తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Hyd Agra Tour: మంచు కురిసే వేళలో 'తాజ్' అందాలు.. బడ్జెట్ ధరలోనే ట్రిప్…

IRCTC Hyd Agra Tour: మంచు కురిసే వేళలో 'తాజ్' అందాలు.. బడ్జెట్ ధరలోనే ట్రిప్…

HT Telugu Desk HT Telugu

27 November 2022, 13:17 IST

    • IRCTC Tour Packages From Hyderabad: హైదరాబాద్ నుంచి తాజ్‌మహల్ టూర్ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను పేర్కొంది.
హైదరాబాద్ - ఆగ్రా టూర్
హైదరాబాద్ - ఆగ్రా టూర్ (twitter)

హైదరాబాద్ - ఆగ్రా టూర్

IRCTC Hyderabad to Tajmahal Tour: వేర్వురు ప్రదేశాలను చూసేందుకు సరికొత్త ఆఫర్లతో కూడా ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా ఆగ్రా, ఢిల్లీ, జైపూర్ వెళ్లే వారికోసం ప్యాకేజీని తీసుకువచ్చింది. 'GOLDEN TRIANGLE' పేరుతో టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా అత్యంత అందమైన తాజ్ మహల్ తో పాటు పలు ప్రాంతాలను సందర్శించవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Karimnagar News : రైతులకు నష్టం జరగనివ్వం, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం- పౌరసరఫరాల శాఖ కమిషనర్

Wines Shops Close : మందుబాబులకు బ్యాడ్ న్యూస్, మూడ్రోజుల పాటు వైన్ షాపులు బంద్

TS Inter Admissions 2024-25 :తెలంగాణ ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల, రేపట్నుంచి అప్లికేషన్లు జారీ

Tirumala Tour : ఒకే ఒక్క రోజులో తిరుమల ట్రిప్, ఫ్రీగా శ్రీవారి శీఘ్రదర్శనం - తెలంగాణ టూరిజం నుంచి అదిరిపోయే ప్యాకేజీ

టూర్ ప్లాన్....

7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రతీ గురువారం ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ డిసెంబర్ 6వ తేదీన అందుబాటులో ఉంది. ట్రైన్ జర్నీ ద్వారా ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే...

Day 01 - ఉదయం 6 గంటలకు హైదరాబాద్ స్టేషన్ నుంచి (Train No. 12723) రైలు బయల్దేరుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.

Day 02 - ఉదయం 07.40 నిమిషాలకు ఢిల్లీకి చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... కుతుబ్ మినార్ కు వెళ్తారు. లోటస్ టెంపుల్, అక్షరదామం సందర్శిస్తారు. రాత్రి ఢిల్లీలోనే బస చేస్తారు.

Day 03 - మూడో రోజు రెడ్ ఫోర్ట్, రాజ్ ఘాట్, తీన్ మార్తీభవన్, ఇండియా గేట్ చూస్తారు. రాత్రి ఢిల్లీలోనే బస చేస్తారు.

Day 04 - జైపూర్ కు వెళ్తారు. హోటల్ కి వెళ్లిన తర్వాత హవా మహాల్ సందర్శిస్తారు. రాత్రి జైపూర్ లోనే బస చేస్తారు.

Day 05 - అమీర్ ఫోర్ట్, సిటీ ప్యాలెస్, జంతర్ మంతర్ కు వెళ్తారు.

Day 06 - హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత అగ్రాకు వెళ్తారు. మార్గమధ్యలో ఫతేపుర్ సిక్రీకి వెళ్తారు. రాత్రి ఆగ్రాలోనే బస చేస్తారు.

Day 07 - ఉదయం తాజ్ మహాల్ ను సందర్శిస్తారు. అగ్రా ఫోర్ట్ కు వెళ్తారు. సాయంత్రం 5 గంటలకు అగ్రా రైల్వేస్టేషన్ కు చేరుకుంటారు. రాత్రంతా జర్నీలో ఉంటారు.

Day 08 - సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు.

ధరలు ఎంతంటే....

కంఫర్ట్ క్లాస్ (3ఏసీ)లో సింగిల్ షేరింగ్ కు రూ. 45, 870 ధర ఉండగా... డబుల్ షేరింగ్ కు రూ.27,490, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 21,980 గా ఉండాలి. ఐదు నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. ఇక స్టాండర్డ్ క్లాస్ లో సింగిల్ షేర్ కు రూ. 42, 680గా ఉండగా... డబుల్ షేరింగ్ కు రూ. 24,300గా ఉంది. కింది జాబితాలో మరిన్ని వివరాలను చెక్ చేసుకోవచ్చు.

ధరల వివరాలు

NOTE:

ఈ టూర్ ను బుకింగ్ చేసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేసి వివరాలను నమోదు చేసుకోవచ్చు.