Gay Couple’s Wedding : గే మ్యారేజ్ ఫొటోలు వైరల్.. తాజ్ మహాల్ ముందు ప్రపోజ్ చేసుకున్నారట-photographs of gay couples wedding ceremony in kolkata ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Photographs Of Gay Couples Wedding Ceremony In Kolkata

Gay Couple’s Wedding : గే మ్యారేజ్ ఫొటోలు వైరల్.. తాజ్ మహాల్ ముందు ప్రపోజ్ చేసుకున్నారట

Jul 05, 2022, 07:21 PM IST HT Telugu Desk
Jul 05, 2022, 07:21 PM , IST

  • హల్దీ వేడుక, పూల అలంకరణ, పెళ్లిలో దండల మార్పిడి, 200 మంది అతిథులు.. ఇదంతా చదువుతుంటే.. అమ్మాయి, అబ్బాయి వివాహమనుకుంటున్నారా? కాదు మండపంలో కూర్చొంది అభిషేక్, చైతన్య అనే ఇద్దరు పురుషులు. ఇద్దరు అబ్బాయిల వివాహ వేడుక కోల్‌కతాలో అట్టహాసంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి.

భారతదేశంలో స్వలింగ వివాహానికి చట్టబద్ధంగా గుర్తింపు లేదు. కానీ భారతదేశం అంతటా చాలా మంది జంటలు తమ పెళ్లి వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు.'నాకు దానిని వివాహ వేడుక అని పిలవడం ఇష్టం. నేను చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నానని చెప్పుకోలేను. కానీ నేను పెళ్లి చేసుకున్నాను. చైతన్య నా భర్త' అని అభిషేక్ చెబుతున్నారు.

(1 / 8)

కోల్‌కతాలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అభిషేక్ రే, గుర్గావ్‌లోని డిజిటల్ మార్కెటింగ్ నిపుణుడు చైతన్య ఫేస్‌బుక్‌లో చాలా సంవత్సరాలు స్నేహితులుగా ఉన్నారు. 2020లో వీరు కలుసుకున్నారు. జులై 3వ తేదీన సాయంత్రం కోల్‌కతాలో సంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి చేసుకున్నారు.

(2 / 8)

తాము ఫేస్‌బుక్‌లో చాలా ఏళ్లుగా స్నేహితులుగా ఉన్నామని అభిషేక్ చెబుతున్నాడు. చైతన్యను 2020లో కలుసుకున్నట్టుగా తెలిపాడు. తమకు చాలా మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారని వెల్లడించారు. లాక్‌డౌన్ సమయంలో తన పుట్టినరోజు సందర్భంగా పిల్లలతో కలిసి పుట్టినరోజు కేక్‌ను కట్ చేస్తున్న చిత్రాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసానని అభిషేక్ చెప్పాడు. చైతన్యకు పిల్లలు అంటే చాలా ఇష్టం. అప్పటి నుంచి తమ ఇద్దరి మధ్య మాటలు మెుదలయ్యాయని తెలిపాడు. అలా ప్రేమలో పడ్డామని నవ్వుతూ చెబుతున్నాడు.

(3 / 8)

'కొన్ని రోజులకు అభిషేక్ కు కొవిడ్ వచ్చింది. మేం మళ్లీ చాట్ చేయడం ప్రారంభించాం. సంభాషణ లోతుగా మారింది. అకస్మాత్తుగా ఒక రోజు, అతను నాకు టికెట్ స్క్రీన్ షాట్ పంపాడు. లాక్‌డౌన్‌ సడలించి విమానాలు తెరుచుకున్నాయి. మేం నంబర్లు కూడా మార్చుకోలేదు. ఇంకా Facebook మెసెంజర్‌లో చాట్ చేస్తున్నాము. కాబట్టి నేను కొంచెం భయపడ్డాను. కానీ చైతన్యను కలవడంతో అంతా మారిపోయింది.' అని అభిషేక్ గుర్తు చేసుకున్నాడు.

(4 / 8)

డిసెంబర్ నుంచి పెళ్లికి ప్లాన్ చేస్తున్నారు వీరు ఇద్దరు. స్వలింగ సంపర్కుడిని పెళ్లి చేసుకునే విషయమై మెుదట ఇంట్లో చెప్పారు. అయితే పెద్ద గొడవే జరిగింది. కానీ మెల్లగా సర్దిచెబితే అందరూ అర్థం చేసుకున్నారు. జులై 3న చాలా పెద్ద ఎత్తున పెళ్లి చేసుకున్నారు. మెహందీ, సంగీత్, కాక్టెయిల్ నైట్ చేశారు. కోలకతా కామాక్ స్ట్రీట్‌లోని బాంక్వెట్ హాల్‌లో ఉదయం హల్దీని, సాయంత్రం పెళ్లి చేసుకున్నారు.

(5 / 8)

తాజ్‌మహల్ ముందు చాలా ఫిల్మీ పద్ధతిలో ప్రపోజ్ చేశాడు చైతన్య. ఓసారి మేం ఆగ్రాకు యాత్ర చేసామని అభిషేక్ చెప్పాడు. అక్కడ అతను నాకు ప్రపోజ్ చేశాడు. చాలా ఫిల్మీ పద్ధతిలో తాజ్ మహల్ ముందు చేయడంతో పడిపోయాను. నా భాగస్వామితో కలిసి తాజ్ మహల్ చూడాలనేది నా కల అని చెప్పుకొచ్చాడు అభిషేక్.

(6 / 8)

కోల్‌కతాలో అభిషేక్ కుటుంబానికి చెందిన సన్నిహితులు వచ్చారు. దాదాపు 200 వందల మంది వరకూ పెళ్లికి హాజరయ్యారు. అందరూ కొత్తజంటను ఆశీర్వదించారు. తమ పెళ్లిని అందరూ ఆదరించడంతో అభిషేక్, చైతన్య ఆశ్చర్యపోయారట.

(7 / 8)

పెళ్లి చాలా ఘనంగా జరిగింది. చైతన్య, అభిషేక్ చుట్టాలు అందరూ వచ్చారు. స్వలింగ వివాహాలు నేరం కాదని.. తమ ఇష్టంతో పెళ్లి చేసుకున్నామని ఇద్దరు ఒకటిగా చెబుతున్నారు. చాలామంది తమకు ధైర్యం చెప్పారని తెలిపారు. ఇది సహజమని ప్రజలు అర్థం చేసుకోవాలని ఇద్దరూ కోరారు.

(8 / 8)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు