Hyderabad City Tour : హైదరాబాద్ సిటీ టూర్, వండర్ లా లో ఎంజాయ్- తెలంగాణ టూరిజం ప్యాకేజీ వివరాలివే!
Hyderabad City Tour : ఈ వేసవిలో కాస్త మీ మైండ్ రీఫ్రెష్ చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే తెలంగాణ టూరిజం హైదరాబాద్ సిటీ టూర్, వండర్ లా టూరిజం ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి.
Hyderabad City Tour : తెలంగాణ టూరిజం శాఖ హైదరాబాద్ లోని పర్యాటక ప్రదేశాల సందర్శనకు సిటీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. హైదరాబాద్ సిటీ హెరిటేజ్-కమ్-మ్యూజియం డైలీ టూర్ ప్యాకేజీలో బిర్లా మందిర్, చౌమహల్లా ప్యాలెస్, చార్మినార్, మక్కా మసీదు, లాడ్ బజార్‌లో షాపింగ్, సాలార్ జంగ్ మ్యూజియం, నిజాం కుపురానీ పెవిలియోన్, గుపురానీ పెవిలియన్, షాహీ టూంబ్స్, లుంబినీ పార్క్ సందర్శించవచ్చు.
హైదరాబాద్ సిటీ హెరిటేజ్ కమ్ మ్యూజియం టూర్ లో కవర్ చేసే ప్రదేశాలు
- బిర్లా మందిర్
- చౌమహల్లా ప్యాలెస్ (శుక్రవారం మూసివేస్తారు)
- చార్మినార్
- మక్కా మసీదు & లాడ్ బజార్ వద్ద షాపింగ్ (నడక ద్వారా)
- సాలార్‌జంగ్ మ్యూజియం (శుక్రవారం ఉండదు)
- నిజాం జూబ్లీ పెవిలియన్ (నిజాం మ్యూజియం - పురాణి హవేలి) (శుక్రవారం మూసివేస్తారు)
- నెహ్రూ జూ పార్క్ (శుక్రవారాల్లో మాత్రమే)
- గోల్కొండ కోట
- కుతుబ్ షాహీ టూంబ్స్ (బయటి వీక్షణ మాత్రమే)
- IMAX రోడ్ ఖైరతాబాద్ (టూర్ ముగిసే ప్రదేశం)
- పర్యాటకుల అభ్యర్థనపై శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, హియామయత్‌నగర్ వద్ద టెర్మినేటింగ్ పాయింట్ అనుమతిస్తారు.
అన్ని మ్యూజియంలు శుక్రవారం మూసివేస్తారు. దీని బదులుగా శుక్రవారం నెహ్రూ జూ పార్క్ కవర్ చేస్తారు. ప్రతి శుక్రవారం 7 స్థలాలు, మిగిలిన అన్ని రోజులు 9 స్థలాలు టూర్ ప్యాకేజీ కవర్ చేస్తారు.
నాన్ A/C
- అడల్ట్- రూ.380
- చైల్డ్ - రూ.300
A/C
- అడల్ట్ - రూ.500
- చైల్డ్ -రూ.400
బుకింగ్ కోసం సంప్రదించాల్సిన ప్రదేశాలు
- 07:30 AM - రిజర్వేషన్ కార్యాలయం, TSTDC, యాత్రి నివాస్, S.P.రోడ్, సికింద్రాబాద్- ఫోన్: 9848126947
- 07:45 AM- రిజర్వేషన్ కార్యాలయం, TSTDC, టూరిజం ప్లాజా, బేగంపేట్, హైదరాబాద్- ఫోన్: 8367285285
- 08:15 AM - CRO బషీర్‌బాగ్, గ్రౌండ్ ఫ్లోర్ శకర్ భవన్, ఎదురుగా. CCS పోలీస్ కంట్రోల్ రూమ్, టాటా మోటార్స్ పక్కన, బషీర్‌బాగ్, హైదరాబాద్- Ph నం: 9848540371
హైదరాబాద్ వండర్ లా ప్యాకేజీ
హైదరాబాద్ పట్టణానికి అతి చేరువలో ఉన్న వండర్ లా టూర్ ప్యాకేజీని తెలంగాణ టూరిజం అందిస్తోంది. వాటర్ స్పోర్ట్స్, స్విమ్మింగ్ ఫూల్, ఇంకా క్రేజీగా టూర్ ఎంజాయ్ చేసేందుకు వండర్ లా అద్భుతమైన ప్రదేశం. వేసవిలో మిమ్మల్ని రీఫ్రెష్ చేసే అద్భుతమైన ప్రదేశం. మీ కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసేందుకు ఇక్కడ 40కి పైగా ఉల్లాసకరమైన రైడ్‌లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లోని అత్యుత్తమ అమ్యూజ్మెంట్ పార్క్. తెలంగాణ టూరిజం రోజువారీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది.
టారీఫ్
- పెద్దలకు- రూ.1750
- పిల్లలకు- రూ.1400
తెలంగాణ టూరిజం ప్యాకేజీల పూర్తి వివరాలు, బుకింగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.