IRCTC Tour Package : పూర్వ సంధ్య టూర్.. ఈ ప్రాంతాలకు వెళ్లి రావొచ్చు
IRCTC Poorva Sandhya Tour Package : ఐఆర్‌సీటీసీ టూరిజం కొత్త ప్యాకేజీని ప్రకటించింది. పూర్వ సంధ్య పేరుతో టూర్ అందుబాటులో ఉంది. తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుపతి, తిరుమల వెళ్లాలనుకునే వారి కోసం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
తిరుపతి(Tirupati)తోపాటుగా చుట్టు పక్కల ఆలయాలకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్(Hyderabad) నుంచి టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ(IRCTC). పూర్వ సంధ్య(Poorva Sandhya) పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. రైలు మార్గంలో వెళ్లొచ్చు. తిరుమల, తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలు తిరిగిరావొచ్చు. సికింద్రాబాద్ లో టూర్ ప్రారంభవుతుంది. మూడు రాత్రులు, నాలుగు రోజులు ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. నవంబర్ 30న అందుబాటులో ఉంది.
Day 1 : లింగంపల్లి(Lingampally) నుండి సాయంత్రం 05:25 గంటలకు రైలు బయలుదేరుతుంది. సికింద్రాబాద్ 06:10 గంటలకు చేరుకుంటుంది. నల్గొండ నుంచి 07:38 గంటల నుంచి బయలుదేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
Day 2 : తిరుపతి(Tirupati)కి ఉదయం 05:55 గంటలకు చేరుకుంటారు. పికప్ చేసుకుని.. హోటల్‌కి తీసుకెళ్తారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాలకు వెళ్లాలి. తర్వాత శ్రీ కాళహస్తి, తిరుచానూరు ఆలయాన్ని సందర్శించాలి. తర్వాత హోటల్‌కి తిరిగి వెళ్తారు. రాత్రి తిరుపతిలో బస చేస్తారు.
Day 3 : అల్పాహారం చేసి.. హోటల్(Hotel) నుంచి చెక్ అవుట్ అవ్వాలి. వేంకటేశ్వర స్వామి(Venkateswara Swamy) ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం 08:30 గంటలకు తిరుమలకు బయలుదేరాలి. . సాయంత్ర 06:25 గంటలకు రైలు ఉంటుంది. తిరుపతి రైల్వే స్టేషన్(Tirupati Railway Station) నుంచి బయలుదేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
Day 4 : నల్గొండ(Nalgonda)కు 03:04 గంటలకు చేరుకుంటారు. సికింద్రాబాద్‌కు 05:35 గంటలకు, లింగంపల్లికి 06:55 గంటలకు వస్తారు. దీంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్‌సీటీసీ పూర్వ సంధ్య(IRCTC Poorva Sandhya) పేరుతో టూర్ ప్యాకేజీలు ఉంది. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనం ఉంటుంది. రైలు టికెట్లు, హోటల్‌లో వసతి, దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్(Travel Insurance) ఉంటాయి. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ఇది. స్టాండర్డ్ క్లాసులో సింగిల్ ఆక్యూపెన్సీకి రూ. 6600గా ఉంది. డబుల్ ఆక్యూపెన్సీ రూ. 5300, ట్రిపుల్ ఆక్యూపెన్సీ ధర రూ.5280గా నిర్ణయించారు. కంఫర్ట్ క్లాసులో సింగిల్ ఆక్యూపెన్సీ ధర రూ.8260, డబుల్ ఆక్యూపెన్సీ రూ. 7160, ట్రిపుల్ ఆక్యూపెన్సీ రూ.7140గా నిర్ధారించారు.
సంబంధిత కథనం