CM Jagan to Kurnool: నేడు కర్నూలులో జగనన్న చేదోడు నిధుల విడుదల-today cm jagan will release jagananna chedodu funds in kurnool district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Today, Cm Jagan Will Release Jagananna Chedodu Funds In Kurnool District

CM Jagan to Kurnool: నేడు కర్నూలులో జగనన్న చేదోడు నిధుల విడుదల

Sarath chandra.B HT Telugu
Oct 19, 2023 07:34 AM IST

CM Jagan to Kurnool: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పర్యటించనున్నారు. వెనుక బడిన సామాజిక వర్గాలకు ప్రభుత్వం అందిస్తోన్న జగనన్న చేదోడు నిధులను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు.

నేడు కర్నూలు జిల్లాకు  సీఎం జగన్
నేడు కర్నూలు జిల్లాకు సీఎం జగన్

CM Jagan to Kurnool: జగనన్న చేదోడు నిధులను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సిఎం జగన్ నేడు విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కుల వృత్తుల్లో ఉన్న రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ల జీవితాల్లో మార్పు కోసం వరుసగా నాలుగో ఏడాది.. 'జగనన్న చేదోడు" నిధుల విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

రాష్ట్ర వ్యాప్తంగా 3,25,020 మంది అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ వృత్తిలో ఉన్న వారికి రూ. 325.02 కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి జమ చేయనున్నారు.

సొంత షాపులు ఉన్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏటా రూ. 10,000 చొప్పున సాయం అందిస్తారు. నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటికే ఒక్కొక్కరికి రూ.40,000 ఆర్థిక సాయాన్ని ఏపీ ప్రభుత్వం అందించింది. తాజాగా గురువారం అందిస్తున్న సాయంతో కలిపి ఈ 4 ఏళ్ళలో కేవలం జగనన్న చేదోడు పథకం ద్వారా ప్రభుత్వం లబ్దిదారులకు రూ. 1,252.52 కోట్ల ఆర్ధిక సాయాన్ని అందించింది.

జగనన్న చేదోడు పథకంలో 1,80,656 మంది టైలర్లకు నాలుగో విడతలోరూ. 180.66 కోట్ల లబ్ధిని చెల్లిస్తారు. 39,813 మంది నాయీ బ్రాహ్మణులకు రూ. 39.81 కోట్లను చెల్లిస్తారు. 1,04,551 మంది రజకులకు నాలుగో విడత సాయంగా రూ. 104.55 కోట్ల లబ్ధి చేకూరుస్తారు.

లంచాలకు, వివక్షకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా, గ్రామ/వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా డిస్ ప్లే చేసి, సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ప్రతి ఒక్కరికి అర్హత ఉంటే మిస్ కాకుండా సాయం అందాలని ప్రభుత్వం యోచిస్తోంది.

అర్హులై ఉండి పొరపాటున, ఏ కారణం చేతనైనా సంక్షేమ - పథకాల లబ్ది అందని వారికి కూడా మరో అవకాశం కల్పిస్తూ. జూన్, డిసెంబర్‌ నెలలలో రెండు విడతల్లో లబ్దిని నేరుగా అందిస్తున్నారు.

జగనన్న చేదోడు పథకం క్రింద చెల్లింపులు ఇలా…

2020-21 సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య 2,98,122 సాయం (రూ. కోట్లలో) 298.12

2021-22 సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య 2,99,225 సాయం (రూ. కోట్లలో) 299.23

2022-23 సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య 3,30,145 సాయం (రూ. కోట్లలో) 330.15

2023-24 సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య 3,25,020 సాయం (రూ. కోట్లలో) 325.02

నాలుగేళ్లలో మొత్తం రూ. 1,252.52 కోట్లను ఆర్ధిక సాయంగా చెల్లించారు.

WhatsApp channel