TS SSC Results Update: ఏప్రిల్ 30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్న సెకండరీ బోర్డు
TS SSC Results Update: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 30న విడుదల చేయనున్నారు. పాఠశాల విద్యాశాఖ ఆద్వర్యంలో పదో తరగతి ఫలితాలను వెల్లడించనున్నారు.
TS SSC Results Update: తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు ఏప్రిల్ 30న విడుదల కానున్నాయి. 30వ తేదీ ఉదయం 11గంటలకు తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నట్టు సెకండరీ బోర్డు ప్రకటించింది. విద్యా శాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం పదో తరగతి ఫలితాలను విడుదల చేయ నున్నారు. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగాయి.
ఈ ఏడాది జరిగిన తెలంగాణ పదో తరగతి పరీక్ష(TS SSC Exams) కోసం 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్ష ఫీజులను చెల్లించారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. పదో తరగత పరీక్షల కోసం మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం (TS SSC Spot Valuation 2024) ఇప్పటికే పూర్తైంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభించారు. ఏప్రిల్ 13తో టెన్త్ స్పాట్ ప్రక్రియ పూర్తైంది. స్పాట్ వాల్యూయేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 కేంద్రాలలో నిర్వహించారు.
2023లో తెలంగాణ పదో తరగతి ఫలితాలు…. మే 10వ తేదీన వెల్లడించారు. గత ఏడాది ఏప్రిల్ 13వ తేదీతో పరీక్షలు ముగిశాయి. ఈ ఏడాది పరీక్షలు ముందుగా ప్రారంభం అయ్యాయి. మార్చి 18వ తేదీతో మొదలై ఏప్రిల్ 2వ తేదీ నాటికి పూర్తి అయ్యాయి. ఆ వెంటనే స్పాట్ మొదలైంది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కావడంతో ఫలితాలను వెల్లడించేందుకు బోర్డు సిద్ధం అవుతోంది. ఏప్రిల్ 30వ తేదీన తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలను వెల్లడించనున్నారు. ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అమోద ముద్ర వేయడంతో ఇంటర్ ఫలితాలు వెలువడిన వారం రోజుల వ్యవధిలో పదో తరగతి ఫలితాలను ప్రకటించనున్నారు.
తెలంగాణ పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలను ఇలా తెలుసుకోవచ్చు. https://telugu.hindustantimes.com/telangana-board-result లింక్ పై క్లిక్ చేయాలి.
హోంపేజీలో కనిపించే
క్లిక్ చేయాలి.
మీ రూల్ నెంబర్ ను ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే మార్కుల మెమో డిస్ ప్లే అవుతుంది. ప్రింట్ ఆప్షన్ పై నొక్కి మీ మార్కుల వివరాల కాపీని పొందవచ్చు.
తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలను ఈ లింకు ద్వారా నేరుగా తెలుసుకోవచ్చు. https://telugu.hindustantimes.com/telangana-board-10th-result-2024
తెలంగాణ పదో తరగతి పరీక్షల బోర్డు అధికారిక వెబ్ సైట్ https://results.cgg.gov.in లో కూడా ఫలితాలను చూసుకోవచ్చు. హోం పేజీలో కనిపించే TS SSC Results 2024 లింక్ పై క్లిక్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. మీ పరీక్షా ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. ప్రింట్ ఆప్షన్ పై నొక్కి మార్కుల మెమోను పొందవచ్చు.
ఇంటర్ ఫలితాలు...
తెలంగాణ ఇంటర్ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. 24వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలతో పాటు ఒకేషనల్ ఫలితాలను కూడా ఒకేసారి విడుదల చేస్తారు.
టీఎస్ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల లింక్ : https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-result-2024
తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలను ఇలా చూసుకోండి…