AP Welfare Schemes: సంక్షేమ పథకాల లబ్దిదారుల ఖాతాల్లోకి నేడు నగదు బదిలీ
AP Welfare Schemes: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు అర్హత ఉన్నా సాంకేతిక కారణాలతో అందుకోలేకపోయిన వారికి నేడు ప్రత్యేకంగా నగదు బదిలీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.62లక్షల మందికి లబ్ది కలగనుంది.
AP Welfare Schemes: రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందించాలనే లక్ష్యంతో, అర్హత ఉన్నా ఏ కారణంతో అయమినా లబ్ది అందని వారికి నేడు సంక్షేమ పథకాలను విడుదల చేయనున్నారు. 2022 డిసెంబర్ నుండి 2023 జులై వరకు వివిధ సంక్షేమ పథకాలకు వివిధ కారణాలతో లబ్ధి అందుకోని 2,62,169 మంది అర్హులకు రూ. 216.34 కోట్లను గురువారం సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి విడుదల చేయనున్నారు.
అర్హతలు ఉన్నా సంక్షేమ పథకాల ద్వా లబ్ధి అందని వారికి ఏటా ప్రత్యేకంగా రెండు విడతల్లో ప్రభుత్వం అయా పథకాలను అందిస్తోంది. సంక్షేమ పథకాల లబ్ధి అందించిన నెలలోపు గ్రామ/వార్డు సచివాలయాల్లో అర్హులు దరఖాస్తు చేసుకోవాలి. వెరిఫికేషన్ అనంతరం ఆరు నెలలకోసారి.. ఆ ఆరు నెలల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలకు అర్హత ఉన్నా లబ్ధి అందని వారికి కూడా పథకాలను అందిస్తున్నారు.
సోషల్ ఆడిట్ కోసం గ్రామ/వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు ప్రదర్శిస్తున్నారు. పారదర్శకంగా లంచాలకు, కుల, మత, వర్గ, పార్టీల వివక్షకు తావు లేకుండా, అర్హులందరికీ నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో పథకాల లబ్ధి అందిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
2021 డిసెంబర్ నుంచి ఈ తరహా కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. గురువారం విడుదల చేస్తున్న లబ్ధితో కలిపి ఇప్పటి వరకూ 4 విడతల్లో రూ. 1,647 కోట్లు లబ్దిదారులకు ప్రత్యేకంగా అందించారు.
వివిధ పథకాల్లో సాయం అందుకునే లబ్దిదారులు….
జగనన్న చేదోడు పథకంలో సాయం అందుకునే లబ్దిదారుల సంఖ్య – 43,131 కాగా వారికి అందిస్తున్న నగదు రూ.43,13,10.000
వైఎస్సార్ ఈబీసీ నేస్తం – లబ్దిదారుల సంఖ్య – 8,753 – అందిస్తున్న నగదు లబ్ధి (రూ.లలో) 13,12,95.000
వైఎస్సార్ నేతన్న నేస్తం – లబ్దిదారుల సంఖ్య – 267 – అందిస్తున్న నగదు లబ్ధి (రూ.లలో) 64,08.000
వైఎస్సార్ మత్స్యకార భరోసా – లబ్దిదారుల సంఖ్య – 207 – అందిస్తున్న నగదు లబ్ధి (రూ.లలో) 20,70.000
జగనన్న అమ్మ ఒడి – లబ్దిదారుల సంఖ్య – 14,836 – అందిస్తున్న నగదు లబ్ధి (రూ.లలో) 22,25,40.000
జగనన్న విద్యా దీవెన – లబ్దిదారుల సంఖ్య – 32,770 – అందిస్తున్న నగదు లబ్ధి (రూ.లలో) 26,66,00.000
జగనన్న వసతి దీవెన – లబ్దిదారుల సంఖ్య – 36,898 – అందిస్తున్న నగదు లబ్ధి (రూ.లలో) 32,13,00.000
వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు మరియు ఇన్పుట్ సబ్సిడీ – లబ్దిదారుల సంఖ్య – 1,08,590 – అందిస్తున్న నగదు లబ్ధి (రూ.లలో) 42,16,94.000
వైఎస్సార్ ఆసరా – లబ్దిదారుల సంఖ్య – 16,717 – అందిస్తున్న నగదు లబ్ధి (రూ.లలో) 36,01,56.051
మొత్తం లబ్ధిదారుల సంఖ్య 2,62,169 కాగా వారికి అందిస్తున్న నగదు లబ్ధి రూ. 216,33,73,051అని ప్రకటించారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిని జల్లెడపట్టి అవసరమైన వారికి 94,62,184 సర్టిఫికెట్ల జారీతో పాటు కొత్తగా మరో 12,405 మంది లబ్ధిదారులను గుర్తించి వారికి కూడా నేడు లబ్ధి చేకూరుస్తున్నారు.
జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను పరిశీలించి కొత్తగా అర్హులైన 1,630 మందికి కూడా వివిధ పథకాల ద్వారా నేడు లబ్ధి అందిస్తున్నారు.
వీటితో పాటు డిసెంబర్ 2022 - జూలై 2023 వరకు అర్హులైన మరో 1,49,875 మందికి పెన్షన్లు, 4,327 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 2,312 మందికి రేషన్ కార్డులు, 12,069 మందికి ఇళ్ల పట్టాలను కూడా జారీ చేయనున్నారు.
ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన 50 నెలల్లోనే వివిధ సంక్షేమ పథకాల ద్వారా లంచాలకు, వివక్షకు తావు లేకుండా లబ్ధిదారులకు నేరుగా రూ.2.33 లక్షల కోట్లను పంపిణీ చేశారు.