తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tirumala Tour : ఒకే ఒక్క రోజులో తిరుమల ట్రిప్, ఫ్రీగా శ్రీవారి శీఘ్రదర్శనం - తెలంగాణ టూరిజం నుంచి అదిరిపోయే ప్యాకేజీ

Tirumala Tour : ఒకే ఒక్క రోజులో తిరుమల ట్రిప్, ఫ్రీగా శ్రీవారి శీఘ్రదర్శనం - తెలంగాణ టూరిజం నుంచి అదిరిపోయే ప్యాకేజీ

08 May 2024, 16:12 IST

    • Telangana Tourism Tirumala Tour : తిరుమల వెళ్లే వారికి తెలంగాణ టూరిజం అదిరిపోయే టూర్‌ ప్యాకేజీని తీసుకొచ్చింది. కేవలం ఒక్కరోజు వ్యవధిర
తిరుమల టూర్ ప్యాకేజీ
తిరుమల టూర్ ప్యాకేజీ

తిరుమల టూర్ ప్యాకేజీ

Telangana Tourism Hyderabad Tirumala Tour : తిరుమల శ్రీవారి భక్తుల కోసం మంచి ప్యాకేజీ వచ్చేసింది. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే ఈ టూర్ ప్యాకేజీ పూర్తి అవుతుంది. దీన్ని తెలంగాణ టూరిజం ఆపరేట్ చేస్తుంది. బస్సులోనే వెళ్లాల్సి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Food Inspection in Hyderabad : పాడైపోయిన ఆహార పదార్థాలు, పాటించని ప్రమాణాలు - తనిఖీల్లో విస్తుపోయే విషయాలు..!

Karimnagar Tourism : చారిత్రాత్మక ప్రదేశాలు, ప్రసిద్ధి చెందిన ఆలయాలు - కరీంనగర్ జిల్లాలో చూడాల్సిన ప్రాంతాలివే..!

19 May 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

TS ECET 2024 Results : రేపు తెలంగాణ ఈసెట్ 2024 ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండి

ఈ టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు చూస్తే పెద్దలకు రూ. 3,700గా ఉంది. ఇక చిన్నారులకు రూ. 2,960గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుంది.

తిరుమల టూర్ ప్యాకేజీ వివరాలు :

  • TIRUPATI - TIRUMALA TOUR పేరుతో తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది.
  • హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది.
  • కేవలం ఒకే ఒక్క రోజులోనే తిరుపతి, తిరుమల, తిరుచానూర్ కవర్ అవుతాయి.
  • Day 1 - సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుంచి బస్సు బయల్దేరుతుంది. (సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9848540374)
  • Day 2 - ఉదయం 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. ఫ్రెషప్ అయిన తర్వాత స్థానంకంగా ఉండే ఆలయాలను చూస్తారు. ఆ తర్వాత తిరుమలలో శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుంది. అనంతరం తిరుపతికి చేరుకుంటారు.
  • తిరుపతిలో ఫ్రెషప్ అవుతారు. సాయంత్రం 5 గంటలకు రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది.
  • Day 3 - ఉదయం 7 గంటల వరకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
  • తెలంగాణ టూరిజం బస్సు ప్యాకేజీలో టిక్కెట్లు బుక్ చేసుకున్న యాత్రికులందరూ తెలంగాణ టూరిజం బస్సులో మాత్రమే ప్రయాణించాలి. సొంత వాహనాల్లో వచ్చి దర్శన టికెట్లు కోసం రిపోర్ట్ చేస్తే టీటీడీ అధికారులు తిరస్కరిస్తారు. మీ డబ్బులు వాపస్ కూడా ఇవ్వబడవు.

తదుపరి వ్యాసం