Bhagwant Mann Frankfurt : భగవంత్ మాన్.. నిజంగానే మద్యం సేవించి విమానం ఎక్కారా?
Bhagwant Mann Frankfurt : మద్యం మత్తులో ఉన్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను జర్మనీ విమానంలో నుంచి దింపేశారన్న వార్తలు కలకలం సృష్టించాయి. ఇప్పుడు ఈ విషయంపై విమానయానశాఖ దర్యాప్తు చేపట్టనుంది.
Bhagwant Mann Germany : పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. నిజంగానే మద్యం సేవించి జర్మనీలో విమానం ఎక్కారా? ఆమ్ ఆద్మీ పార్టీని కుదిపేస్తున్న ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టేందుకు భారత విమానయాన శాఖ సిద్ధపడింది.
భగవంత్ మాన్ జర్మనీ పర్యటన..
పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. 8 రోజుల పర్యటన కోసం జర్మనీ వెళ్లారు. అది ముగించుకుని ఆదివారమే ఇండియాకి తిరిగొచ్చారు. అయితే.. ఆయన జర్నీ చేసిన లుప్థాన్స విమానం ఆలస్యంగా ఇండియాకి వచ్చింది.
Bhagwant Mann Lufthansa : ఈ నేపథ్యంలో విపక్ష శిరోమణి అకాలీదళ్.. భగవంత్ మాన్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. 'మద్యం మత్తులో.. కనీసం నడవలేని స్థితిలో ఉన్న పంజాబ్ సీఎంను ఫ్రాంక్‌ఫర్ట్‌లో విమానం నుంచి దింపేశారు. ఇది పంజాబ్ ప్రజలకు సిగ్గు చేటు,' అంటూ ఆరోపించింది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న కొందరు.. తమకు ఈ విషయాన్ని చెప్పినట్టు వివరించింది.
విపక్షాల ఆరోపణలను ఆప్ తిప్పికొట్టింది. రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి భగవంత మాన్ విదేశాలకు వెళితే.. విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడింది. కాగా.. ఈ వ్యవహారంపై భగవంత మాన్, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌లు ఇంకా స్పందించలేదు.
Bhagwant Mann news : మరోవైపు ఈ వ్యవహారంపై సంబంధిత విమానయాన సంస్థ స్పందించింది. విమానాల మార్పు కారణంగానే ఆలస్యమైందని వివరణ ఇచ్చింది.
ఇక ఈ విషయంపై విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్పందించారు.
"ఇది విదేశాల్లో జరిగింది. అందువల్ల ఇది నిజమో కాదో తెలుసుకుంటాము. డేటా మాత్రం లుఫ్థాన్స ఇవ్వాలి. నాకు అందిన ఫిర్యాదుల మేరకు నేను విచారణ జరుపుతాను," అని జ్యోతిరాదిత్య సింథియా స్పష్టం చేశారు.
సంబంధిత కథనం