తెలుగు న్యూస్  /  National International  /  Gold Rate Today 19th July 2022 Latest Updates In Telugu

Gold rate today : మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇవే..

Sharath Chitturi HT Telugu

19 July 2022, 6:33 IST

    • Gold rate today : దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. మీ నగరాల్లోని తాజా ధరల కోసం ఇక్కడ చూడండి.
నేటి బంగారం ధర వివరాలు ఇలా
నేటి బంగారం ధర వివరాలు ఇలా (PTI)

నేటి బంగారం ధర వివరాలు ఇలా

Gold rate today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల పసిడి ధర(22క్యారెట్లు) ప్రస్తుతం రూ. 46,190గా ఉంది. సోమవారం కూడా బంగారం ధర రూ. 46,190గానే ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10గ్రాములు) రూ. 50,390గా ఉంది. సోమవారం కూడా ఇదే ధర పలికింది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,190 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 50,390గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,880గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,140గాను ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల బంగారం​ రూ. 46,270గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 50,470గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,190గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,390గా నమోదైంది. విజయవాడ, వైజాగ్​లో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, రూపాయి విలువ పతనం.. బంగారం ధరల హెచ్చుతగ్గులకు కారణాలుగా తెలుస్తోంది.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. కేజీ వెండి రూ. 400 పెరిగి.. రూ. 56,000గా ఉంది. సోమవారం కేజీ వెండి ధర రూ. 55,600గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 61,700 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాల్​ 56,000.. బెంగళూరులో 61,700.. ముంబైలో 56,000.. చెన్నైలో 61,700గా ఉన్నాయి.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు సైతం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 21,820కి చేరింది. కాగా.. సోమవారం కూడా ఇదే ధర పలికింది.

ఇక హైదరాబాద్​లో ప్రస్తుతం ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 21,820గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)