Pragya Jaiswal: టీమిండియాలోని లవర్ బాయ్‌కి హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ డేటింగ్ ఆఫర్.. మరి క్రికెటర్ ఎలా స్పందిస్తాడో?
Pragya Jaiswal Dating: భారత క్రికెటర్లు, హీరోయిన్స్ డేటింగ్ చేయడం కొత్తేమీ కాదు. ఇలా డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్ల జాబితా కూడా చాలా పెద్దగానే ఉంది. అయితే.. తాజాగా మరో జంట..?
రత క్రికెటర్‌తో డేటింగ్ చేయాల్సి వస్తే..ఎవరితో డేట్ చేస్తారు? అని హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్‌ని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ఆమె ఏమాత్రం సంకోచించకుండా టీమిండియాలోని లవర్ బాయ్ పేరు చెప్పింది. టాలీవుడ్ నుంచి ఇటీవల బాలీవుడ్‌కి వెళ్లిన ప్రగ్యా జైశ్వాల్ అక్కడ వరుస సినిమాలు చేస్తోంది. అలానే నందమూరి బాలకృష్ణతో అఖండ మూవీ సీక్వెల్ అఖండ-2లోనూ నటిస్తోంది. రామోజీఫిల్మ్ సిటీలో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.
క్రికెటర్లు, హీరోయిన్స్ డేటింగ్ లిస్ట్ పెద్దదే
క్రికెటర్లు, సినిమా హీరోయిన్లు డేటింగ్ చేయడం.. పెళ్లి చేసుకోవడం కొత్తేమీ కాదు. దశాబ్దాలుగా ఇప్పటికే ఎన్నో జంటల్ని అభిమానుల్ని చూశారు. విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, కేఎల్ రాహుల్ తదితరులు హీరోయిన్స్‌తో డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నవారే. అయితే.. ప్రస్తుతం టీమిండియాలో ఇలా హీరోయిన్స్‌తో డేటింగ్ చేస్తున్న క్రికెటర్ల జాబితాని పరిశీలిస్తే.. మొదట కనిపించే.. వినిపించే పేరు యంగ్ క్రికెటర్ శుభమన్ గిల్.
ఇప్పటికే ఇద్దరితో గిల్ డేటింగ్
టీమిండియాలో స్టార్ ప్లేయర్‌గా ఉన్న శుభమన్ గిల్.. ఇప్పటికే సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్.. ఆ తర్వాత హీరోయిన్ సారా అలీ ఖాన్‌తో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఒకసారి గిల్, సారా కెమెరాలకి కూడా చిక్కారు. కానీ.. అధికారికంగా మాత్రం ఇద్దరూ ఎప్పుడూ డేటింగ్ గురించి స్పందించలేదు. కానీ.. గిల్ మాత్రం.. తాను డేటింగ్‌లో ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో సంకేతాలిచ్చాడు.
సింగిల్.. రెడీ టు మింగిల్
ప్రగ్వా జైశ్వాల్‌కి ఇటీవల ఇంటర్వ్యూలో క్రికెటర్‌తో డేటింగ్ చేస్తారా? అని ప్రశ్నించగా.. నిస్సందేహంగా అని బదులిచ్చిన ముద్దుగుమ్మ శుభమన్ గిల్ పేరుని ప్రస్తావించగా.. సిగ్గుపడిపోయింది. ‘‘ప్రస్తుతం నేను సింగిల్.. మింగిల్ అవ్వడానికి రెడీ.. మనకి రాసిపెట్టి ఉంటే కచ్చితంగా జరుగుతుంది. నేను విధిని నమ్ముతాను’’ అని ప్రగ్యా జైశ్వాల్ చెప్పుకొచ్చింది.
ఆస్ట్రేలియాలో గిల్
శుభమన్ గిల్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. చేతి వేలి గాయం కారణంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నవంబరు చివర్లో జరిగిన పెర్త్ టెస్టుకి దూరంగా ఉండిపోయిన శుభమన్ గిల్.. అడిలైడ్ వేదికగా డిసెంబరు 6 నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్టు కోసం సిద్ధమవుతున్నాడు. మరి ప్రగ్వా జైశ్వాల్.. డేటింగ్ ఆఫర్‌పై క్రికెటర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
టాపిక్