TS inter results 2024 date: తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ డేట్‌పై అప్‌డేట్స్-ts inter results 2024 date live updates ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Inter Results 2024 Date: తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ డేట్‌పై అప్‌డేట్స్

తెలంగాణ ఇంటర్ బోర్డ్ రిజల్ట్స్ తేదీపై విద్యార్థుల్లో ఉత్కంట (ఫైల్)(HT PHOTO)

TS inter results 2024 date: తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ డేట్‌పై అప్‌డేట్స్

12:51 PM ISTApr 18, 2024 06:21 PM HT Telugu Desk
  • Share on Facebook
12:51 PM IST

  • TS inter results 2024 date: తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ డేట్‌పై తాజా అప్‌డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.

Thu, 18 Apr 202412:51 PM IST

సింపుల్ గా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు…

హెచ్ టీ తెలుగులో ఈసారి కూడా తెలంగాణ ఇంటర్ ఫలితాలు అందుబాటులో ఉంటాయి. మీ రూల్ నెంబర్ ను ఎంట్రీ చేసి సింపుల్ గా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

Thu, 18 Apr 202412:06 PM IST

పరిశీలనలో ఆ రెండు తేదీలు..!

తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చే వారంలో ప్రకటించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని ప్రక్రియలు దాదాపు పూర్తి కావటంతో ఈసీ అనుమతితో ఫలితాలను ప్రకటించనున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రభుత్వ అనుమతి లేకుండానే… కేవలం ఈసీ అనుమతితో అధికారులే విడుదల చేస్తారు. అయితే ఈ ఫలితాలను ఏప్రిల్ 23వ తేదీన ప్రకటించేందుకు ప్రాథమికంగా ఓ తేదీని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ తేదీ కుదరకపోతే… ఏప్రిల్ 25లోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది.

Thu, 18 Apr 202411:30 AM IST

తెలంగాణ ఇంటర్ ఫలితాల తేదీ..?

తెలంగాణ ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలు ఈ నెల 23 లేదా 24వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

Thu, 18 Apr 202410:16 AM IST

హెట్ టీ తెలుగులో ఫలితాలు…

తెలంగాణ ఇంటర్ ఫలితాలను హెచ్ టీ తెలుగులో సింగిల్ క్లిక్ తో సింపుల్ గా తెలుసుకోవచ్చు. 

Thu, 18 Apr 202408:41 AM IST

ఈసీ అనుమతి…!

ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈసారి ఫలితాల విడుదలకు ఈసీ అనుమతి కీలకంగా మారింది. ఇప్పటికే అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈసీ అనుమతి రాగానే… వెంటనే ఫలితాల తేదీను ప్రకటించనున్నారు.

Thu, 18 Apr 202408:40 AM IST

9 లక్షల మందికిపైగా విద్యార్థులు….

ఈ ఏడాది 9 లక్షల మందిపైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలు(TS Inter Exams) రాశారు. వీరంతా ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా..ఈసారి తొందరగానే తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నారు. 2023లో మే 9వ తేదీన ఇంటర్ ఫలితాలను(TS Inter Results) ప్రకటించారు. అయితే ఈసారి మాత్రం ఏప్రిల్ 22 -25 మధ్య ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈసీ అనుమతి రాగానే ఫలితాల ప్రకటన తేదీపై విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇవ్వనున్నారు. దాదాపు ఏప్రిల్ 25 లోపు ఫలితాలు ప్రకటించి అవకాశం ఉంది.

Thu, 18 Apr 202408:40 AM IST

ఫలితాలు ఎప్పుడంటే…

తెలంగాణ ఇంటర్ ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. టీఎస్ ఇంటర్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్‌ 20 నుంచి 25 మధ్యలో విడుదల చేస్తామని సమాచారం అందుతోంది. ఏప్రిల్ 10వ తేదీకి స్పాట్ వాల్యూయేషన్ పూర్తి కావడంతో... ఒకేసారి ఇంటర్‌ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Thu, 18 Apr 202406:35 AM IST

TS SSC Results 2024 Date: పదో తరగతి ఫలితాలు ఎలా చూడాలి?

ఎస్సెస్సీ బోర్డు రిజల్ట్స్ వెల్లడించిన వెంటనే తెలంగాణ పదో తరగతి విద్యార్థులు ఇక్కడ సూచించిన బాక్స్‌లో తమ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.

Thu, 18 Apr 202406:31 AM IST

TS SSC Results 2024 Date: పదో తరగతి ఫలితాలు ఎప్పుడు వెలువడుతాయి?

తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు ఇంటర్ ఫలితాల వెల్లడి అనంతరం రానున్నాయి.  మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు నిర్వహించారు. ఫలితాల వెల్లడిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడ లేదు. ఏప్రిల్ చివరి వారంలో పదో తరగతి ఫలితాలు వెల్లడవుతాయని అంచనా.

Thu, 18 Apr 202406:28 AM IST

TS Inter 2nd year General Results 2024: ఇంటర్ సెకండియర్ జనరల్ ఫలితాలు ఇక్కడ చూడొచ్చు.

ఇంటర్ ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థులు ఇక్కడ సూచించిన బాక్స్‌లో ఇంటర్ సెకండియర్ జనరల్ ఫలితాలు తెలుసుకోవచ్చు. మీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడం ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.

Thu, 18 Apr 202406:23 AM IST

TS Inter 1st year General Results 2024: ఫస్టియర్ ఇంటర్ జనరల్ ఫలితాలు ఇక్కడ చూడొచ్చు.

ఇంటర్ ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థులు ఇక్కడ సూచించిన బాక్స్‌లో ఇంటర్ సెకండియర్ జనరల్ ఫలితాలు తెలుసుకోవచ్చు. మీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడం ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.

Thu, 18 Apr 202406:16 AM IST

TS Inter 2nd year Vocational Results 2024: సెకండియర్ ఇంటర్ వొకేషనల్ ఫలితాలు ఇక్కడ చూడొచ్చు.

ఇంటర్ ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థులు ఇక్కడ సూచించిన బాక్స్‌లో ఇంటర్ సెకండియర్ వొకేషనల్ ఫలితాలు తెలుసుకోవచ్చు. మీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడం ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. 

 

Thu, 18 Apr 202406:15 AM IST

TS Inter 1st year Vocational Results 2024: ఫస్టియర్ ఇంటర్ వొకేషనల్ ఫలితాలు ఇక్కడ చూడొచ్చు.

ఇంటర్ ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థులు ఇక్కడ సూచించిన బాక్స్‌లో ఇంటర్ ఫస్టియర్ వొకేషనల్ ఫలితాలు తెలుసుకోవచ్చు. మీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడం ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.

Thu, 18 Apr 202406:12 AM IST

TS Inter Results 2024: ఫలితాలు ఎక్కడ చూడాలి?

అభ్యర్థులు ఫలితాలు వెలువడిన వెంటనే ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in/home.do లేదా   https://telugu.hindustantimes.com/telangana-board-result లింక్‌లో ఫలితాలు తెలుసుకోవచ్చు. ఇంటర్ ఫస్టియర్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను ఈ లింక్ ద్వారా చూడొచ్చు.

Thu, 18 Apr 202406:03 AM IST

TS inter results 2024 date: తెలంగాణ ఇంటర్ పరీక్ష  ఫలితాలు ఎప్పుడు వెలువడనున్నాయి?

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు ఈనెల 22వ తేదీ తరువాత ఏ క్షణమైనా వెలువడొచ్చు. మొత్తంగా 25వ తేదీలోపే వెలువడే అవకాశం ఉంది. గత ఏడాది పరీక్షలు పూర్తయిన 35 రోజుల్లోపు ఫలితాలు వెలువడ్డాయి. ఈసారి కూడా అంతే వ్యవధితో పరీక్ష ఫలితాలు వెల్లడించేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే స్పాట్ వాల్యూయేషన్ కూడా పూర్తిచేసింది. ఫలితాల క్రోఢీకరణ కసరత్తులో నిమగ్నమైంది. ఫలితాల వెల్లడికి సంబంధించి అధికారిక ప్రకటన ఒకటి రెండు రోజుల ముందు వెల్లడించనుంది.

Thu, 18 Apr 202406:01 AM IST

TS inter results 2024 date: ఇంటర్ పరీక్షల నిర్వహణ ఇలా

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు నిర్వహించింది. ఇందుకోసం మొత్తం 1521 మేర పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది.

Thu, 18 Apr 202405:59 AM IST

TS inter results 2024 date: ఇంటర్ సెకండియర్ పరీక్షలకు ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారు?

ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహించిన ఇంటర్ సెకండియర్ పరీక్షలకు మొత్తం 5,02,260 మంది విద్యార్థులు పరీక్ష రుసుం చెల్లించారు. వీరిలో 4,44,189 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 58,071 మంది ప్రయివేటుగా ఫీజు చెల్లించారు. సెకండియర్ జనరల్ కోర్సులకు బాలురు 2,30,952 మంది పరీక్ష ఫీజు చెల్లించగా, బాలికలు 2,24,703 మంది దరఖాస్తు చేసుకున్నారు. వొకేషనల్ కోర్సులకు బాలురు 23,968 మంది, బాలికలు 22,637 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Thu, 18 Apr 202405:56 AM IST

TS inter results 2024 date: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు ఎంత మంది హాజరయ్యారు?

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలో నిర్వహించిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 4,78,718 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 4,30,405 మంది విద్యార్థులు జనరల్ కోర్సులకు దరఖాస్తు చేసుకోగా, 48,312 మంది వొకేషనల్ కోర్సులకు పరీక్ష ఫీజు చెల్లించారు.  జనరల్ కోర్సుల్లో 2,12,695 మంది బాలురు, 2,17,710 మంది బాలికలు ఫీజు చెల్లించారు. ఇక వొకేషనల్ కోర్సుల్లో 24,316 మంది బాలురు, 23,966 మంది బాలికలు ఉన్నారు. 

WhatsApp channel

టాపిక్