తెలుగు న్యూస్  /  Telangana  /  Gold And Silver Rates On 21st September 2022

Gold Silver Rate Today: పెరిగిన బంగారం, వెండి ధరలు - హైదరాబాద్​లో ఎంతంటే

21 September 2022, 6:41 IST

    • Gold and Silver Price today 21st september 2022: కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. అయితే మంగళవారం ధర కాస్త తగ్గగా... ఇవాళ స్వల్పంగా పెరిగింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50,130గా నమోదైంది. మరోవైపు ఇవాళ వెండి రేటు పెరిగింది.
బంగారం వెండి ధరలు,
బంగారం వెండి ధరలు,

బంగారం వెండి ధరలు,

Gold silver price today 21st september 2022: బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా.. ధరలు పైపైకి వెళ్లాయి. మంగళవారం ధరలు కాస్త తగ్గగా... ఇవాళ మరోసారి స్వల్పంగా ఎగబాకాయి. 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారంపై రూ.100 పెరగగా.. 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంపై కూడా రూ. 110 ఎగబాకింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50,130గా నమోదైంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

TS SSC Results: తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల.. 91శాతం ఉత్తీర్ణత, గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు

TS 10th Results 2024: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇదే

Light Beers : తెలంగాణలో లైట్ బీర్లు దొరకడంలేదు, ఎక్సైజ్ అధికారులకు యువకుడు ఫిర్యాదు

CM Revanth Reddy On Notices : బీజేపీని ప్రశ్నిస్తే నోటీసులే, దిల్లీ పోలీసుల సమన్లపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్

22 క్యారెట్ల బంగారం రేటు రూ. 45,950 వద్ద కొనసాగుతోంది. ఇక ఇవాళ వెండిపై రూ. 500 పెరిగి ...హైదరాబాద్ మార్కెట్ కిలో వెండి ధర రూ.61,800గా ఉంది

Gold silver price: ఏపీలో ఇలా…

gold silver prices in ap: విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.45,950గా ఉంది. 24 క్యారెట్స్ బంగారం ధర 50,130గా నమోదైంది. ఇక్కడ వెండి ధర కిలో రూ. 61,800 వద్ద కొనసాగుతోంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,950 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,130గా ఉంది.

Gold silver price: పలు నగరాల్లో ఇలా..

gold and silver rate in india: దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరల్లో వ్యత్యాసం ఉంది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,510గా ఉంది.

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,130గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,100గా ఉంటే… 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,130 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,000గా ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,180 వద్ద ఉంది. ఇక కోల్ కత్తాలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 50,130గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,950 వద్ద కొనసాగుతోంది.

Platinum Price today: ప్లాటినం ధరలు ఇలా..

ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 540 చొప్పున పెరిగింది. హైదరాబాద్‌లో ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 23,580గా ఉంది. విజయవాడలో, విశాఖపట్నంలోనూ ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 23,580గా ఉంది.

ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉన్నాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనే రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల వంటి అంశాలు కూడా ప్రభావితం చేస్తున్నాయి.