తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Inter Admissions 2024-25 :తెలంగాణ ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల, రేపట్నుంచి అప్లికేషన్లు జారీ

TS Inter Admissions 2024-25 :తెలంగాణ ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల, రేపట్నుంచి అప్లికేషన్లు జారీ

08 May 2024, 19:21 IST

    • TS Inter Admissions 2024-25 : తెలంగాణలోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియ రేపట్నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులు జూనియర్ కాలేజీల్లో అప్లికేషన్లు పొందవచ్చు.
తెలంగాణ ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల

TS Inter Admissions 2024-25 : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు రెండేళ్ల ఇంటర్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభించింది. రేపట్నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో అప్లికేషన్లు జారీ చేయనున్నారు. ఈ నెల 31 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రైవేట్, ఎయిడెట్, అన్ ఎయిడెట్, కో-ఆపరేటివ్, టీఎస్ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ, కేజీబీవీ, టీఎమ్ఆర్జేసీ, టీఎస్ మోడల్ జూనియర్ కాలేజీలు, కాంపోజిట్ డిగ్రీ కాలేజీల్లో రెండేళ్ల ఇంటర్ కోర్సులు అందిస్తున్నారు. వీటిల్లో అడ్మిషన్లు పొందేందుకు 2024-25 విద్యాసంవత్సరానికి విద్యార్థుల నుంచి అప్లికేషన్లు ఆహ్వానించింది.

ట్రెండింగ్ వార్తలు

BC RJC CET Results 2024 : టీఎస్ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, రేపట్నుంచి కాలేజీల్లో రిపోర్ట్!

Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్

  • తొలి విడత అప్లికేషన్లు జారీ : 09-05-2024
  • కళాశాలలో దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 31-05-2024
  • తరగతుల ప్రారంభ తేదీ : 01-06-2024
  • తొలి విడతలో అడ్మిషన్లు పూర్తయ్యే తేదీ : 30-06-2024

సెకండ్ ఫేజ్ అడ్మిషన్ల షెడ్యూల త్వరలో విడుదల

సెకండ్ ఫేజ్ అడ్మిషన్ల షెడ్యూల్ త్వరలో విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫస్టియర్ తరగతులు జూన్ 01, నుంచి ప్రారంభం కానున్నాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. పాఠశాల అధికారులు జారీ చేసిన పాస్ సర్టిఫికేట్, ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, తాత్కాలిక టెన్త్ మార్కుల మెమో ఆధారంగా ప్రిన్సిపాల్స్ ఇంటర్ ప్రవేశాలు కల్పించవచ్చని తెలిపింది. ఒరిజినల్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత అడ్మిషన్లు నిర్థారిస్తారని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్థారించిన రిజర్వేషన్ల ప్రకారం విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించాలని ఇంటర్ బోర్డు కాలేజీ ప్రిన్సిపాల్స్ ను ఆదేశించింది. ఎస్సీలకు - 15 శాతం, ఎస్టీ- 10 శాతం, బీసీలకు-29 శాతం, పీహెచ్ -5 శాతం, ఎన్సీసీ, స్పోర్ట్ కోటా - 5 శాతం, ఎక్స్-సర్వీస్ మెన్ - 3 శాతం, ఈడబ్ల్యూఎస్- 10 శాతం సీట్లు కేటాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే 33.3 శాతం అంటే 1/3 వంతు సీట్లు బాలికలకు కేటాయించాలని తెలిపింది.

గరిష్టంగా 88 మందికే అడ్మిషన్లు

ఎస్‌ఎస్‌సీలో గ్రేడింగ్ విధానం GPA (గ్రేడ్ పాయింట్ యావరేజ్), అర్హత పరీక్షలో సబ్జెక్ట్ వారీగా పొందిన గ్రేడ్ పాయింట్ (GP) ప్రకారం అడ్మిషన్లు చేపట్టాలని ఇంటర్ బోర్టు ఆదేశించింది. అడ్మిషన్ల కోసం ఎలాంటి ప్రవేశ పరీక్ష నిర్వహించకూడదని తెలిపింది. అలా నిర్వహిస్తే ఆ కాలేజీలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇంటర్ అడ్మిషన్లు పొందే విద్యార్థులు ఆధార్ నంబర్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్ బోర్డు మంజూరు చేసిన సెక్షన్లు, ప్రతి విభాగంలో గరిష్టంగా 88 మంది వరకే అడ్మిషన్లు కల్పించాలి. ఆపై ప్రవేశాలకు ఇంటర్ బోర్డు అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. బోర్డు మంజూరు చేసిన సెక్షన్లు, సీట్లు సంఖ్య, ఇప్పటి వరకూ ఎన్ని సీట్లు భర్తీ అయ్యాయి, ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలు కాలేజీలు నోటీసు బోర్డులో క్రమం తప్పకుండా పెట్టాలని ఇంటర్ బోర్డు సూచించింది.

గ్యాప్ సర్టిఫికెట్ తప్పనిసరి

గ్యాప్‌ను వచ్చిన విద్యార్థులు అడ్మిషన్లు పొందాలనుకుంటే... ఆ గ్యాప్ పీరియడ్ సర్టిఫికేట్, స్థానిక లేదా నివాస ధ్రువీకరణ పత్రాన్ని తహశీల్దార్ నుంచి తీసుకుని కాలేజీలో సబ్మిట్ చేయాలని బోర్డు తెలిపింది. అలాగే పిల్లల అడ్మిషన్ల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించింది. తెలంగాణ ఇంటర్ బోర్డు అనుబంధ కళాశాలల్లో మాత్రమే ప్రవేశాలు పొందాలని తెలిపింది. కాలేజీ జాబితాను TSBIE అధికారిక వెబ్‌సైట్‌లు acadtsbie.cgg.gov.in, tsbie.cgg.gov.in ఉంచామని పేర్కొంది.

తదుపరి వ్యాసం