IRCTC Tour Package : ద్వారకా చూడాలని ఉందా.. మీ కోసమే ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ
IRCTC SUNDAR SAURASHTRA Tour Package : పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలనుకునే వారి కోసం ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలు ప్రకటిస్తోంది. సుందర్ సౌరాష్ట్ర పేరుతో తాజాగా ప్యాకేజీ అందుబాటులో ఉంది.
దేశంలోని వివిధ ప్రాంతాలను చూడాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ(IRCTC) అందుబాటు ధరలు ప్రకటిస్తోంది. మరో ప్యాకేజీని తీసుకొచ్చింది. అహ్మదాబాద్(AHMEDABAD ), ద్వారకా(Dwaraka), రాజ్‌కోట్, సోమనాథ్, వడోదరను సందర్శించొచ్చు. గుజరాత్ లోని పవిత్రమైన పుణ్యక్షేత్రాలను దర్శించుకొవచ్చు. హైదరాబాద్(Hyderabad నుంచి రైలు ద్వారా ఈ టూర్ ఉంది. నవంబర్ 23న టూర్ ప్రారంభమవుతుంది. ప్రతి బుధవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.
మెుదటి రోజు ప్రయాణికులు సికింద్రాబాద్(secunderabad) రైల్వే స్టేషన్ కు చేరుకోవాలి. మధ్యాహ్నం 3 గంటలకు పోరుబందర్ ఎక్స్ ప్రెస్ బయల్దేరుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది. రెండో రోజు ఉదయం వడోదర(vadodara) స్టేషన్ కు చేరుకుంటారు. హోటల్ కి వెళ్లిన తర్వాత... స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని సందర్శిస్తారు. రాత్రి వడోదరలోనే బస చేస్తారు.
మూడోరోజు హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. తర్వాత... లక్ష్మీ విలాస్ ప్యాలెస్(laxmi vilas palace)కు వెళ్తారు. ఆ తర్వాత అహ్మాదాబాద్ కు పయనమవుతారు. అక్కడ ఉన్న అక్షరదామం(akshardhamam) ఆలయాన్ని దర్శించుకుంటారు. రాత్రి అహ్మాదాబాద్ లోనే బస చేస్తారు. నాలుగో రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత... సబర్మతి ఆశ్రమనికి(sabarmati ashram) చేరుకుంటారు. అక్కడ్నుంచి రాజ్ కోట్ కు వెళ్తారు. మధ్యాహ్నం హెటల్ కి వెళ్లిన తర్వాత వ్యాస్టన్ మ్యూజియాన్ని సందర్శిస్తారు. గాంధీ మ్యూజియం, స్వామి నారాయణ్ ఆలయాన్ని దర్శించుకుంటారు. రాత్రి రాజ్ కోట్ లోనే బస చేస్తారు.
ఐదోరోజు హోటల్ నుంచి ద్వారకా(Dwaraka) చేరుకుంటారు. ఆ తర్వాత జామ్ నగర్ కు వెళ్తారు. తిరిగి ద్వారకకు చేరుకొని రాత్రి ఇక్కడే బస చేస్తారు. ఆరో రోజు ద్వారకాదిశ్ ఆలయానికి వెళ్తారు. చెక్ అవుట్ అయిన తర్వాత సోమ్‌నాథ్ ఆలయాన్ని(somnath temple) దర్శించుకుంటారు. సాయంత్రం సమయానికి పోరుబందర్ కు చేరుకుంటారు. రాత్రి వరకు పోరుబందర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. ఏడోరోజు అర్ధరాత్రి 12.20 గంటలకు ట్రైన్ సికింద్రాబాద్ బయల్దేరుతుంది. ఎనిమిదో రోజు ఉదయం 08.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
ధరలివే..
Hyderabad To Sundar Saurastra Tour Cost : సింగిల్ షేరింగ్ కు రూ. 51,570 ధరగా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 28,830గా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.22,230 గా ఉంది. 3AC కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్న పిల్లలకు కూడా వేర్వురు ధరలు ఉన్నాయి. టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ సందర్శించొచ్చు.