TGPSC Group 3 Updates : గ్రూప్ 3కి దరఖాస్తు చేశారా..! 'ఎడిట్ ఆప్షన్' వచ్చేసింది, ఇలా పూర్తి చేయండి-tgpsc group 3 services recruitment 2024 correction window opens direct link here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgpsc Group 3 Updates : గ్రూప్ 3కి దరఖాస్తు చేశారా..! 'ఎడిట్ ఆప్షన్' వచ్చేసింది, ఇలా పూర్తి చేయండి

TGPSC Group 3 Updates : గ్రూప్ 3కి దరఖాస్తు చేశారా..! 'ఎడిట్ ఆప్షన్' వచ్చేసింది, ఇలా పూర్తి చేయండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 05, 2024 02:54 PM IST

TGPSC Group 3 Updates : గ్రూప్ 3 అభ్యర్థులకు TGPSC కీలక అప్డేట్ ఇచ్చింది. దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి సవరణ చేసుకోవచ్చని పేర్కొంది.

తెలంగాణ గ్రూప్ 3 ఉద్యోగాలు - 2024
తెలంగాణ గ్రూప్ 3 ఉద్యోగాలు - 2024

గ్రూప్ 3 దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చేసింది.  ఈ అవకాశం సెప్టెంబర్ 6వ తేదీతో ముగియనుంది. దరఖాస్తుల్లో తప్పులుంటే అభ్యర్థులు వెంటనే సరిచేసుకోవాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచించింది. ఆలస్యం చేయకుండా అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపింది.

కమిషన్ అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/  లోకి వెళ్లి సవరణ చేసుకోవచ్చని TGPSC పేర్కొంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం కొలువుల సంఖ్య 1,388 భర్తీ చేయనున్నారు. ఈ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ - 3 పరీక్షలను నవంబరు 17, 18 తేదీల్లో నిర్వహించనున్నారు.

ఇలా ఎడిట్ చేసుకోండి:

  • గ్రూప్ 3 కి అప్లయ్ చేసుకున్న అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే Edit Application For Group 3 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ అభ్యర్థి TGPSC ID, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి.
  • మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఏమైనా తప్పులు ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు.
  • ఫైనల్ గా మళ్లీ సబ్మిట్ బటన్ పై నొక్కితే ఈ ప్రాసెస్ పూర్తి అవుతుంది.

మొత్తం 3 పేపర్లు - పరీక్షా విధానం ఇలా:

  • గ్రూప్ 3 పరీక్షలో మొత్తంగా 3 పేపర్లు ఉంటాయి. 
  • ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. 
  • ఒక్కో పేపరు రాసేందుకు రెండున్నర గంటల సమయం ఉంటుంది. ఈ సిలబస్ TGPSC వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
  • గ్రూప్‌-3 పోస్టులకు పోటీపడే అభ్యర్థులు మూడు పేపర్లు రాయాల్సి ఉంటుంది. 
  • ప్రతి పేపర్‌లోనూ 150 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఈ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేయనున్నారు. 
  • ఇంటర్వ్యూ ఉండదు. రాత పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు.

గ్రూప్ 3లోని మొదటి పేపర్ లో జనరల్ నాల్జెడ్ కి సంబంధించి ఉంటుంది. ఇక పేపర్‌-2లో మొత్తం 3 అంశాలు ఉండగా.. ప్రతి అంశంపై 50 ప్రశ్నలు.. 50 మార్కులు ఉంటాయి. ఇదే పేపర్‌లో భారత రాజ్యాంగం అంశానికి 50 మార్కులు, భారత చరిత్రకు మరో 50 మార్కులు ఇచ్చారు.

తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశానికి 50 మార్కులు ఉంటాయి. పేపర్‌-3లో మూడు అంశాలుండగా.. ఒక్కో అంశానికి 50 మార్కులున్నాయి. వీటిలో భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిలో మార్పులు వంటి అంశాలున్నాయి. గ్రూప్ 3 పోస్టులకు ఎలాంటి ఇంటర్వూ ఉండదు.

గ్రూప్ 2 పరీక్ష తేదీలు ఖరారు:

మరోవైపు ఇటీవలే గ్రూప్‌-2 పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. డిసెంబర్‌ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.

  • డిసెంబర్‌ 15న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1
  • డిసెంబర్‌ 15న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్‌-2
  • డిసెంబర్‌ 16న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-3
  • డిసెంబర్‌ 16న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్‌-4