తెలుగు న్యూస్  /  Telangana  /  Trs Leader Distributes Liquor And Chicken To Celebrate Kcr's Bid To Go National

Rajanala Srihari : కేసీఆర్ పీఎం.. కేటీఆర్ సీఎం అవ్వాలంతే.. కోళ్లు, మందు పంపిణీ

HT Telugu Desk HT Telugu

04 October 2022, 18:01 IST

    • TRS Party Leader : కొంతమంది నేతలు పార్టీ అధిష్టానం దగ్గర మంచి మార్కులు కొట్టేసేందుకు నానాతిప్పలు పడుతుంటారు. కొన్నిసార్లు మంచి రిజల్ట్స్ వస్తాయి. మరికొన్ని సార్లేమో ప్లాన్ బెడిసికొడుతుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడమంటే వరంగల్ లో ఓ టీఆర్ఎస్ నేత కోళ్లు, మందు పంపిణీ చేశారు.
కోడి, మద్యం బాటిల్ పంపిణీ చేస్తున్న టీఆర్ఎస్ నేత
కోడి, మద్యం బాటిల్ పంపిణీ చేస్తున్న టీఆర్ఎస్ నేత

కోడి, మద్యం బాటిల్ పంపిణీ చేస్తున్న టీఆర్ఎస్ నేత

అధినేత దృష్టిలో పడేందుకు కొంతమంది లీడర్లు చేసే పనులు ఒక్కోసారి వింతగా ఉంటాయి. ఎలాగైనా అధిష్ఠానం కళ్లల్లో పడాలి.. తర్వాత సంగతి తర్వాత చూద్దాం అనుకుంటారు. కానీ కొన్నిసార్లు తర్వాత పరిస్థితులు ఏమవుతాయోనని ఆలోచించరు. తాజాగా వరంగల్ కు చెందిన టీఆర్ఎస్ లీడర్ రాజనాల శ్రీహారి.. కోళ్లు, మందు పంపిణీ చేస్తూ.. దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమం వెనకాల కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు పెట్టుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Light Beers : తెలంగాణలో లైట్ బీర్లు దొరకడంలేదు, ఎక్సైజ్ అధికారులకు యువకుడు ఫిర్యాదు

CM Revanth Reddy On Notices : బీజేపీని ప్రశ్నిస్తే నోటీసులే, దిల్లీ పోలీసుల సమన్లపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్

TS 10th Results 2024 : రేపే తెలంగాణ పదో తరగతి ఫలితాలు, హెచ్.టి.తెలుగులో వేగంగా రిజల్ట్స్!

TS EAPCET Hall Tickets : టీఎస్ ఈఏపీసెట్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ జాతీయ పార్టీగా మార్చాలని చూస్తున్న ఒకరోజు ముందు.. ఈ కార్యక్రమం జరిగింది. వరంగల్ చౌరస్తాలో హమాలీలకు ఒక కోడి, ఒక క్వార్టర్ మద్యం బాటిల్ ను రాజనాల శ్రీహారి అనే నేత పంపిణీ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి బుధవారం 'విజయదశమి' సందర్భంగా జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించాలని యోచిస్తున్నారు.

ఇదే సమయంలో టీఆర్‌ఎస్ నాయకుడు రాజనాల శ్రీహరి స్థానికులకు మద్యం బాటిళ్లు, కోళ్లు అందజేస్తూ కనిపించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ కటౌట్‌లు ముందుకు ఈ పంపిణీ వేడుక చేశారు. కేసీఆర్ జాతీయ పార్టీకి చీఫ్ అయి పీఎం కావాలని, రాష్ట్రంలో పార్టీకి కేటీఆర్ అధ్యక్షుడు అయి సీఎం కావాలని శ్రీహరి ఆకాంక్షించారు. అంతకుముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు.