Tirumala Rains : తిరుమలలో భారీ వర్షం, భక్తులకు ఉపశమనం
- Tirumala Rains : తిరుమలలో వరుసగా మూడో రోజు భారీ వర్షం కురిసింది. తిరుమల కొండపై ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
- Tirumala Rains : తిరుమలలో వరుసగా మూడో రోజు భారీ వర్షం కురిసింది. తిరుమల కొండపై ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
(1 / 6)
తిరుమలలో వరుసగా మూడో రోజు భారీ వర్షం కురిసింది. తిరుమల కొండపై ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
(Twitter)(2 / 6)
తిరుమల క్షేత్రంలో ఇవాళ మధ్యాహ్నం వడగండ్ల వాన కురిసింది. దీంతో కొండపై వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న భక్తులకు వర్షం ఉపశమనం కల్పించింది. గురువారం నుంచి తిరుమలలో వర్షాలు కురుస్తున్నాయి.
(Twitter)(3 / 6)
తిరుమలలో భారీ వానతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షంతో తిరుమలగిరులు చల్లబడ్డాయి. నిన్నటి గాలి వానకు కౌస్తుభం అతిథి గృహం వద్ద భారీ వృక్షం విరిగిపడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
(Twitter)(4 / 6)
తిరుపతి, పలమనేరులో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. గత మూడు రోజులుగా తిరుమలలో వర్షాలు కురుస్తున్నాయి.
(Twitter)(5 / 6)
ఈ నెల 6 నుంచి తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతారణ శాఖ తెలిపింది.
(Twitter)ఇతర గ్యాలరీలు