చేస్తారు.

ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు రెసిడెన్షియ‌ల్ విధానంలో ఉచిత డీఎస్సీ శిక్ష‌ణ అందిస్తారు. మరోవైపు డిఎస్సీ శిక్షణనిచ్చేందుకు శిక్షణా సంస్థలు ఎంప్యానెల్‌మెంట్ చేసుకోడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే శిక్ష‌ణ సంస్థ‌లు క‌నీసం గ‌త రెండు డీఎస్‌సీ రిక్రూట్‌మెంట్లలో అభ్యర్థులకు శిక్ష‌ణ ఇచ్చి ఉండాల్సి ఉంటుంది.

గ‌త డీఎస్సీ నియామ‌కాల్లో కనీసం వంద మంది ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొంది ఉండాలి. అలాంటి సంస్థలను డిఎస్సీ శిక్షణ కేంద్రాలుగా ఎంపిక చేస్తారు. ఆస‌క్తి వ్య‌క్తీక‌ర‌ణ డాక్యుమెంట్ నెం.757795ను ఏపీ ఈ-ప్రొక్యూర్మెంట్ పోర్ట‌ల్‌లో అప్‌లోడ్ చేయ‌డం జ‌రిగింద‌ని.. ఆస‌క్తి ఉన్న శిక్ష‌ణ సంస్థ‌లు ఈ నెల 21లోగా ఈ డాక్యుమెంట్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

Whats_app_banner