LIVE UPDATES
Mission Parivartan : గంజాయి మత్తు వదిలిస్తున్నారు..! నల్గొండ జిల్లాలో జోరుగా సాగుతున్న 'మిషన్ పరివర్తన్ '
Telangana News Live September 5, 2024: Mission Parivartan : గంజాయి మత్తు వదిలిస్తున్నారు..! నల్గొండ జిల్లాలో జోరుగా సాగుతున్న 'మిషన్ పరివర్తన్ '
05 September 2024, 22:39 IST
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Telangana News Live: Mission Parivartan : గంజాయి మత్తు వదిలిస్తున్నారు..! నల్గొండ జిల్లాలో జోరుగా సాగుతున్న 'మిషన్ పరివర్తన్ '
- మాదక ద్రవ్యాలపై నల్గొండ జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ టెస్టింగ్ కిట్స్ అందుబాటులోకి రావటంతో… దూకుడుగా ముందుకెళ్తున్నారు. జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చటమే లక్ష్యంగా “మిషన్ పరివర్తన్” కార్యక్రమాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు.
Telangana News Live: Hyderabad Rains : బీ అలర్ట్...! హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం
- Heavy Rains in Hyderabad : హైదరాబాద్ లో మళ్లీ వర్షం షురూ అయింది. గురువారం సాయంత్రం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.
Telangana News Live: Free Electricity : విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ - తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
- రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌ని సరఫరా చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులను జారీ చేసింది.
Telangana News Live: Breast Cancer : బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ - సెప్టెంబర్ 29న 'పింక్ ఫర్ రన్', వరల్డ్ రికార్డుపై గురి..!
- బ్రేస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా పింక్ ఫర్ రన్ - 2024ను తలపెట్టారు. MEIL మరియు సుధారెడ్డి ఫౌండేషన్ల ఆధ్వర్యంలో ఈ ర్యాలీని చేపట్టనున్నారు. హైదరాబాద్ లో సెప్టెంబర్ 29వ తేదీన జరిగే ఈ భారీ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
Telangana News Live: Telangana High Court : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో స్థానికత.. తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
- Telangana High Court : తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో స్థానికత అంశంపై.. హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. స్థానిక కోటా కింద స్థానికులంతా అర్హులేనని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. సరైన మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది.
Telangana News Live: TGPSC Group 3 Updates : గ్రూప్ 3కి దరఖాస్తు చేశారా..! 'ఎడిట్ ఆప్షన్' వచ్చేసింది, ఇలా చేసుకోండి
- TGPSC Group 3 Updates : గ్రూప్ 3 అభ్యర్థులకు TGPSC కీలక అప్డేట్ ఇచ్చింది. దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి సవరణ చేసుకోవచ్చని పేర్కొంది.
Telangana News Live: TG CPGET 2024 Updates : 'సీపీగెట్' కౌన్సెలింగ్ షెడ్యూల్ లో మార్పులు - 8న ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు, కొత్త తేదీలివే
- TG CPGET 2024 Counselling : టీజీ సీపీగెట్ -2024 ప్రవేశాలకు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఈనెల 8వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ఉంటుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Telangana News Live: Siricilla Powerlooms: సిరిసిల్ల కు పవర్ లూం క్లస్టర్ ను మంజూరు చేసి, యార్న్ డిపోను ఏర్పాటు చేయాలని బండి విజ్ఞప్తి
- Siricilla Powerlooms: సిరిసిల్లకు పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు మంజూరు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను కోరారు. నేషనల్ హ్యాండ్లూం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ముడిసరుకు యార్న్ డిపోను ఏర్పాటు చేయాలని విజ్ఝప్తి చేస్తూ లేఖను అందజేశారు.
Telangana News Live: Telangana Tourism : ఈ పర్యాటక ప్రదేశాలకు ఇప్పట్లో వెళ్లొద్దు.. టూరిస్టులకు అధికారుల సూచన!
- Telangana Tourism : తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. ఇంకా అనేక ప్రాంతాల్లో కురుస్తున్నాయి. భారీ వర్షాల ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో అధికారులు ఆంక్షలు విధించారు. కొన్ని రోజుల పాటు ఆంక్షలు ఉంటాయని చెబుతున్నారు.
Telangana News Live: Maoist Encounter : భద్రాద్రి.. ములుగు జిల్లాల సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
- Maoist Encounter : మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భద్రాద్రి జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు సమాచారం.
Telangana News Live: Manjeera River: ఉప్పొంగుతున్న మంజీరా, నిండుకుండలా సింగూరు, నిజాం సాగర్..
- Manjeera River: మంజీరా నది పరవళ్లు తొక్కుతున్నది. రాష్టంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అన్ని ప్రాజెక్టులు నిండి పొంగి పొర్లుతున్నా, మంజీరా నది పైన ఉన్నసింగూరు, నిజాం సాగర్ ప్రాజెక్టులు ఇంతవరకు నిండ లేదు. పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో జలాశయాలు చేరుకున్నాయి.
Telangana News Live: Telangana Rains : రెండు హెలికాప్టర్లను పంపిస్తే ఏం చేస్తున్నారు.. రేవంత్ సర్కారుపై కేంద్రం సీరియస్!
- Telangana Rains : తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. తెలంగాణలో వర్షాలు, వరదలకు సంబంధించి ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేసింది. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను పంపిస్తే.. ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.
Telangana News Live: Chhattisgarh Encounter: నేలకొరిగిన ఉద్యమ శిఖరం, ఛత్తీస్‌గడ్ ఎన్‌కౌంటర్‌లో మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ మృతి
- Chhattisgarh Encounter: మావోయిస్టు పార్టీ తొలి తరం నేత.. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా వివిధ హోదాల్లో పని చేసిన ఓరుగల్లు విప్లవ వీరుడు మాచర్ల ఏసోబు(70) హతమయ్యారు. చత్తీస్ గడ్ ప్రజలకు జగన్‌గా,రణదేవ్ దాదాగా సుపరిచితుడైన దాదా దంతెవాడ,బీజాపూర్ అటవీప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.