TS 10th Results 2024 : రేపే తెలంగాణ పదో తరగతి ఫలితాలు, హెచ్.టి.తెలుగులో వేగంగా రిజల్ట్స్!
30 April 2024, 11:46 IST
- TS 10th Results 2024 : తెలంగాణ పదో తరగతి ఫలితాలు రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. విద్యార్థులు హెచ్.టి.తెలుగులో టెన్త్ రిజల్ట్స్ వేగంగా తెలుసుకోవచ్చు.
తెలంగాణ పదో తరగతి ఫలితాలు
TS 10th Results 2024 : తెలంగాణ పదో తరగతి ఫలితాలు(TS 10th Results 2024) వచ్చేస్తున్నాయ్. రేపు(ఏప్రిల్ 30) ఉదయం 11 గంటలకు పదోతరగతి ఫలితాలు(TS SSC Results) విడుదల చేయనున్నారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం రేపు హైదరాబాద్ లో టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్నారు. పదో తరగతి ఫలితాలు విడుదల కాగానే క్షణాల వ్యవధిలో HT తెలుగు వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
హెచ్.టి.తెలుగులో పదో తరగతి ఫలితాలు(TS 10th Results in HT Telugu)
పదో తరగతి విద్యార్థులు హెచ్.టి.తెలుగు వెబ్ సైట్ లో సింగిల్ క్లిక్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఈ దిగువన ఉన్న లింక్ లో మీ రోల్ నెంబర్ యాడ్ చేసి సబ్మిట్ కొట్టగానే ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. విద్యార్థులు మార్కుల తనిఖీ చేసుకోవచ్చు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు(TS 10th Exams) మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించారు. ఈ ఏడాదికి 5 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరంతా టెన్త్ ఫలితాల విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 13 నాటికి ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 కేంద్రాలలో స్పాట్ వాల్యూయేషన్ నిర్వహించారు.
తెలంగాణ పదో తరగతి ఫలితాలను అధికారిక వెబ్ సైట్ https://bse.telangana.gov.in/ , https://results.bsetelanganagov.in/ తనిఖీ చేసుకోవచ్చు.
పది మెమోలపై పెన్ నెంబర్
తెలంగాణ పదో తరగతి ఫలితాలను(TS SSC Results 2024 date) ఈ నెల 30న విడుదల చేస్తామని విద్యాశాఖ తెలిపింది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించారు. ఈ ఏడాది 5,08,385 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాశారు. పదో తరగతి ఫలితాల విడుదల అనంతరం https://telugu.hindustantimes.com/telangana-board-result లింక్ పై క్లిక్ చేసి విద్యార్థులు మార్కులు తెలుసుకోవచ్చు. మరోవైపు తొలిసారిగా తెలంగాణలో పదో తరగతి మెమోలపై పెన్(Permanent Education Number) నెంబర్ ను ముద్రించే దిశగా విద్యాశాఖ అడుగులు వేస్తోంది. ఓటీఆర్ తరహాలో టెన్త్ విద్యార్థులకు పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (PEN)ను అమలు చేయనుంది. ఈ ఏడాది నుంచే ఈ విధానాన్ని అమలు చేయనుంది. ఫలితంగా పదో తరగతి మెమోలపై 11 అంకెలతో కూడిన ‘పెన్’ నంబర్‌ను ముద్రించనుంది. పెన్ నెంబర్(Permanent Education Number) సెక్యూరిటీ ఫీచర్లతో కూడినదిగా ఉంటుంది. విద్యార్థికి సంబంధించిన సమాచారంతో పాటు పదో తరగతి ఉత్తీర్ణత వివరాలు ఉంటాయి. ఫలితంగా నకిలీ సర్టిఫికెట్లకు చెక్ పడనుంది. పెన్(Permanent Education Number) నెంబర్ ఆధారంగా… ఒరిజినల్ సర్టిఫికెట్లనుగా సింపుల్ గా గుర్తించే అవకాశం ఉంటుంది.