AP DBT Schemes: ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల్లో ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త రికార్డు.. ఐదేళ్లలో 8.35 కోట్ల లావాదేవీలు-andhra pradesh is a new record in direct money transfer schemes 8 35 transactions in five years ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Dbt Schemes: ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల్లో ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త రికార్డు.. ఐదేళ్లలో 8.35 కోట్ల లావాదేవీలు

AP DBT Schemes: ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల్లో ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త రికార్డు.. ఐదేళ్లలో 8.35 కోట్ల లావాదేవీలు

Sarath chandra.B HT Telugu
Mar 15, 2024 08:06 AM IST

AP DBT Schemes: ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల్లో ఆంధ్రప్రదేశ్‌ కొత్త రికార్డు సృష్టించింది. ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఏకంగా 8.35కోట్ల మందికి సంక్షేమాన్ని అందించింది. ఒక్కొక్కరికి ఒకటికి మించి పథకాలను అందించడం ద్వారా రాష్ట్ర జనాభా కంటే రెట్టింపు సంఖ్యలో ప్రయోజనాలు అందించారు.

నగదు బదిలీ పథకాల అమలులో ఏపీ సరికొత్త రికార్డు
నగదు బదిలీ పథకాల అమలులో ఏపీ సరికొత్త రికార్డు

AP DBT Schemes: ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల్లో DBT Schemes సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్ర జనాభా కంటే ఎక్కువ సంఖ్యలో లబ్దిదారులకు ప్రయోజనం అందించింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఒక్కొక్కరికి ఒకటికి మించి నగదు బదిలీ పథకాలకు అర్హత కల్పించడం ద్వారా ఐదేళ్లలో కోట్ల సంఖ్యలో లబ్దిదారులకు ఆర్ధిక ప్రయోజనాలు అందాయి.

ఏపీలో Andhra pradesh ఐదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రధానం నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలపై Welfare Schemes ప్రధానంగా దృష్టి సారించింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే కోవిడ్‌ విపత్తును ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల విషయంలో ప్రభుత్వం ఎన్ని విమర్శలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. సంక్షేమ పథకాల అమలుపైనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Ys Jagan ప్రధానంగా దృష్టి పెట్టారు.

58 నెలలు… 8.35కోట్ల లావాదేవీలు

ఈ క్రమంలో మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో ఏపీలో నగదు బదిలీ పథకాల గణాంకాలను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన లెక్కలు కనిపించాయి. 58నెలల్లో దాదాపు 8,35,04,830మందికి ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల్లో లబ్ది పొందారు. వీటి ద్వారా ఏకంగా రూ.2,58,855.97 కోట్ల రుపాయలు లబ్దిదారుల ఖాతాలకు జమ చేశారు.

ఒక్కొక్కరికి ఒకటి కంటే ఎక్కువ పథకాలు...

ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల్లో ప్రధానంగా జగనన్న అమ్మఒడి పథకంలో 44,48,865మందికి రూ.26,067.30కోట్లను జమ చేశారు. జగనన్న వసతి దీవెనలో 25,17,245మందికి రూ.4,275.76 కోట్లను అందించారు. జగనన్న విద్యా దీవెన పథకంలో 26,98,728మందికి రూ.12,609.68కోట్లను అందించారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంలో 408మందికి రూ.107.07కోట్లను ఇచ్చారు.

వైఎస్సార్ రైతు భరోసా పథకంలో 53,58,366మందికి రూ.34,378.16కోట్లను ఇచ్చారు. రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకంలో 84,66,217మందికి రూ.2,050.53 కోట్లు, డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంట రుణాల్లో 54,75,651మందికి రూ.7,802.05కోట్లు, రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీలుగా 22,84,841 మందికి రూ.1976.43కోట్లు చెల్లించారు.

నెలకు 66.34లక్షల పెన్షన్లు...

వైఎస్సార్ మత్స్యకార భరోసాలో 2,43,443మందికి రూ.538.06కోట్లు, స్వయం సహాయక బృందాలకు సున్నా వడ్డీ పథకం ద్వారా 1,05,13,365 మందికి రూ.4969 కోట్లు అందించారు. వైఎస్సార్‌ పెన్షన్ కానుక ద్వారా నెల నెల పెన్షన్ల చెల్లింపులో భాగంగా 66,34,742 మందికి ప్రతి నెల రూ.3వేల చొప్పున 58నెలల్లో రూ.88,650.60కోట్లను చెల్లించారు.

వైఎస్సార్ చేయూత ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 26,39,703మంది మహిళలకు రూ.14,129.12 కోట్లను అందించారు. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 78,94,169మందికి రూ.25,570కోట్లను చెల్లించారు. వైఎస్సార్ బీమా పథకంలో 1,03,171మందికి రూ.1848.70కోట్లు, వైఎస్సార్ కాపు నేస్తంలో 3,58,613మందికి రూ.2,029.92కోట్లు, వైఎస్సార్ నేతన్న నేస్తంలో 82,130మందికి రూ.982.98 కోట్లు చెల్లించారు.

అన్ని వర్గాలకు ఆర్థిక ప్రయోజనాలు…

జగనన్న చేదోడు ద్వారా రజక, టైలర్లు, నాయి బ్రహ్మణులైన 3,37,802 మందికి రూ.2029.92కోట్లు చెల్లించారు. వైఎస్సార్ లా నేస్తంలో 5781 మందికి రూ.41.52కోట్లు, వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా 2,76,368మందికి రూ.1,302.34 కోట్లు, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా ఆరోగ్యచికిత్సలు పొందిన 15,64,997మందికి రూ.971.28కోట్లు, ఎంఎస్‌ఎంఇ యూనిట్ల పునరుద్దరణలో 23,236మందికి రూ.2,086.42కోట్లు, అగ్రిగోల్డ్‌ బాధితులైన 10,40,000మందికి రూ.905.57కోట్లు చెల్లించారు.

ఏపీలోని అర్చకులు, ఇమామ్‌లు, మౌజమ్స్, పాస్టర్లకు ఆర్ధిక సాయంగా 77,290మందికి రూ.37.71కోట్లను చెల్లించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి కోవిడ్ ప్రత్యేక సాయం చెల్లింపులో భాగంగా 1,35,05,339మందికి రూ.1350.54కోట్లు చెల్లించారు.

పేదరికం ఆధారంగా పథకాలు…

వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా 4,39,134 మందికి రూ.1257.14 కోట్లు చెల్లించారు. వైఎస్సార్ ఆరోగ్య ద్వారా చికిత్సల రూపంలో 27,39,976మందికి రూ.8845.53 కోట్లను ఖర్చు చేశారు. వైఎస్సార్ కళ్యాణ మస్తు, షాదీతోఫా పథకాల ద్వారా 56,194 మందికి రూ.427.27కోట్లను చెల్లించారు. గృహ నిర్మాణాల లబ్దిదారులకు నేరుగా సాయం అందించడం ద్వారా 21,31,564మందికి రూ.12,295.97కోట్లను చెల్లించారు. జగనన్న తోడు వడ్డీ చెల్లింపు పథకం ద్వారా 15,87,492 మందికి రూ.88.33కోట్లను చెల్లించారు.

ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల ద్వరా 2019 జూన్ నుంచి 2024 ఫిబ్రవరి నాటికి మొత్తం 8,35,04,830 మందికి రూ.2,58,855.97కోట్లను నేరుగా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేశారు. ఈ పథకాల్లో అమ్మఒడి, వసతి దీవెన, విద్యాదీవెన, స్వయం సహాయక బృందాలకు సున్నా వడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, కళ్యాణ మస్తు, షాదీతోఫా వంటి పథకాల్లో కేవలం మహిళల్ని మాత్రమే లబ్దిదారులుగా గుర్తించారు.

ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల్లో 8.35కోట్ల మహిళలకు లబ్ది చేకూరినట్టు ప్రభుత్వ గణంకాలు చెబుతున్నాయి. పరోక్షంగా లబ్ది చేకూర్చిన పథకాలను కలిపితే లబ్దిదారుల సంఖ్య 12.84కోట్లకు చేరుతుంది. మార్చి నెలలో నగదు బదిలీ పథకాలను అందుకుంటున్న మహిళలను కలిపితే డిబిటి స్కీమ్స్‌ ద్వారా నగదు అందుకున్న లావాదేవీల సంఖ్య దాదాపు 9కోట్లకు చేరువలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం